అన్వేషించండి

Kidney Stones Diet : కిడ్నీ స్టోన్స్ ఉంటే డైట్లో చేయాల్సిన మార్పులు ఇవే.. తినకూడని, తినాల్సిన ఫుడ్స్ లిస్ట్

Diet Plan for Kidney Stones : కిడ్నీ స్టోన్స్ చాలా నొప్పిని కలిగిస్తాయి. అలాంటివారు డైట్లో కొన్ని మార్పులు చేస్తే.. ఇబ్బందులు దూరం చేసుకోవచ్చు. మరి తినాల్సిన, తినకూడని ఫుడ్స్ ఏంటో చూసేద్దాం. 

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • మూత్రపిండాల రాళ్లను నివారించడానికి పుష్కలంగా నీరు తాగాలి.
  • సిట్రస్ పండ్లు, కాల్షియం అధికంగా ఉండే పాల ఉత్పత్తులు మంచివి.
  • పాలకూర, చాక్లెట్లు, ఉప్పు, అధిక మాంసాహారం తగ్గించాలి.
  • వైద్యుల సలహా మేరకు ఆహార నియమాలను పాటించాలి.

Best and Worst Foods for Kidney Stones : మూత్రపిండాలు రక్తాన్ని శుద్ధి చేసి.. వ్యర్థ పదార్థాలను మూత్రం ద్వారా బయటకు పంపిస్తాయి. కానీ కొన్నిసార్లు ఈ వ్యర్థ పదార్థాలు కిడ్నీలో గడ్డగా మారి రాళ్లలా ఏర్పడతాయి. వీటినే కిడ్నీ స్టోన్స్ అంటారు. సరైన ఆహారపు అలవాట్లు పాటిస్తే స్టోన్స్ పెరగకుండా నివారించవచ్చు. కొన్ని సందర్భాల్లో తగ్గించుకోవచ్చు కూడా. మరి కిడ్నీలో స్టోన్స్ ఉంటే తినాల్సిన ఫుడ్స్ ఏంటో.. తినకూడని ఫుడ్స్ ఏంటో తెలుసుకుందాం. 

తప్పకుండా తినాల్సిన ఫుడ్స్

నీళ్లు : కిడ్నీ స్టోన్స్ ఉన్నవారు రోజుకు కనీసం 3 నుంచి 4 లీటర్ల నీళ్లు తాగడం చాలా అవసరం. ఎక్కువగా తాగితే మూత్రం పలుచగా అవుతుంది. దీంతో స్టోన్స్ తయారయ్యే అవకాశం తగ్గుతుంది. 

సిట్రస్ ఫ్రూట్స్ : నిమ్మకాయలో సిట్రేట్ అనే పదార్థం ఉంటుంది. ఇది కిడ్నీలో స్టోన్స్ పెరగకుండా అడ్డుకుంటుంది. రోజూ నిమ్మరసం నీళ్లు తాగితే చాలా మేలు కలిగిస్తుంది.

కాల్షియం ఫుడ్స్ : చాలామంది కాల్షియం తింటే స్టోన్స్ పెరుగుతాయని అనుకుంటారు. కానీ నిజానికి కాల్షియం, పేగుల్లో ఆక్సలేట్‌ను బంధించి.. అది కిడ్నీకి చేరకుండా నిరోధిస్తుంది. దీనికోసం పాలు, పెరుగు, మజ్జిగ, రాగి జావా, చీజ్ వంటివి తీసుకోవాలి. 

కూరగాయలు : క్యారెట్, బీట్రూట్ మితంగా తీసుకోవాలి. బ్రోకలీ, క్యాబేజీ, గోంగూర, కీరదోస వంటివి తీసుకోవచ్చు. 

పండ్లు : ఖర్బూజ శరీరంలో నీటి శాతం పెంచుతుంది. అరటిపండులో పొటాషియం ఉంటుంది. యాపిల్, పియర్, పైనాపిల్ వంటివి తీసుకోవచ్చు. 

ధాన్యాలు : పప్పులు, బ్రౌన్ రైస్, ఓట్స్, బార్లీ నీళ్లు కూడా కిడ్నీని శుభ్రంగా ఉంచడానికి హెల్ప్ చేస్తాయి. 

తినకూడని ఫుడ్స్..

