News
News
X

Kriti Sanon - Prabhas : ప్రభాస్‌తో ప్రేమ, పెళ్లిపై కృతి సనన్ రియాక్షన్ ఇదే

Kriti Sanon Reacts To Prabhas Love News : ప్రభాస్, కృతి సనన్ ప్రేమలో పడ్డారని, డేటింగ్ చేస్తున్నారని హిందీ చిత్రసీమ కోడై కూస్తోంది. దీంతో ఆమె స్పందించారు. 

FOLLOW US: 
Share:

ప్రభాస్ ప్రేమలో పడ్డారా (Prabhas)? 'ఆదిపురుష్' సినిమాలో తనకు జోడీగా సీత పాత్రలో నటించిన కృతి సనన్ (Kriti Sanon) తో డేటింగ్ చేస్తున్నారా? అంటే... హిందీ చిత్రసీమ 'అవును' అంటోంది. దీనికి కారణం బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్. 'తోడేలు' (హిందీలో 'భేడియా') విడుదల సందర్భంగా ఓ కార్యక్రమంలో అతడు చేసిన వ్యాఖ్యలతో ప్రభాస్, కృతి ప్రేమలో ఉన్నారని అందరూ అనుకోవడం స్టార్ట్ చేశారు. 

ప్రభాస్ మదిలో కృతి!?
వరుణ్ ధావన్, కరణ్ జోహార్ కలిసి హిందీ టీవీ షోలో చేసిన హంగామా వల్ల 'తోడేలు' సినిమా కంటే ప్రభాస్ లవ్ లైఫ్ (Prabhas Love Life) వార్తల్లో నిలిచింది. ''ఇప్పుడు కృతి పేరు మరొకరి మదిలో ఉంది. అతను ఇప్పుడు ముంబైలో లేడు. దీపికాతో షూటింగ్ (ప్రాజెక్ట్ కె సినిమా) చేస్తున్నాడు'' అని వరుణ్ ధావన్ చెప్పారు. ప్రభాస్ గురించి అతడు మాట్లాడాడని అందరికీ అర్థం అయ్యింది. కృతితో ప్రభాస్ లవ్ గురించి హింట్ ఇచ్చారని బాలీవుడ్ భావించింది. 

మోకాళ్లపై కూర్చుని కృతికి ప్రపోజ్ చేసిన ప్రభాస్!?
వరుణ్ ధావన్ వ్యాఖ్యల తర్వాత హిందీ చిత్రసీమలో రకరకాల కథనాలు ప్రచారంలోకి వచ్చాయి. కృతి సనన్ ముందు మోకాళ్లపై కూర్చుని మరీ ప్రభాస్ ప్రపోజ్ చేశారని ఓ మీడియా సంస్థ రాసుకొచ్చింది. అంతే కాదు... ఇప్పుడు వాళ్ళిద్దరూ ఘాడమైన ప్రేమలో ఉన్నారని, త్వరలో ఏడు అడుగులు వేయడానికి రెడీ అవుతున్నారని, వాళ్ళ పెళ్లి మరెంతో దూరంలో లేదని ముంబైలో జనాలు తమకు తోచిన విధంగా మాట్లాడుతున్నారు. ఈ ప్రచారం జోరుగా సాగుతుండటంతో కృతి సనన్ స్పందించారు. 

ప్రేమ లేదు... పీఆర్ కాదు! - కృతి సనన్
''ఇది ప్రేమ కాదు... పీఆర్ (పబ్లిసిటీ స్టంట్) అంత కంటే కాదు'' అని కృతి సనన్ పేర్కొన్నారు. ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఆవిడ ఒక పోస్ట్ చేశారు. ''మా తోడేలు (వరుణ్ ధావన్) రియాలిటీ షోలో కొంచెం హద్దులు దాటింది. సరదాగా చేసిన వ్యాఖ్యలు పుకార్లకు కారణం అయ్యాయి. ఎవరో ఒకరు నా పెళ్లి తేదీ వెల్లడించే ముందు నన్ను అసలు విషయం చెప్పనివ్వండి. ఈ రూమర్స్ అన్నీ నిరాధారమైనవి. ఫేక్ న్యూస్'' అని కృతి పేర్కొన్నారు. అదీ సంగతి! కృతి సనన్ రియాక్ట్ అవ్వడంతో ఇప్పటికి అయినా పుకార్లకు ఫుల్ స్టాప్ పడుతుందో? లేదో? చూడాలి. 

