అన్వేషించండి

Prime Minister Narendra Modi warns Union Ministers బొద్దింక ఎఫెక్ట్‌! మంత్రులకు ప్రధానమంత్రి క్లాస్! రాబోయేది జెన్‌ జీ మంత్రివర్గమే! 

జెన్ జెడ్ శైలికి అనుగుణంగా మారాలని కేంద్ర మంత్రులను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హెచ్చరించారు. లేకుంటే మార్పు తప్పని హెచ్చిరించారు. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ ఆ దిశగానే ఉంటుదని  సంకేతాలు ఇచ్చారు.  

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ప్రధాని మోదీ మంత్రులకు యువతతో మమేకం అవ్వాలని సూచించారు.
  • సోషల్ మీడియా, రీల్స్ ద్వారా యువత ఆలోచనలు తెలుసుకోవాలన్నారు.
  • యువతను ఆకర్షించడానికి వారి వేదికలపైకి వెళ్లాలని చెప్పారు.
  • జెన్‌జీ కేబినెట్ రాబోతోందని, పనితీరు ఆధారంగా మార్పులుంటాయని సూచన.

Prime Minister Narendra Modi warns Union Ministers :కాక్రోచ్‌ జనతా పార్టీ, వారం రోజులుగా బాగా ట్రెండ్ అవుతున్న అంశం. ముఖ్యంగా జెన్‌జీ ఈ ఉద్యమాన్ని భుజానకెత్తుకుంది. ప్రభుత్వాలను, వ్యవస్థలను ప్రశ్నించింది. అయితే దీని ప్రభావమో ఏంటో కానీ ప్రధానమంత్రి కూడా జన్‌జీ మంత్రివర్గం రాబోతోందని సంకేతాలు ఇచ్చారు. నేటి తరంతో మమేకం కావాలని మంత్రులకు సూచించారు. సోషల్ మీడియా ద్వారా వారి ఆలోచనలు పసిగట్టాలని క్లాస్ తీసుకున్నారు. రీల్స్‌లో చాలా విషయాలు అర్థమవుతాయని, ఎంతమందికి వాటి గురించి తెలుసని ప్రశ్నించారు. 

రాజకీయం అంే ఒకప్పుడు సభలు, సమావేశాలు, గోడపై రాతలు. కానీ ఇప్పుడు కాలం మారింది. ఓటరు నాడి రీల్స్ రూపంలో, సోషల్ మీడియా పోస్టుల రూపంలో బహిర్గతం అవుతోంది. ఇదే విషయాన్ని ప్రధానమంత్రి మోదీ తన మంత్రివర్గ సహచరులకు అత్యంత స్పష్టంగా, కాస్త ఘాటుగా వివరించారు. గురువారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో మోదీ కేవలం పాలన గురించి మాత్రమే కాకుండా, మంత్రుల పనితీరు, ముఖ్యంగా జెన్‌జీ యువతతో వారు ఎంత వరకు మమేకమవుతున్నారనే అంశంపై సుదీర్ఘంగా చర్చించారు. 

మంత్రులకు మోదీ సంధించిన నాలుగు ప్రశ్నలు 

సమావేశం ప్రారంభం కావడమే ఒక ఆసక్తికరమైన ప్రశ్నతో. మీలో ఎంత మంది ఇన్‌స్టాగ్రామ్‌లో ఉన్నారు అని ప్రధఆని అడిగినప్పుడు చాలా మంది మంత్రులు ఆశ్చర్యపోయారు. ఆ తర్వాత మోదీ నుంచి ప్రశ్నలు వచ్చాయి. రీల్స్ గురించి మీలో ఎంతమందికి తెలుసు, ప్రభుత్వ కార్యక్రమాలు లేదా పార్టీ కార్యక్రమాలు గురించి ఎప్పుడైనా రీల్స్‌లో ప్రచారం చేశారా, కనీసం మీ గురించి మీరు సోషల్ మీడియాలో చెప్పుకున్నారా, దేశంలో యువత ఏ విధంగా ఆలోచిస్తుందో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారా అని క్వశ్చన్ చేయడంతో అంతా ఆశ్చర్యపోయారు. 

ఈ ప్రశ్నల వెనుక మోదీకి ఒక బలమైన వ్యూహం ఉంది. నేటి తరం యువత వార్తా పత్రికలు, చదవడం లేదు.టీవీ చూడటం లేదు. వారంతా నిరంతరం సోషల్ మీడియాలోనే గడుపుతున్నారని మోదీ అభిప్రాయం. యువతను ఆకర్షించాలంటే ప్రభుత్వం వారి భాషలో వారు ఉండే వేదికలపైకి వెళ్లాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు. 

