అన్వేషించండి

Aa Okkati Adakku: సైలెంట్‌గా ఓటీటీలోకి వ‌చ్చేసిన అల్ల‌రి న‌రేశ్.. 'ఆ ఒక్క‌టి అడ‌క్కు'

ప్ర‌ముఖ న‌టుడు అల్ల‌రి న‌రేశ్, ఫ‌రియా అబ్దుల్లా న‌టించిన సినిమా 'ఆ ఒక్క‌టీ అడ‌క్కు'. ఈ సినిమా సైలెంట్ గా ఓటీటీకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాంలో ప్రస్తుతం ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది.

Allari Naresh's Aa Okkati Adakku quietly Released In OTT: కామెడీ చిత్రాలతో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు టాలీవుడ్ హీరో అల్లరి నరేశ్. కానీ, ఈ మ‌ధ్య స్టైల్ మార్చి సీరియ‌స్ సినిమాల‌తో ప్రేక్ష‌కులకు ముందుకు వ‌చ్చాడు. 'నాందీ', 'ఉగ్రం', 'నా సామి రంగ' లాంటి సినిమాలు చేసి హిట్ కొట్టాడు. ఇక ఇప్పుడు మ‌ళ్లీ మిమ్మ‌ల్ని క‌డుపుబ్బా నవ్విస్తాను అంటూ మ‌రోసారి కామెడీ జోన‌ర్‌తో ప్రేక్ష‌కులు మందుకు వ‌చ్చాడు. అదే 'ఆ ఒక్క‌టీ ఆడ‌క్కు'. మే 3న థియేట‌ర్ల‌లో రిలీజ్ అయ్యింది ఈ సినిమా. ప్రేక్ష‌కుల‌ను పెద్ద‌గా మెప్పించ‌లేక పోయింది. అల్ల‌రోడు జ‌నాల్ని పెద్ద‌గా న‌వ్వించ‌లేక‌పోయాడు. ఇప్పుడు సినిమాని ఓటీటీలో రిలీజ్ చేసేశారు. సైలెంట్ గా ఓటీటీలోకి వ‌చ్చేసింది ఈ సినిమా. ఎలాంటి ముంద‌స్తు ప్ర‌క‌ట‌న లేకుండా ఓటీటీలో ప్ర‌త్య‌క్షం అయ్యింది. 

స్ట్రిమింగ్ ఎక్క‌డంటే? 

ప్ర‌ముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ లో అందుబాటులోకి వ‌చ్చింది 'ఆ ఒక్క‌టీ అడ‌క్కు' సినిమా. రిలీజైన 20 రోజుల‌కే ఓటీటీలోకి వ‌చ్చేసింది. మే 31 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. థియేట‌ర్ల‌లో పెద్ద‌గా స్పంద‌న లేక‌పోవ‌డంతో ఓటీటీలో రిలీజ్ చేసిన‌ట్లు తెలుస్తోంది. నిజానికి సినిమా రిలీజైన మూడు నెల‌ల‌కు గాని ఓటీటీల్లోకి రావు. కానీ, కొన్ని సినిమాలు మాత్రం ముందుగానే వ‌చ్చేస్తున్నాయి. ఈ మ‌ధ్య చాలా సినిమాలు థియేట‌ర్లలో చూడ‌ని ప్ర‌జ‌లు ఓటీటీల్లో చూసేందుకు ఆస‌క్తి చూపిస్తున్నారు. బాక్సాఫీస్ ద‌గ్గ‌ర బోల్తా ప‌డ్డా.. ఓటీటీల్లో మాత్రం బంప‌ర్ హిట్ కొడుతున్నాయి. చాలా సినిమాలో ఓటీటీలో ట్రెండింగ్ గా నిలుస్తున్నాయి.

క‌థేంటంటే? 