Also Read : ఎన్టీఆర్, చరణ్ మధ్య నో గొడవ, నథింగ్ - ముందే అంతా మాట్లాడుకుని

హిందీలో సినిమా చేస్తే అంతేనా?
హిందీలో భారీ సినిమాల్లో నటించే హీరో హీరోయిన్ల మధ్య ప్రేమ ఉన్నట్టు ప్రచారం చేయడం పబ్లిసిటీ స్టంట్ అని చెబుతుంటారు. అందులోనూ ఇప్పుడు ఇండియన్ సినిమాలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్‌లో ప్రభాస్ ఒకరు కావడంతో కృతితో ప్రేమలో పడ్డారని వార్త రాగానే ప్రేక్షకులందరి దృష్టి ఆకర్షించింది. గతంలో అనుష్కతో ఆయన ప్రేమలో పడ్డారని వార్తలు వచ్చాయి. తామిద్దరం మంచి స్నేహితులమని వాళ్ళు చెప్పిన సందర్భాలు ఎన్నో! ప్రభాస్ పెళ్లి చేసుకుంటే చూడాలని ఉందని ఆయన పెదనాన్న, దివంగత కథానాయకుడు కృష్ణం రాజు ఆశ పడ్డారు. చివరకు, అది ఆయనకు తీరని కోరికగా మిగిలింది.  

Published at : 30 Nov 2022 07:40 AM (IST) Tags: Kriti Sanon Prabhas Prabhas Kriti Sanon Kriti Sanon Prabhas Kriti Sanon Reacts To Rumours

సంబంధిత కథనాలు

Amigos Pre Release - NTR Jr : అన్నయ్య కోసం వస్తున్న ఎన్టీఆర్ - రేపే కళ్యాణ్ రామ్ 'అమిగోస్' ప్రీ రిలీజ్

Amigos Pre Release - NTR Jr : అన్నయ్య కోసం వస్తున్న ఎన్టీఆర్ - రేపే కళ్యాణ్ రామ్ 'అమిగోస్' ప్రీ రిలీజ్

Brahmamudi February 4th: రాజ్ కి నిజం చెప్పమన్న కావ్య- స్వప్న మీద కన్నేసిన రాహుల్

Brahmamudi February 4th: రాజ్ కి నిజం చెప్పమన్న కావ్య- స్వప్న మీద కన్నేసిన రాహుల్

Leo Movie Shooting: దళపతి ‘లియో’లో ఏజెంట్ టీనా కీలక పాత్ర, చిత్ర బృందంతో స్పెషల్ ఫ్లైట్ లో కశ్మీర్ కు పయనం!

Leo Movie Shooting: దళపతి ‘లియో’లో ఏజెంట్ టీనా కీలక పాత్ర, చిత్ర బృందంతో స్పెషల్ ఫ్లైట్ లో కశ్మీర్ కు పయనం!

Janaki Kalaganaledu February 4th: రామతో కన్నీళ్లు పెట్టించిన అఖిల్- వంట రాక తిప్పలు పడుతున్న మలయాళం

Janaki Kalaganaledu February 4th: రామతో కన్నీళ్లు పెట్టించిన అఖిల్- వంట రాక తిప్పలు పడుతున్న మలయాళం

Butta Bomma Movie Review - 'బుట్ట బొమ్మ' రివ్యూ : మలయాళ హిట్ 'కప్పేలా' తెలుగు రీమేక్ ఎలా ఉందంటే?

Butta Bomma Movie Review - 'బుట్ట బొమ్మ' రివ్యూ : మలయాళ హిట్ 'కప్పేలా' తెలుగు రీమేక్ ఎలా ఉందంటే?

టాప్ స్టోరీస్

Government Websites Hacked: ప్రభుత్వ వెబ్‌సైట్‌లను టార్గెట్ చేస్తున్న హ్యాకర్లు,అలెర్ట్ అవుతున్న అధికారులు

Government Websites Hacked: ప్రభుత్వ వెబ్‌సైట్‌లను టార్గెట్ చేస్తున్న హ్యాకర్లు,అలెర్ట్ అవుతున్న అధికారులు

Pawan Kalyan Latest Stills : 'హరి హర వీర మల్లు' సెట్స్‌లో పవన్ కళ్యాణ్ నవ్వులు చూశారా?

Pawan Kalyan Latest Stills : 'హరి హర వీర మల్లు' సెట్స్‌లో పవన్ కళ్యాణ్ నవ్వులు చూశారా?

Diabetes: డయాబెటిస్ రోగులు ఈ టీని రోజూ తాగితే మందుల అవసరం ఉండదు

Diabetes: డయాబెటిస్ రోగులు ఈ టీని రోజూ తాగితే మందుల అవసరం ఉండదు

ITC Q3 Results: అంచనాలను మించి లాభపడ్డ ITC, Q3లో రూ.5 వేల కోట్ల ప్రాఫిట్‌

ITC Q3 Results: అంచనాలను మించి లాభపడ్డ ITC, Q3లో రూ.5 వేల కోట్ల ప్రాఫిట్‌