జెన్‌జీ వ్యతిరేకం కాదు 

యువతకు, ముఖ్యంగా 18-30 ఏళ్ల మధ్య ఉన్న వారికి బీజేపీ అంటే వ్యతిరేకత ఉందన్న వాదనను మోదీ తోసిపుచ్చారు. పశ్చిమ బెంగాల్‌ ను ఉదాహరణగా చూపించారు. బెంగాల్ యువత పార్టీకి అండగా నిలబడిందని, వారిని సరైన పద్ధతిలో చేరుకోగలిగితే ఫలితాలు అద్భుతంగా ఉంటాయని మోదీ సూచించారు. యువత ఆలోచనలకు తగినట్టుగా మంత్రులు తమ పనితీరు మార్చుకోవాలని లేకపోతే వారిని మార్చాల్సి ఉంటుందని సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. 

రాబోయేది జెన్‌జీ కేబినెట్‌ 

ఈ సమావేశం తర్వాత కేంద్ర మంత్రివర్గంలో భారీ మార్పులు ఉంటాయనే ప్రచారం మొదలైంది. పని తీరు ఆధారంగా కొందరికి పదోన్నతులు, మరికొందరికి ఉద్వాసన తప్పకపోవచ్చని సమాచారం. ఈసారి కేబినెట్‌ విస్తరణలో జేడీయూ, టీడీపీ వంటి మిత్ర పక్షాలకు అదనపు శాఖలు కేటాయించే ఛాన్స్ ఉంది. ఇంధనం, వ్యవసాయం, పౌర విమానయానం, షిప్పింగ్, మౌలిక సదుపాయాల వంటి కీలక శాఖలపై మోదీ ప్రత్యేక దృష్టి సారించినట్టు తెలుస్తోంది. వచ్చే ఏడాది జరగబోయే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఉత్తర్‌ప్రదేశ్, గుజరాత్, పంజాబ్,ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్, హిమాచల్ ప్రదేశ్‌ వంటి రాష్ట్రాలకు మంత్రివర్గంలో ప్రాధాన్యత పెరగవచ్చు.

Frequently Asked Questions

ప్రధాని మోదీ మంత్రివర్గ సహచరులకు ఏమి సూచించారు?

నేటి తరంతో మమేకం కావాలని, సోషల్ మీడియా ద్వారా వారి ఆలోచనలు పసిగట్టాలని, రీల్స్‌లో చాలా విషయాలు అర్థమవుతాయని ప్రధాని మోదీ మంత్రులకు సూచించారు.

మంత్రులను ప్రధాని మోదీ ఏ ప్రశ్నలు అడిగారు?

ప్రధాని మోదీ మంత్రులను ఇన్‌స్టాగ్రామ్‌లో ఉన్నారా, రీల్స్‌ గురించి ఎంతమందికి తెలుసు, ప్రభుత్వ/పార్టీ కార్యక్రమాల గురించి రీల్స్‌లో ప్రచారం చేశారా, యువత ఆలోచనలను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారా అని అడిగారు.

యువతను ఆకర్షించడానికి ప్రధాని మోదీ వ్యూహం ఏమిటి?

నేటి యువత సోషల్ మీడియాలోనే ఎక్కువ సమయం గడుపుతున్నారని, వారిని ఆకర్షించాలంటే ప్రభుత్వం వారి భాషలో, వారు ఉండే వేదికలపైకి వెళ్లాలని ప్రధాని మోదీ అభిప్రాయపడ్డారు.

బిజెపికి యువత వ్యతిరేకం కాదని ప్రధాని మోదీ ఎలా చెప్పారు?