ఆక్సలేట్ అధికంగా ఉన్న ఆహారాలు తినకూడదు. పాలకూర, చాక్లెట్, కోకో, వేరుశెనగ, పీనట్ బటర్, బీట్రూట్, టీ వంటివాటికి దూరంగా ఉండాలి. ఉప్పు ఎక్కువగా తింటే మూత్రంలో కాల్షియం పరిమాణం పెరిగి స్టోన్స్ ఏర్పడే ప్రమాదం పెరుగుతుంది. చిప్స్, పికిల్స్ వంటివి తగ్గించాలి. ప్యాకేజ్డ్ ఫుడ్స్, రెడీ టు ఈట్ ఫుడ్స్ మానేయాలి. వంటలో ఉప్పు తక్కువగా వేసుకుంటే మంచిది. 

రెడ్ మీట్, చికెన్, చేపలు అధికంగా తింటే మూత్రంలో యూరిక్ యాసిడ్ పెరిగి యూరిక్ యాసిడ్ స్టోన్స్ ఏర్పడతాయి. కోల్డ్ డ్రింక్స్, సోడాలు, ఎనర్జీ డ్రింక్స్, అధిక చక్కెర ఉండే డ్రింక్స్ తీసుకోకూడదు. అధిక మోతాదులో విటమిన్ C సప్లిమెంట్లు తీసుకుంటే అవి శరీరంలో ఆక్సలేట్‌గా మారి స్టోన్స్ పెరగవచ్చు. డాక్టర్ సలహా లేకుండా సప్లిమెంట్లు వాడవద్దు. ఆల్కహాల్ శరీరాన్ని డీహైడ్రేట్ చేస్తుంది. మూత్రపిండాలపై ఒత్తిడి పెంచుతుంది. స్టోన్స్ ఉన్నవారు పూర్తిగా మానాలి.

గుర్తుంచుకోవాల్సిన విషయాలు

రోజూ కనీసం 3 నుంచి 4 లీటర్ల నీళ్లు తప్పకుండా తాగాలి. ఉప్పు, మాంసాహారం తగ్గించాలి. పాలకూర, చాక్లెట్, టీ మితంగా వాడాలి. నిమ్మరసం రోజూ తాగడం అలవాటు చేసుకోవాలి. స్వయంగా మందులు వాడకుండా వైద్యుల సూచనలు తీసుకోవాలి. 

గమనిక : ఈ కథనంలో అందించిన సమాచారం నిపుణులు పంచుకున్నారు. ఇది సాధారణ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది. వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే, ఎల్లప్పుడూ మీ వైద్యుడు లేదా ఇతర అర్హత కలిగిన ఆరోగ్య సంరక్షణ ప్రదాత సలహా తీసుకోండి.

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Breastfeeding Diet : తల్లిపాలు ఇచ్చే సమయంలో అతిగా తినకూడదా? డైట్‌లో చేర్చుకోవాల్సిన, తీసేయాల్సిన ఫుడ్స్ ఇవే
తల్లిపాలు ఇచ్చే సమయంలో అతిగా తినకూడదా? డైట్‌లో చేర్చుకోవాల్సిన, తీసేయాల్సిన ఫుడ్స్ ఇవే
Wearing Slippers at Home : ఇంట్లో చెప్పులు వేసుకుని నడవాలా? లేక చెప్పులు లేకుండా నడవాలా? ఆరోగ్యానికి ఏది మంచిదో తెలుసా?
ఇంట్లో చెప్పులు వేసుకుని నడవాలా? లేక చెప్పులు లేకుండా నడవాలా? ఆరోగ్యానికి ఏది మంచిదో తెలుసా?
High Uric Acid : యూరిక్ యాసిడ్ పెరగడానికి కారణాలివే.. సమస్యను తగ్గించుకోవాలంటే ఈ ఫుడ్స్ తింటూ ఈ పనులు చేయాలట
యూరిక్ యాసిడ్ పెరగడానికి కారణాలివే.. సమస్యను తగ్గించుకోవాలంటే ఈ ఫుడ్స్ తింటూ ఈ పనులు చేయాలట
Cheating in Relationships : చీటింగ్ చేయడంలో మగవారు, ఆడవారికి మధ్య తేడాలు ఉంటాయా? వివాహేతర సంబంధాలకి కారణాలు ఇవే
చీటింగ్ చేయడంలో మగవారు, ఆడవారికి మధ్య తేడాలు ఉంటాయా? వివాహేతర సంబంధాలకి కారణాలు ఇవే