గణ అలియాస్ గణపతి (అల్లరి నరేష్) సబ్ రిజిస్ట్రార్ ఆఫీసు ఉద్యోగి. తన కంటే ముందు తమ్ముడు (విరూపాక్ష ఫేమ్ రవికృష్ణ)కి, మేనమామ కూతురు దేవి (జేమీ లివర్)కి పెళ్లి చేస్తాడు. వయసు ఎక్కువ కావడంతో పాటు పెళ్లైన తమ్ముడు ఉండటంతో అతడికి పిల్లను ఇవ్వడానికి అమ్మాయిల‌ తల్లిదండ్రులు ఎవరూ ముందుకు రారు. పెళ్లి సంబంధాలు చూడటంలో హాఫ్ సెంచరీ కంప్లీట్ చేస్తాడు. ఆ తర్వాత మ్యాట్రిమోనీ సైట్ ద్వారా పరిచయమైన సిద్ధి (ఫరియా అబ్దుల్లా)తో ప్రేమలో పడతాడు. అయితే... 'నేను మీకు కరెక్ట్ కాదు' అని చెప్పి సున్నితంగా తిరస్కరిస్తుంది ఆ అమ్మాయి. కానీ, ఇద్దరూ స్నేహితులుగా మెలుగుతారు. మ్యాట్రిమోనీలో తన పేరు నమోదు చేసుకుని అబ్బాయిల దగ్గర డబ్బులు దోచే ఖిలాడీ లేడి సిద్ధి అని వార్తల్లో ఎందుకు వచ్చింది? ఓ మ్యాట్రిమోనీ సంస్థ ప్రజల్ని ఏ విధంగా మోసం చేసింది? పెళ్లి కాని అబ్బాయిలు ఏ విధంగా మోసపోయారు?  సిద్ధి ఎవరు? ఆమె నేపథ్యం ఏమిటి? నిజానిజాలు ఏమిటి? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి. 

మల్లి అంకం డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో అల్ల‌రి న‌రేశ్ హీరో కాగా.. ఫ‌రియా అబ్దుల్లా ఆయ‌న స‌ర‌స‌న హీరోయిన్ గా చేశారు. ఈ సినిమాలో  జెమీ లివర్, 'వెన్నెల' కిశోర్, మురళీ శర్మ, గౌతమి, హర్ష చెముడు, ర‌వికృష్ణ‌ తదితరులు కీల‌క పాత్ర‌లు పోషించారు.  

Also Read: ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావ‌రి’ ఓటీటీ పార్ట్‌నర్‌ ఇదే - స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే?

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Jetlee OTT : నెల రోజుల్లోపే ఓటీటీలోకి జెట్లీ - కమెడియన్ సత్య కొత్త మూవీ ఎందులో స్ట్రీమింగ్ అంటే?
నెల రోజుల్లోపే ఓటీటీలోకి జెట్లీ - కమెడియన్ సత్య కొత్త మూవీ ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Sathi Leelavathi OTT : ఓటీటీలోకి మెగా కోడలి కొత్త మూవీ - 12 రోజులకే స్ట్రీమింగ్... ఎందులో చూడొచ్చంటే?
ఓటీటీలోకి మెగా కోడలి కొత్త మూవీ - 12 రోజులకే స్ట్రీమింగ్... ఎందులో చూడొచ్చంటే?
Karuppu OTT : ఆ ఓటీటీలోకి వీరభద్రుడు - సూర్య, త్రిష కొత్త మూవీ ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
ఆ ఓటీటీలోకి వీరభద్రుడు - సూర్య, త్రిష కొత్త మూవీ ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
Dhurandhar 2 OTT: ధురంధర్ 2 దెబ్బకు నెట్‌ఫ్లిక్స్‌ సర్వర్లు క్రాష్... పాకిస్తాన్ ప్రజల్లో రణవీర్ సినిమాపై భారీ క్రేజ్
ధురంధర్ 2 దెబ్బకు నెట్‌ఫ్లిక్స్‌ సర్వర్లు క్రాష్... పాకిస్తాన్ ప్రజల్లో రణవీర్ సినిమాపై భారీ క్రేజ్

