అన్వేషించండి

Singer Jake Flint Died : పెళ్ళి ఫోటోలు చూసుకోవాల్సిన టైమ్‌లో స్మశానానికి - అమెరికన్ సింగర్ మృతి

అమెరికన్ సింగర్ జేక్ ఫ్లింట్ పెళ్ళైన కొన్ని గంటలకు మరణించారు.

అమెరికన్ సింగర్ జేక్ ఫ్లింట్ (Jake Flint) ఇకలేరు. ఆయన ఆదివారం తుదిశ్వాస విడిచారు. యుఎస్ఏలోని సౌత్ సెంట్రల్ రీజియన్‌లో గల ఓక్లహోమా ఆయన స్వస్థలం. జేక్ ఫ్లింట్ వయసు 37 సంవత్సరాలు మాత్రమే. ఎంతో భవిష్యత్ ఉన్న ఆయన... చిన్న వయసులో తిరిగి రాని లోకాలకు వెళ్ళడాన్ని ఆయన బంధు మిత్రులు, శ్రేయోభిలాషులు, అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. అన్నిటి కంటే విషాదం ఏంటంటే... పెళ్ళైన కొన్ని గంటలకు ఆయన మరణించడం!

శనివారం పెళ్లి చేసుకున్న జేక్...
ఆదివారం నిద్రలో మృతి
జేక్ ఫ్లింట్ శనివారం పెళ్లి చేసుకున్నారు. ఈ ఏడాది జనవరిలో బ్రెండా విల్సన్ (Brenda Wilson) ను సోషల్ మీడియా ద్వారా పరిచయం చేసిన జేక్... త్వరలో పెళ్లికి చేసుకోబోతున్నానని చెప్పారు. సన్నిహితులు, కుటుంబ సభ్యల మధ్య శనివారం జేక్, బ్రెండా ఉంగరాలు మార్చుకున్నారు. ఆ తర్వాత రాత్రి నిద్రిస్తున్న సమయంలో జేక్ ఫ్లింట్ మరణించారు. అయితే... ఆయన మరణానికి గల కారణాలు ఇంకా తెలియలేదు.
 
ఎవరికీ ఇంత బాధ రాకూడదు! - జేక్ భార్య 
భర్త మరణ వార్తను బ్రెండా విల్సన్ కన్ఫర్మ్ చేశారు. ఎవరికీ ఇంత బాధ రాకూడదని ఫేస్‌బుక్‌లో చేసిన పోస్టులో ఆమె పేర్కొన్నారు. ''ప్రజలు ఎవరూ ఇంత బాధను అనుభవించకూడదు. నా హృదయం వెళ్ళిపోయింది. ఆయన తిరిగి రావాలి. నేను ఇంత కంటే ఎక్కువ బాధను భరించలేను. ఇప్పుడు నాకు ఆయన కావాలి" అని బ్రెండా ఆ పోస్టులో పేర్కొన్నారు. తామిద్దరం కలిసి పెళ్ళి ఫోటోలు చూడాల్సిన సమయంలో భర్త అంత్యక్రియల కోసం దుస్తులు తీసుకు వెళ్ళాల్సి వస్తోందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. 

Also Read : ప్రభాస్‌తో ప్రేమ, పెళ్లిపై కృతి సనన్ రియాక్షన్ ఇదే

వెడ్డింగ్ ఫోటోషూట్ వీడియో ఆదివారం ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసిన బ్రెండా తనకు ఏం జరుగుతుందో తెలియడం లేదని పేర్కొన్నారు. జేక్ ఫ్లింట్ మేనేజర్ పేరు కూడా బ్రెండా (Brenda Cline). ఆవిడ కూడా జేక్ మరణ వార్తను ధృవీకరించారు. జేక్ తనకు కుమారుడు వంటివాడు అని, అతని మరణం తనకు ఎంతో దుఃఖాన్ని కలిగించిందని, తన గుండె బద్దలైందని బ్రెండా క్లిన్ పేర్కొన్నారు. పెళ్ళైన కొన్ని గంటలకు జేక్ ఫ్లింట్ మరణించడం చర్చనీయాంశం అయ్యింది. 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Jake Flint (@jakeflintmusic)

