అన్వేషించండి

Ram Charan NTR : ఎన్టీఆర్, చరణ్ మధ్య నో గొడవ, నథింగ్ - ముందే అంతా మాట్లాడుకుని

ఎన్టీఆర్ హీరోగా సినిమా చేయాలని 'ఉప్పెన' దర్శకుడు బుచ్చిబాబు కథ రెడీ చేశారు. ఇప్పుడు అదే కథతో రామ్ చరణ్ హీరోగా సినిమా చేస్తున్నారు. దీనిపై ఎన్టీఆర్, చరణ్ మధ్య ఎటువంటి డిస్కషన్ జరిగిందంటే...

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) కథానాయకుడిగా 'ఉప్పెన' (Uppena) ఫేమ్ సానా బుచ్చి బాబు (Buchi Babu Sana) దర్శకత్వంలో ఓ పాన్ ఇండియా సినిమా రూపొందుతోంది. భారీ నిర్మాణ వ్యయంతో యూనివర్స‌ల్ అప్పీల్ ఉన్న కాన్సెప్ట్‌తో చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు ఈ మధ్య అధికారికంగా వెల్లడించారు. నిజం చెప్పాలంటే... రామ్ చరణ్ కోసం రెడీ చేసిన కథ కాదు ఇది! మరి, ఎవరి కోసం రెడీ చేశారు? అంటే.... యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR Jr) కోసం!

ఎన్టీఆర్ నుంచి చరణ్ దగ్గరకు...
కథతో పాటు దర్శకుడు బుచ్చిబాబు!
ఎన్టీఆర్ కథానాయకుడిగా సినిమా చేయాలనేది సానా బుచ్చి బాబు కోరిక. అందుకే, 'ఉప్పెన' విడుదలైనప్పటి నుంచి వెయిట్ చేస్తున్నారు. తొలి సినిమా తర్వాత చాలా ఛాన్సులు వచ్చినా... ఏదీ యాక్సెప్ట్ చేయకుండా ఎన్టీఆర్ కోసం ఎదురు చూశారు.
 
ఒక వైపు దర్శకుడు కొరటాల శివతో అంగీకరించిన సినిమా ఆలస్యం కావడం... మరో వైపు దాని తర్వాత 'కేజీఎఫ్', 'సలార్' ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సినిమా చేయాల్సి ఉండటంతో ఎన్టీఆర్ ఇప్పట్లో ఖాళీ అయ్యే సూచనలు కనిపించడం లేదు. తన డేట్స్ ఎప్పుడు అందుబాటులో ఉండేదీ ఎన్టీఆర్‌కూ తెలుసు. అందుకని, దర్శకుడు మరొక హీరోతో సినిమా చేస్తానంటే ఓకే చెప్పారట!

ఎన్టీఆర్‌తో చరణ్ డిస్కస్ చేసిన తర్వాతే...
దర్శకుడు సానా బుచ్చి బాబు తన దగ్గరకు వచ్చిన తర్వాత ఎన్టీఆర్‌తో రామ్ చరణ్ డిస్కస్ చేశారట. ఒకరితో మరొకరు మాట్లాడుకున్న తర్వాత రామ్ చరణ్ సినిమా ఓకే చేశారని ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం. 

ఇంతకు ముందు మహేష్ బాబు హీరోగా సుకుమార్ ఓ సినిమా చేయాలని అనుకున్నారు. ఎందుకో ఆ సినిమా క్యాన్సిల్ అయ్యింది. ఆ తర్వాత అల్లు అర్జున్ హీరోగా 'పుష్ప' సినిమా చేశారు. అప్పట్లో మహేష్, సుకుమార్ మధ్య క్రియేటివ్ డిఫరెన్సులు వచ్చాయని ఫిల్మ్ నగర్ వర్గాల్లో గుసగుసలు వినిపించాయి. ఇప్పుడీ రామ్ చరణ్, బుచ్చి బాబు సినిమా విషయంలో కథ హీరోల చేతులు మారడంలో ఇద్దరి మధ్య అటువంటి గొడవలు గానీ, మనస్పర్థలు గానీ ఏమీ లేవు.
 
సతీష్ కిలారు నిర్మాణంలో...
రామ్ చరణ్ - సానా బుచ్చి బాబు సినిమాతో సతీష్ కిలారు (Satish Kilaru) నిర్మాతగా పరిచయం అవుతున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేక‌ర్స్ స‌గ‌ర్వ సమర్పణలో ఆయనకు చెందిన వృద్ధి సినిమాస్‌, సుకుమార్ రైటింగ్స్ పతాకాలపై నిర్మిస్తున్నారు. ఇత‌ర న‌టీన‌టులు, సాంకేతిక నిపుణుల వివ‌రాలను త్వ‌ర‌లోనే తెలియ‌జేస్తామ‌ని దర్శక నిర్మాతలు తెలియ‌జేశారు.

Also Read : 'యశోద' సినిమాపై కేసు కొట్టేసిన కోర్టు - ఇది హ్యాపీ ఎండింగ్!

ప్రస్తుతం ఎన్టీఆర్, రామ్ చరణ్ చేస్తున్న సినిమాల విషయానికి వస్తే... కొరటాల శివ దర్శకత్వంలో సినిమా స్టార్ట్ చేయడానికి యంగ్ టైగర్ రెడీ అవుతున్నారు. అది వచ్చే ఏడాది విడుదల అవుతుందా? 2024 సంక్రాంతికి వెళుతుందా? అనేది షూటింగ్ స్పీడ్ మీద ఆధారపడి ఉంటుంది. 'దిల్' రాజు, శిరీష్ నిర్మాతలుగా శంకర్ దర్శకత్వంలో పాన్ ఇండియా సినిమా స్టార్ట్ చేసిన రామ్ చరణ్, దాంతో పాటు బుచ్చి బాబు సినిమా చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. అదీ సంగతి!   

టాప్ హెడ్ లైన్స్

Crime Thriller OTT : డైరెక్ట్‌గా ఓటీటీలోకి క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ - వరల్డ్ వైడ్ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
డైరెక్ట్‌గా ఓటీటీలోకి క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ - వరల్డ్ వైడ్ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Husharu Pittalu OTT : ఆ ఓటీటీలోకి హుషారు పిట్టలు - రొమాంటిక్ కామెడీ మూవీ ఎప్పుడు, ఎందులో చూడొచ్చంటే?
ఆ ఓటీటీలోకి హుషారు పిట్టలు - రొమాంటిక్ కామెడీ మూవీ ఎప్పుడు, ఎందులో చూడొచ్చంటే?
DC Review : లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
NTR Health Update : ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kondagattu Accident: కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
Telangana Voter List 2026: తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
Andhra Pradesh and Telangana BJP: జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
Nitin Nabin New Team: నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
NTR Health Update : ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
Chinnareddy Politics: 48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
DC Review : లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
Galle Rain Threat: టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
Embed widget