Thotapalli Madhu: జయసుధకి సారీ చెప్పిన సీనియర్ రైటర్, యాక్టర్ తోటపల్లి మధు.. అసలు ఏమైందంటే?
Thotapalli Madhu: సీనియర్ రైటర్ తోటపల్లి మధు గతంలో ఒక ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ పై క్లారిటీ ఇచ్చారు. తాను ఎందుకు అలా మాట్లాడానో వివరించారు. ఈసందర్బంగా ఆయన క్షమాపణలు కూడా చెప్పారు.
Writer Thotapalli Madhu Saying Sorry To Jayasudha: ఒక్కోసారి ఆలోచించకుండా మాట్లాడే మాటలు ఇబ్బందుల్లో పడేస్తాయి. ఒకటి మాట్లాడబోయి మరోటి మాట్లాడితే అది కాంట్రవర్సీ అవుతుంది. అదే జరిగింది సీనియర్ రచయిత తోటపల్లి మధు విషయంలో. ఇటీవల ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూ ఒకటి తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. ఆయన చెప్పిన విషయాలు వైరల్ అయ్యాయి. ఆ కాంట్రవర్సీపై ఆయనే స్వయంగా ఒక వీడియో రిలీజ్ చేశారు కూడా. సారీ చెప్తూ వివరణ ఇచ్చారు కూడా. అయితే, ఇప్పుడు ఆ అంశంపై మరోసారి క్లారిటీ ఇచ్చారు తోటపల్లి మధు. తను అలా ఎందుకు మాట్లాడారో చెప్పారు. ఈ సందర్భంగా ఆయన జయసుధకి కూడా క్షమాపణలు చెప్పారు.
అసలు ఆయన ఏమన్నారంటే?
ఒక ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తోటపల్లి మధు దివంగత డైరెక్టర్ కోడి రామకృష్ణ గురించి, జయసుధ, అప్పటి ఎంతోమంది నటుల గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కోడి రామ కృష్ణ అన్నీ అబద్ధాలు చెపేవారని అన్నారు. జయ సుధని కూడా ఎన్నో మాటలు అన్నారు. ఆ మాటల గురించి క్లారిటీ ఇవ్వాలని.. అలాంటి విషయాలు ఎందుకు మాట్లాడారు అంటూ సదరు ఛానెల్ ఆయన్ను మళ్లీ ఇంటర్వ్యూ చేసింది. దాంట్లో ఆయన చేసిన కామెంట్స్ పై క్లారిటీ ఇచ్చారు.
ఇంట్రెస్టింగ్ గా ఉండాలని చెప్పాను..
"మనం ఇంట్రెస్టింగ్ విషయాలు రేపటి తరానికి చెప్పాలి. రైటర్ గా నేను అది చేశాను ఇది చేశాను అంటే బోర్ కొడుతుంది కదా. అలా ఆ విషయాలు చెబుదాం అనుకున్నాను. కోడి రామకృష్ణ గురించి గారి గురించి అన్న దానిపై క్లారిటీ ఇస్తాను. నేను అది సగమే చెప్పాను. అది మాట్లాడుతున్నప్పుడు ఇక్కడ ఏదో చిన్న టెక్నికల్ ప్రాబ్లమ్ రావడంతో ఆపేశాను. ఆ తర్వాత ఆ మ్యాటర్ జంప్ అయిపోయింది. అబద్దం అబద్దం అని అన్నాను. అది ఎందుకు అన్నానంటే.. ఆయన చనిపోయినప్పుడు చూడానికి వెళ్లాను. అప్పుడు నా మనసులో ఎన్ని అబద్ధాలు చెప్పేవారు ఈయన అనుకున్నాను. ఆ రోజు నాలో నాకు ఏం అనిపించిందంటే.. అబద్ధమే కవిత్వం. ఎంత గొప్ప అబద్ధం చెప్పి ప్రేక్షకులను మెప్పించగలిగితే.. అంత గొప్ప కళాకారుడు అవుతారు సినిమాలో. సినిమా సహజమైంది కాదు. సహజమైంది అనిపిస్తుంది అంతే. అంత బాగా చూపించేవాడు సినిమా అని అనుకున్నాను. అదే చెబుదాం అనుకుని, వేరే ఏదో చెప్పి వదిలేశాను. ఇక కాఫీ టీ అంశం గురించి నేను ఉదాహరణ మాత్రమే చెప్పాను. ఆయన గురించి ఏమీ చెప్పలేదు. ఆయన్ని అవమాన పరచాల్సిన అవసరం లేదు. మేం ఇద్దరం చాలా మంచి ఫ్రెండ్స్. ఆయన మీద నాకేం ఉంటుంది. మా అనుభవాలు, తర్వాతి తరాలకు తెలియాలనే చెప్పాను" అంటూ క్లారిటీ ఇచ్చారు ఆయన. కోడి రామకృష్ణ కుటుంబసభ్యులు హర్ట్ అయ్యారు అని తెలిసి తాను స్వయంగా సారీ చెప్పిన విషయాన్ని కూడా ఆయన గుర్త చేశారు.
