ఒబెసిటీ వల్ల శరీరంలో ఫ్యాట్ పెరుగుతుంది. ఇది లివర్​పై కొవ్వును పేరుకునేలా చేస్తుంది.

టైప్ 2 డయాబెటిస్ వల్ల లివర్ దగ్గర ఫ్యాట్ స్టోరేజ్ పెరుగుతుంది.

హై కొలెస్ట్రాల్ వల్ల లిపిడ్ లెవెల్స్ పెరుగుతాయి. ఇది లివర్ ఫ్యాట్ పెంచుతుంది.

ఆల్కహాల్ ఎక్కువగా తాగడం వల్ల కూడా లివర్ ఫ్యాట్ వస్తుంది.

సరిగ్గా తినకపోవడం, షుగర్స్ ఎక్కువగా తీసుకోవడం, కార్బ్స్, ఫ్యాట్ వల్ల కూడా సమస్యలు వస్తాయి.

ఫిజికల్​గా యాక్టివిటీ లేకపోవడం వల్ల కూడా ఈ సమస్య వస్తుంది.

సడెన్​గా బరువు తగ్గడం వల్ల కూడా లివర్ ఫ్యాట్ సమస్యలు వస్తాయి.

కొన్ని రకాల మెడిసన్స్ ఉపయోగించడం వల్ల కూడా ఫ్యాటీ లివర్ వస్తుంది.

ఫ్యామిలీలో ఎవరైనా ఈ సమస్యతో ఇబ్బంది పడుతుంటే మీకు వచ్చే అవకాశముంది.

PCOS సమస్య ఉంటే కూడా ఫ్యాటీ లివర్ ఛాన్స్​లు ఎక్కువ.