Unstoppable 2 Episode 5 : లెజెండరీ దర్శక నిర్మాతలతో 'లెజెండ్' బాలకృష్ణ - ఈ వారం 'అన్‌స్టాపబుల్' మామూలుగా ఉండదు
Unstoppable Season 2 Episode 5 : 'అన్‌స్టాపబుల్ 2' లేటెస్ట్ ఎపిసోడ్‌లో నలుగురు అతిథులు సందడి చేయనున్నారు. ఈ ఎపిసోడ్ ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ కానుందంటే?
డబుల్ ధమాకా... డబుల్ ఎంటర్‌టైన్‌మెంట్... డబుల్ గెస్టులు... డబుల్ సందడి... అన్నట్టు నట సింహం నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) హోస్ట్ చేస్తున్న 'అన్‌స్టాపబుల్' (Unstoppable) సెకండ్ సీజన్ స్టార్టింగ్ మూడు ఎపిసోడ్స్ నడిచాయి. నాలుగో ఎపిసోడ్‌కు ముగ్గురు గెస్టులను తీసుకు వచ్చారు. ఇప్పుడు ఐదో ఎపిసోడ్‌కు ఏకంగా నలుగురు గెస్టులను తీసుకు వచ్చారు.
'అన్‌స్టాపబుల్ 2' నాలుగో ఎపిసోడ్‌లో నిజాం కాలేజీలో తనతో పాటు చదువుకున్న నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి, కెఆర్ సురేష్ రెడ్డిలతో పాటు సీనియర్ హీరోయిన్ రాధికా శరత్ కుమార్‌లను బాలకృష్ణ ఇంటర్వ్యూ చేశారు. ఇప్పుడు ఐదో ఎపిసోడ్‌లో గెస్టులు నలుగురు అని ఈ రోజు స్పష్టం చేశారు.
దర్శకులు ఇద్దరు...
నిర్మాతలు ఇద్దరు!
'అన్‌స్టాపబుల్ 2' ఐదో ఎపిసోడ్‌కు ప్రముఖ నిర్మాతలు డి. సురేష్ బాబు (D Suresh Babu), అల్లు అరవింద్ (Allu Aravind)తో పాటు దర్శ కేంద్రుడు కె. రాఘవేంద్ర రావు, మరో దర్శకుడు కోదండరామి రెడ్డి అతిథులుగా వచ్చినట్లు ఆహా ఓటీటీ పేర్కొంది.
''తెలుగు చలన చిత్ర పరిశ్రమలోని లెజండరీ దర్శకులు, నిర్మాతలతో లెజెండ్ నందమూరి బాలకృష్ణ... ఈ వారం 'అన్‌స్టాపబుల్'లో! డిసెంబర్ 2 నుంచి ఐదో ఎపిసోడ్ ప్రీమియర్ కానుంది'' అని 'ఆహా' ఓటీటీ సోషల్ మీడియాలో పేర్కొంది.
View this post on Instagram
తెలుగు సినిమా 99 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ స్పెషల్ ఎపిసోడ్ ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. తెలుగు చిత్రసీమలో దిగ్గజ దర్శక నిర్మాతలతో ఇన్నేళ్ళుగా సినిమా ఇండస్ట్రీలో వచ్చిన మార్పుల గురించి డిస్కస్ చేసే అవకాశం ఉంది. అలాగే, బాలకృష్ణ మార్క్ హ్యూమర్ కూడా ఉంటుందని టాక్.
Also Read : పెళ్ళి ఫోటోలు చూసుకోవాల్సిన టైమ్‌లో స్మశానానికి - అమెరికన్ సింగర్ మృతి
#MansionHouse @tnldoublehorse @realmeIndia @Fun88India #ChandaBrothers @sprite_india @BigCMobilesIND @MYDrPainRelief #DesinutriIndia #Tilaknagarindustries #SaiPriyaConstrustions pic.twitter.com/054zkQ3NiR
— ahavideoin (@ahavideoIN) November 30, 2022
ఎన్టీఆర్ హీరోగా నటించిన చిత్రాలకు రాఘవేంద్రరావు దర్శకత్వం వహించారు. ఆయన తండ్రి, దర్శకులు కె.ఎస్. ప్రకాష్ రావు కూడా ఎన్టీఆర్ హీరోగా సినిమాలు తీశారు. డి. రామానాయుడు నిర్మాణంలో ఎన్టీఆర్ సినిమాలు చేశారు. అల్లు అరవింద్ తండ్రి, హాస్య నటులు అల్లు రామలింగయ్యకు, ఎన్టీఆర్ ఫ్యామిలీకి మంచి అనుబంధం ఉంది. అందువల్ల, ఈ ముగ్గురితో బాలకృష్ణ సంభాషణ ఏ విధంగా ఉంటుందనే ఆసక్తి మొదలైంది. బాలకృష్ణతో కోదండరామిరెడ్డి సినిమాలు చేశారు. ఎన్టీఆర్ పిలిచి మరీ అవకాశం ఇస్తే భయపడి సినిమా చేయనని చెప్పిన వ్యక్తి. ఆయనతో ఏ విధమైన డిస్కషన్ ఉంటుందనేది చూడాలి.
ఆల్రెడీ 'అన్‌స్టాపబుల్' సెకండ్ సీజన్ సెన్సేషనల్ రికార్డ్స్ క్రియేట్ చేస్తోంది. నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ అతిథులుగా వచ్చిన తొలి ఎపిసోడ్ పొలిటికల్ పరంగానూ డిస్కషన్స్ క్రియేట్ చేసింది. అదే విధంగా నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి, కెఆర్ సురేష్ రెడ్డి వచ్చిన ఎపిసోడ్ కూడా!
ఆహాలో స్ట్రీమింగ్ అయ్యే ఎపిసోడ్స్, యూట్యూబ్‌లో ప్రోమోస్ ట్రెండింగ్‌లో ఉంటున్నాయి. రాజకీయ నాయకులు, సీనియర్లు వచ్చినప్పుడు షోను ఓ విధంగా నడుపుతున్న బాలకృష్ణ... యువ హీరోలు విశ్వక్ సేన్, సిద్ధూ జొన్నలగడ్డ, శర్వానంద్, అడివి శేష్ వంటి వారు వచ్చినప్పుడు పూర్తిగా బాలుడు అయిపోతున్నారు. యువ హీరోలతో కలిసి విపరీతంగా సందడి చేస్తున్నారు.