వీడియోలు

Jaya Chiravuri Serials and US Life | జయ చిరవూరి రోజుకి ఎంత సంపాదిస్తుందో తెలుసా?
Changes In Team India Support Staff | టీమిండియా సపోర్ట్ స్టాఫ్‌పై బిసిసిఐ వేటు
India Fielding Coach T Dilip Emotional Post | ఫీల్డింగ్ కోచ్‌గా ముగిసిన దిలీప్ ప్రయాణం
Virat Kohli World Record | వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసిన విరాట్ కోహ్లీ
Bumrah Ruled Out Of Test Series | శ్రీలంక టెస్ట్ సిరీస్‌ నుంచి బుమ్రా అవుట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Police Vehicle Rapido: పోలీసు వాహనాన్ని ర్యాపిడో బైక్‌గా వాడేస్తున్నారు - సోషల్ మీడియాలో వీడియో వైరల్.. విచారణకు ఆదేశం!
పోలీసు వాహనాన్ని ర్యాపిడో బైక్‌గా వాడేస్తున్నారు - సోషల్ మీడియాలో వీడియో వైరల్.. విచారణకు ఆదేశం!
Khanapur MLA Wedma Bojju: ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు హెచ్చరికతో దిగొచ్చిన ఫారెస్ట్ అధికారులు - రేంజ్ ఆఫీసర్ సస్పెన్షన్ -జన్నారంలో సడలిన ఉద్రిక్తత!!
ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు హెచ్చరికతో దిగొచ్చిన ఫారెస్ట్ అధికారులు - రేంజ్ ఆఫీసర్ సస్పెన్షన్ -జన్నారంలో సడలిన ఉద్రిక్తత!!
AP High Court Rejects CBI Probe on Mega DSC: మెగా డీఎస్సీపై వైఎస్సార్‌సీపీకి హైకోర్టు షాక్ - సీబీఐ విచారణకు నిరాకరణ - పిల్ వ్యవస్థను రాజకీయం చేయొద్దని ఘాటు వ్యాఖ్యలు!
మెగా డీఎస్సీపై వైఎస్సార్‌సీపీకి హైకోర్టు షాక్ - సీబీఐ విచారణకు నిరాకరణ - పిల్ వ్యవస్థను రాజకీయం చేయొద్దని ఘాటు వ్యాఖ్యలు!
Harish Rao Black Magic Row: క్షుద్ర పూజల ఆరోపణలతో తెలంగాణ రాజకీయాల్లో కలకలం -కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య మొదలైన అరుంధతి, పశుపతి వివాదం!
క్షుద్ర పూజల ఆరోపణలతో తెలంగాణ రాజకీయాల్లో కలకలం -కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య మొదలైన అరుంధతి, పశుపతి వివాదం!
Crop Insurance Scheme: రూ. 84 చెల్లించి, నిశ్చింతగా ఉండండి.. ఏపీ రైతులకు ప్రభుత్వం కీలక సూచనలు
రూ. 84 చెల్లించి, నిశ్చింతగా ఉండండి.. ఏపీ రైతులకు ప్రభుత్వం కీలక సూచనలు
Udhayanidhi Stalin Bail: త్రిషపై వివాదాస్పద వ్యాఖ్యల కేసులో ఉదయనిధి స్టాలిన్‌కు ఊరట! విడుదల చేయాలని కోర్టు ఆదేశం 
త్రిషపై వివాదాస్పద వ్యాఖ్యల కేసులో ఉదయనిధి స్టాలిన్‌కు ఊరట! విడుదల చేయాలని కోర్టు ఆదేశం 
Utnoor Gond Fort: ఎకో టూరిజం కేంద్రంగా గోండు రాజుల చారిత్రాత్మక కోట అభివృద్ధి
ఎకో టూరిజం కేంద్రంగా గోండు రాజుల చారిత్రాత్మక కోట అభివృద్ధి
ప్రీపెయిడ్ కస్టమర్లకు సైతం స్పాటిఫై ప్రీమియం సహా 3 సేవలు అందిస్తున్న Vi
ప్రీపెయిడ్ కస్టమర్లకు సైతం స్పాటిఫై ప్రీమియం సహా 3 సేవలు అందిస్తున్న Vi
Embed widget