జయసుధ గారికి వెయ్యి సారీలు..
అదే ఇంటర్వ్యూలో జయసుధ గారిపై కూడా కామెంట్స్ చేశారు మధు. దానిపై కూడా ఆయన క్లారిటీ ఇచ్చారు. "మేడం గురించి నేను ఎప్పుడూ తప్పుగా అనలేదు. అప్పుడు అలా ఉండేవాళ్లం అని మాత్రమే చెప్పాను. ఎవరి మీద నేను అస్సలు చెప్పనేలేదు. నా ఇంటర్వ్యూ కాదు ఇన్నర్ వ్యూ చెప్పాను. నన్ను ఎంతోబాగా చూసుకునేవాళ్లు అని ఫ్లోలో చెప్పాను. 95.. ఆ టైంలో శాంతినికేతన్ సీరియల్ రాశాను. దానికి రోజూ సిట్టింగ్ లు ఉండేవి. అర్ధరాత్రి వెళ్లేవాడిని. సవేరా హోటల్ స్విమ్మింగ్ పూల్ పక్కన మేం కూర్చునేవాళ్లం అని చెప్పాను. అక్కడ డ్రింక్ చేశారు అని నేను చెప్పలేదు. మేడం గారి గురించైతే అస్సలు చెప్పనేలేదు. ఆవిడ ఏంటంటే లీడర్స్ ఆఫ్ మార్క్ అంటారు. జయసుధ గారు అంటే మాకు అభిమానం కాదు వీరాభిమానం. సినిమాలో చాలామందికి సెలక్టివ్ ఇమ్నీషియా ఉంటుంది. ఇప్పుడెవరైనా నెగటివ్ గా మాట్లాడితే గతంలో వాళ్లు చేసిన మంచిని కూడా ఇప్పుడు మర్చిపోతారు. అలా ఆమె మర్చిపోయి ఉండొచ్చు. నేను అన్న విషయానికి ఆమె హర్ట్ అయ్యారు కదా. దానికి జయసుధ గారికి వెయ్యి క్షమాపణలు చెప్తున్నాను. ఆమెకే కాదు ఆమె అభిమానులకు, ఆమె కుటుంబసభ్యులకు, ఆమె కుటుంబసభ్యుల్లో నేను ఒకడిని కాబట్టి నాకు కూడా నేను సారీ చెప్పుకుంటున్నాను. జయసుధ గారు మీకు నమస్కారం. మన ట్రావెలింగ్ అంతా మీరు మర్చిపోయినా.. నేను మర్చిపోలేదు. నేను ఏ తప్పు చేయలేదు. నేను ఏ తప్పు చెప్పలేదు. అయినా సరే క్షమాపణ చెప్తున్నాను" అన్నారు.
Also Read: సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన అల్లరి నరేశ్.. 'ఆ ఒక్కటి అడక్కు'