అన్వేషించండి

Fatty Liver : కాలేయంలో కొవ్వు పెరగడానికి కారణాలు.. సహజంగా తగ్గించగలిగే టిప్స్ ఇవే

Fatty Liver Reducing Tips : ఎవరికైనా మొదటి దశలో కొవ్వు కాలేయం ఉంటే జీవనశైలి మార్పులతో నయం చేయవచ్చు.

Fatty Liver Causes : కాలేయంలోని కణాలలో అదనపు కొవ్వు పేరుకుపోవడం వల్ల ఫ్యాటీ లివర్ సమస్య వస్తుంది. లివర్​లో కొంత కొవ్వు ఉండటం సాధారణం. కానీ అది 5-10% కంటే ఎక్కువ పేరుకుపోతే తీవ్రమైన ఆరోగ్య, కాలేయ సమస్యలకు దారితీస్తుంది. ఆల్కహాల్ తీసుకోవడం వల్ల ఫ్యాటీ లివర్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది. కానీ ఆల్కహాల్ తీసుకోని వారిలో కూడా ఫ్యాటీ లివర్ ప్రమాదం ఎక్కువగానే ఉంటుంది. దీని వెనుక అనేక కారణాలు ఉన్నాయి. ఊబకాయం, సరైన ఆహారం తీసుకోకపోవడం, కూర్చొని ఎక్కువసేపు పని చేయడం, వ్యాయామం చేయకపోవడం, మధుమేహం వంటి సమస్యలు ఫ్యాటీ లివర్ ప్రమాదాన్ని పెంచుతాయి. గుండెపోటు సమస్యలు కూడా లివర్​పై నెగిటివ్​గా ప్రభావం చూపిస్తాయి. 

ఫ్యాటీ లివర్ వల్ల వచ్చే రోగాలివే

కాలేయంలో కొవ్వు పెరిగి.. సమస్య ముదిరితే.. ఫైబ్రోసిస్, సిర్రోసిస్, లివర్ ఫెయిల్యూర్, లివర్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది. అయితే ఫ్యాటీ లివర్​ను మొదటి దశలో గుర్తిస్తే.. జీవనశైలిలో మార్పులు చేసుకోవడం ద్వారా మళ్లీ వెనక్కి తిరిగి తీసుకురావచ్చు.  

ఫ్యాటీ లివర్ సమస్యను ఎలా తగ్గించుకోవచ్చంటే..  

జీవనశైలిలో మార్పులు చేసుకోవడం ద్వారా ఫ్యాటీ లివర్​ తగ్గించుకోవచ్చు. ముఖ్యంగా ప్రారంభ దశలోనే కొవ్వులో కాలేయం ఉందని గుర్తిస్తే..  ఫ్యాటీ లివర్ సమస్య నుంచి బయటపడవచ్చు. దీనిని రివర్స్ చేయడంకోసం పోషకాహారం తీసుకోవాలని వైద్యులు సిఫార్సు చేస్తున్నారు. ముందుగా ఆహార నియమాల్లో మార్పులు చేస్తే ఫ్యాటీ లివర్ ప్రభావం త్వరగా తగ్గుతుందిన చెప్తున్నారు. ప్రాసెస్ చేసిన ఆహారం, అధిక చక్కెరను తీసుకోవడం నివారించాలి. కూరగాయలు, తృణధాన్యాలు, తక్కువ కొవ్వు కలిగిన ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులను డైట్​లో చేర్చుకోవాలి. ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ అధికంగా ఉండే ఆహారం తీసుకోవాలి. ఫుడ్ ఈ సమస్యను తగ్గించడంలో మేజర్ రోల్ ప్లే చేస్తుంది.

వైద్యులు సూచించే నియమాలు పాటిస్తూ.. జీవక్రియను మెరుగుపరచుకోవడానికి రెగ్యులర్​గా వ్యాయామం చేయాలి. వారానికి 150 నిమిషాల వ్యాయామ సమయం ఉండేలా చూసుకోవాలి. ఏరోబిక్స్ చేస్తూ బరువును తగ్గించుకోవడం ద్వారా..  కాలేయంలో కొవ్వు పేరుకుపోకుండా ఉంటుంది. అలాగే ఫుడ్ కంట్రోల్ చేయాలని సూచిస్తే చాలామంది క్రష్ డైట్లు చేస్తారని.. వాటికి దూరంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. ఎందుకంటే త్వరగా బరువు తగ్గడం వల్ల మంచి కంటే ఎక్కువ చెడే జరుగుతుందని చెప్తున్నారు. అన్నింటికంటే ముందు, ఫ్యాటీ లివర్ ఉన్నవారు ఆల్కహాల్ తీసుకోకూడదు. అలాగే కాలేయ పనితీరును మెరుగుపరచడానికి తగినంత నీరు తాగాలి. 

ఈ తరహా ఆరోగ్య నియమాలతో ఫ్యాటీ లివర్ సమస్య నుంచి మంచిగా కోలుకోవచ్చు. జీవనశైలి, ఆహారంలో ఈ మార్పులు చేసుకోవడం వల్ల మూడు నెలల్లోనే గ్రేడ్ 1 ఫ్యాటీ లివర్ నుంచి రికవరీ అయ్యే అవకాశముంది. కాలేయంలో కొవ్వు శాతం గ్రేడ్ 2 అయితే నియమాలు మరింత కఠినంగా ఉంటాయి. ఆ సమయంలో వైద్యులు కొన్ని మందులు సూచిస్తారు. సమస్య మరింత తీవ్రంగా ఉంటే, వైద్యుడి సలహా మేరకు కొన్ని నియమాలు కచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. 