పశ్చిమ బెంగాల్‌ యువత పార్టీకి అండగా నిలిచిందని, వారిని సరైన పద్ధతిలో చేరుకుంటే ఫలితాలు అద్భుతంగా ఉంటాయని ప్రధాని మోదీ ఉదాహరణగా చూపారు.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Jharkhand Students Protest:జార్ఖండ్‌ విద్యార్థుల రణభేరీ! సీజీఎల్ రద్దు కోరుతూ అసెంబ్లీ ముట్టడి!
జార్ఖండ్‌ విద్యార్థుల రణభేరీ! సీజీఎల్ రద్దు కోరుతూ అసెంబ్లీ ముట్టడి!
IRCTC Japan Tour Package : IRCTC జపాన్ టూర్ ప్యాకేజీ.. తక్కువ బడ్జెట్‌లో 10 రోజుల ప్రత్యేక ప్యాకేజీని పొందండి, పూర్తి వివరాలివే
IRCTC జపాన్ టూర్ ప్యాకేజీ.. తక్కువ బడ్జెట్‌లో 10 రోజుల ప్రత్యేక ప్యాకేజీని పొందండి, పూర్తి వివరాలివే
Gen Z Protests India 2026: జెన్‌జీ ఉద్యమాలు, ప్రశాంత్ కిషోర్ విజయం బీజేపీ స్క్రిప్టేనా - దేశ రాజకీయాల్లో అసలేం జరుగుతోంది?
జెన్‌జీ ఉద్యమాలు, ప్రశాంత్ కిషోర్ విజయం బీజేపీ స్క్రిప్టేనా - దేశ రాజకీయాల్లో అసలేం జరుగుతోంది?
Mamata Banerjee Car Attack: మమతా బెనర్జీ కారుపై దాడి.. టీఎంసీ అధినేత్రి ఏ కారును ఉపయోగిస్తారు? అది ఎంత సురక్షితం
మమతా బెనర్జీ కారుపై దాడి.. టీఎంసీ అధినేత్రి ఏ కారును ఉపయోగిస్తారు? అది ఎంత సురక్షితం
Advertisement

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jharkhand Students Protest:జార్ఖండ్‌ విద్యార్థుల రణభేరీ! సీజీఎల్ రద్దు కోరుతూ అసెంబ్లీ ముట్టడి!
జార్ఖండ్‌ విద్యార్థుల రణభేరీ! సీజీఎల్ రద్దు కోరుతూ అసెంబ్లీ ముట్టడి!
Priyanka Death Case:రాజమండ్రి మెడికో విద్యార్థి ప్రియాంక మృతిపై దర్యాప్తు వేగవంతం! రాజకీయం చేయొద్దని తండ్రి విజ్ఞప్తి!
రాజమండ్రి మెడికో విద్యార్థి ప్రియాంక మృతిపై దర్యాప్తు వేగవంతం! రాజకీయం చేయొద్దని తండ్రి విజ్ఞప్తి!
Hyderabad Road Accident: నిన్న రాజమండ్రిలో వైద్య విద్యార్థి! నేడు హైదరాబాద్‌లో రిటైర్డ్ జవాన్‌! ప్రాణాలు తీస్తున్న మద్యం మత్తు!
నిన్న రాజమండ్రిలో వైద్య విద్యార్థి! నేడు హైదరాబాద్‌లో రిటైర్డ్ జవాన్‌! ప్రాణాలు తీస్తున్న మద్యం మత్తు!
Gen Z Protests India 2026: జెన్‌జీ ఉద్యమాలు, ప్రశాంత్ కిషోర్ విజయం బీజేపీ స్క్రిప్టేనా - దేశ రాజకీయాల్లో అసలేం జరుగుతోంది?
జెన్‌జీ ఉద్యమాలు, ప్రశాంత్ కిషోర్ విజయం బీజేపీ స్క్రిప్టేనా - దేశ రాజకీయాల్లో అసలేం జరుగుతోంది?
పల్సర్‌ 150లో భారీ మార్పులు.. కొత్త ఇంజిన్‌, కొత్త ఫ్రేమ్‌తో వస్తున్న బజాజ్‌ యూత్‌ఫుల్‌ బైక్‌!
కొత్త బజాజ్‌ పల్సర్‌ 150 న్యూ లుక్‌ భలే ఉంది, మీరు చూశారా?.. ఫోటోలు లీక్‌
Telangana BJP: తెలంగాణలో ఇకపై పోరు కాంగ్రెస్ Vs బీజేపీ మాత్రమే - రోడ్ మ్యాప్ రెడీ చేసిన హైకమాండ్ - ఇక కమలం దూకుడేనా?
తెలంగాణలో ఇకపై పోరు కాంగ్రెస్ Vs బీజేపీ మాత్రమే - రోడ్ మ్యాప్ రెడీ చేసిన హైకమాండ్ - ఇక కమలం దూకుడేనా?
SlumDog Update : విజయ్ సేతుపతి స్లమ్ డాగ్ నుంచి బిగ్ సర్ప్రైజ్ - టబు As డిప్యూటీ కమిషనర్ గౌరీ హెగ్డే
విజయ్ సేతుపతి స్లమ్ డాగ్ నుంచి బిగ్ సర్ప్రైజ్ - టబు As డిప్యూటీ కమిషనర్ గౌరీ హెగ్డే
This Week Theatrical Releases : సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ To అగధ వరల్డ్ - ఈ వారం థియేట్రికల్ రిలీజెస్... మీరు ఛాయిస్ ఏంటి?
సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ To అగధ వరల్డ్ - ఈ వారం థియేట్రికల్ రిలీజెస్... మీరు ఛాయిస్ ఏంటి?
Embed widget