టాప్ హెడ్ లైన్స్

Uppal Balu Navdeep: ఎవడెవడో ఏదేదో అంటాడు... ఉప్పల్ బాలు కాంట్రవర్సీపై నవదీప్ రియాక్షన్
ఎవడెవడో ఏదేదో అంటాడు... ఉప్పల్ బాలు కాంట్రవర్సీపై నవదీప్ రియాక్షన్
Ram Charan Irumudi: రవితేజ 'ఇరుముడి'లో అతిథిగా రామ్ చరణ్... అసలు నిజం ఏమిటంటే?
రవితేజ 'ఇరుముడి'లో అతిథిగా రామ్ చరణ్... అసలు నిజం ఏమిటంటే?
Balakrishna Koratala Siva Movie: కొరటాలతో బాలకృష్ణ సినిమా ఆగిందా? యూనిట్ ఇన్‌సైడ్ ఇన్ఫర్మేషన్ ఏమిటంటే?
కొరటాలతో బాలకృష్ణ సినిమా ఆగిందా? యూనిట్ ఇన్‌సైడ్ ఇన్ఫర్మేషన్ ఏమిటంటే?
Crime Thriller OTT : డైరెక్ట్‌గా ఓటీటీలోకి క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ - వరల్డ్ వైడ్ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
డైరెక్ట్‌గా ఓటీటీలోకి క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ - వరల్డ్ వైడ్ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP DSC Notification 2026: ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!
ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!
Telangana Political War: డిజిటల్ వర్సెస్ డెమోక్రటిక్ మాస్ - బీఆర్ఎస్ స్క్రీన్ ప్రచారం పై రేవంత్ రెడ్డి స్ట్రీట్ వార్ ప్రభావమెంత?
డిజిటల్ వర్సెస్ డెమోక్రటిక్ మాస్ - బీఆర్ఎస్ స్క్రీన్ ప్రచారం పై రేవంత్ రెడ్డి స్ట్రీట్ వార్ ప్రభావమెంత?
Shiva Srishti Vyakaranam: మోడలింగ్ నుంచి బిగ్ బాస్ 10 తెలుగు అగ్నిపరీక్ష వరకు.. శివ సృష్టి వ్యాకరణం గురించి ఆసక్తికర విషయాలు
మోడలింగ్ నుంచి బిగ్ బాస్ 10 తెలుగు అగ్నిపరీక్ష వరకు.. శివ సృష్టి వ్యాకరణం గురించి ఆసక్తికర విషయాలు
Ram Charan Irumudi: రవితేజ 'ఇరుముడి'లో అతిథిగా రామ్ చరణ్... అసలు నిజం ఏమిటంటే?
రవితేజ 'ఇరుముడి'లో అతిథిగా రామ్ చరణ్... అసలు నిజం ఏమిటంటే?
Donald Trump: అమెరికా ఎన్నికలకు భారతే పాఠం! ఓటర్ ఐడీ విధానంపై ట్రంప్ ప్రశంసలు! సేవ్ అమెరికా యాక్ట్ కోసం పట్టు!
అమెరికా ఎన్నికలకు భారతే పాఠం! ఓటర్ ఐడీ విధానంపై ట్రంప్ ప్రశంసలు! సేవ్ అమెరికా యాక్ట్ కోసం పట్టు!
చాణక్య నీతి: వైవాహిక జీవితంలో ఈ 5 తప్పులు ఇంటి శాంతి, సంతోషం, ఐశ్వర్యాన్ని దూరం చేస్తాయి!
చాణక్య నీతి: వైవాహిక జీవితంలో ఈ 5 తప్పులు ఇంటి శాంతి, సంతోషం, ఐశ్వర్యాన్ని దూరం చేస్తాయి!
Maruti Fronx చౌకైన మోడల్ రూ.1 లక్ష చెల్లించాక నెలవారీ EMI ఎంత కట్టాలి
Maruti Fronx చౌకైన మోడల్ రూ.1 లక్ష చెల్లించాక నెలవారీ EMI ఎంత కట్టాలి
Hyderabad Traffic Diversion: నేటి నుంచి కేబీఆర్ పార్క్ చుట్టూ వన్-వే అమలు.. 7 ఫ్లైఓవర్లు, 7 అండర్‌పాస్‌లతో ట్రాఫిక్ సమస్యకు చెక్
నేటి నుంచి కేబీఆర్ పార్క్ చుట్టూ వన్-వే అమలు.. 7 ఫ్లైఓవర్లు, 7 అండర్‌పాస్‌లతో ట్రాఫిక్ సమస్యకు చెక్
Embed widget