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Dussehra Navratri Day 7 : అమ్మవారికి 7వ రోజు పెట్టాల్సిన నైవేద్యాలు ఇవే.. శ్రీ మహాలక్ష్మీ దేవికి పూర్ణాలు, పాలన్నం ఇలా చేసేయండి
అమ్మవారికి 7వ రోజు పెట్టాల్సిన నైవేద్యాలు ఇవే.. శ్రీ మహాలక్ష్మీ దేవికి పూర్ణాలు, పాలన్నం ఇలా చేసేయండి
Dussehra Navratri Day6 : అమ్మవారికి 6వ రోజు పెట్టాల్సిన నైవేద్యాలు ఇవే.. శ్రీ సరస్వతి దేవికి పరవాన్నం ఇలా చేసేయండి
అమ్మవారికి 6వ రోజు పెట్టాల్సిన నైవేద్యాలు ఇవే.. శ్రీ సరస్వతి దేవికి పరవాన్నం ఇలా చేసేయండి
White Chicken : నోరూరింటే వైట్ చికెన్ కర్రీ.. 10/10 రెస్టారెంట్ స్టైల్ రెసిపీ ఇదే.. పక్కా ట్రై చేయండి
నోరూరింటే వైట్ చికెన్ కర్రీ.. 10/10 రెస్టారెంట్ స్టైల్ రెసిపీ ఇదే.. పక్కా ట్రై చేయండి
Beer vs Breezer : బీర్‌కు, బ్రీజర్‌కు తేడా ఏంటి? ఆల్కహాల్‌ శాతం, ఆరోగ్యంపై ప్రభావాలు, అసలు తేడాలు ఇవే
బీర్‌కు, బ్రీజర్‌కు తేడా ఏంటి? ఆల్కహాల్‌ శాతం, ఆరోగ్యంపై ప్రభావాలు, అసలు తేడాలు ఇవే

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
RTC Special Buses: జేబీఎస్‌, ఎంజీబీఎస్‌లో దసరా పండగ రద్దీ.. బస్సుల కోసం గంటల పాటు ప్రయాణికుల పడిగాపులు
జేబీఎస్‌, ఎంజీబీఎస్‌లో దసరా పండగ రద్దీ.. బస్సుల కోసం గంటల పాటు ప్రయాణికుల పడిగాపులు
TDP Second List of Candidates: పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు.. టీడీపీ అభ్యర్థుల రెండో జాబితా విడుదల
పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు.. టీడీపీ అభ్యర్థుల రెండో జాబితా విడుదల
Horror Thrilelr OTT : ఓటీటీలోకి హారర్ థ్రిల్లర్ - 7 కోట్లతో తీస్తే 2,500 కోట్ల కలెక్షన్స్... ఫ్రీగా స్ట్రీమింగ్ అయ్యేది ఎప్పుడంటే?
ఓటీటీలోకి హారర్ థ్రిల్లర్ - 7 కోట్లతో తీస్తే 2,500 కోట్ల కలెక్షన్స్... ఫ్రీగా స్ట్రీమింగ్ అయ్యేది ఎప్పుడంటే?
Jadeja ODI Exit?: రెస్ట్ అంటూనే స్టార్ ఆల్ రౌండర్ కు శాశ్వత గుడ్ బై..!! వరల్డ్ కప్ ప్రణాళికల నుంచి  జడేజా ఔట్, అక్షర్  కు పట్టం కట్టిన సెలెక్టర్లు!
రెస్ట్ అంటూనే స్టార్ ఆల్ రౌండర్ కు శాశ్వత గుడ్ బై..!! వరల్డ్ కప్ ప్రణాళికల నుంచి  జడేజా ఔట్, అక్షర్  కు పట్టం కట్టిన సెలెక్టర్లు!
Dachepalli YCP Candidate Arrest: దాచేపల్లి వైసీపీ ఛైర్మన్‌ అభ్యర్థి కొప్పుల రవి అరెస్ట్‌.. ఇంట్లో 429 సీసాల తెలంగాణ లిక్కర్ సీజ్!
దాచేపల్లి వైసీపీ ఛైర్మన్‌ అభ్యర్థి కొప్పుల రవి అరెస్ట్‌.. ఇంట్లో 429 సీసాల తెలంగాణ లిక్కర్ సీజ్!
Amaravati News: అమరావతి నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు, ఏడీబీ నుంచి మరో రూ.15,000 కోట్ల లోన్!
అమరావతి నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు, ఏడీబీ నుంచి మరో రూ.15,000 కోట్ల లోన్!
Jabardasth Emmanuel : హీరోగా జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్ - క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్‌తో ఎంట్రీ... ఫస్ట్ లుక్ చూశారా?
హీరోగా జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్ - క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్‌తో ఎంట్రీ... ఫస్ట్ లుక్ చూశారా?
APPSC Jobs: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్: ఏపీపీఎస్సీ నుంచి 302 ఉద్యోగాలకి నోటిఫికేషన్లు విడుదల
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్: ఏపీపీఎస్సీ నుంచి 302 ఉద్యోగాలకి నోటిఫికేషన్లు విడుదల
Embed widget