వీడియోలు

RTC Bus Overtake Shock సిరిసిల్ల ప్రమాదంలో ట్విస్ట్.. కొత్త CCTVలో బయటపడిన అసలు కారణం
“నా లవర్ మెసేజ్‌లు చదివారు”.. యానాంలో యువకుడి హైడ్రామా!
Sachin Amuzed: కర్రల కారును చూసి సచిన్ ఫిదా.. రోడ్డు పక్కన పిల్లాడిని పలకరించిన క్రికెట్ లెజెండ్
Krunal Pandya Injury: గాయపడినా.. RCBని గెలిపించేవరకూ పోరాటం ఆపని కృణాల్ పాండ్యా
Telangana Politics: మరో స్థాయికి వెళ్లిన బూతుల పంచాయతీ.. కంట్రోల్ తప్పిన పొలిటీషియన్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IPL 2026 DC VS RR Result Updates: డీసీ అద్భుత విజ‌యం.. ప్లే ఆఫ్ ఆశ‌లు స‌జీవం.. రాణించిన రాహుల్, పోరెల్, స్టార్క్.. రాయ‌ల్స్ కు షాక్
డీసీ అద్భుత విజ‌యం.. ప్లే ఆఫ్ ఆశ‌లు స‌జీవం.. రాణించిన రాహుల్, పోరెల్, స్టార్క్.. రాయ‌ల్స్ కు షాక్
US Iran War Updates: యుద్ధాన్ని ముగించడానికి ఇరాన్ ముందు 5 కీలక కండీషన్లు పెట్టిన డొనాల్డ్ ట్రంప్
యుద్ధాన్ని ముగించడానికి ఇరాన్ ముందు 5 కీలక కండీషన్లు పెట్టిన డొనాల్డ్ ట్రంప్
Heatwave In AP and Telangana: తెలుగు రాష్ట్రాల్లో భానుడి ఉగ్రరూపం.. వచ్చే వారం రోజులు అప్రమత్తంగా ఉండాలని IMD వార్నింగ్!
తెలుగు రాష్ట్రాల్లో భానుడి ఉగ్రరూపం.. వచ్చే వారం రోజులు అప్రమత్తంగా ఉండాలని IMD వార్నింగ్!
Shahpur Railway Station Viral Video: పిల్లలను కాపాడేందుకు ప్రాణాల్ని పణంగా పెట్టిన తల్లి.. గుండెలు పిండేసే వీడియో!
పిల్లలను కాపాడేందుకు ప్రాణాల్ని పణంగా పెట్టిన తల్లి.. గుండెలు పిండేసే వీడియో!
Blackmail Telugu Movie: 'జెమిని' సురేష్‌తో వరుణ్ సందేశ్ 'బ్లాక్ మెయిల్'... కోన క్లాప్‌తో షురూ
'జెమిని' సురేష్‌తో వరుణ్ సందేశ్ 'బ్లాక్ మెయిల్'... కోన క్లాప్‌తో షురూ
Virat Kohli Records: చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లీ.. తొలి, ఏకైక బ్యాటర్‌గా బద్దలు కొట్టలేని రికార్డు
చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లీ.. తొలి, ఏకైక బ్యాటర్‌గా బద్దలు కొట్టలేని రికార్డు
Vidadala Rajini: డీఎస్పీ ఆఫీసుకు వెళ్లి పాస్‌పోర్ట్ అప్పగించిన విడదల రజిని.. అసలేం జరిగిందంటే..
డీఎస్పీ ఆఫీసుకు వెళ్లి పాస్‌పోర్ట్ అప్పగించిన విడదల రజిని.. అసలేం జరిగిందంటే..
Udayanidhi Trisha Offer: ఉదయనిధి ఆఫర్‌ను తిరస్కరించిన త్రిష.. విజయ్ కోసమే అంటూ ప్రచారం
ఉదయనిధి ఆఫర్‌ను తిరస్కరించిన త్రిష.. విజయ్ కోసమే అంటూ ప్రచారం
Embed widget