News
News
వీడియోలు ఆటలు
X

Avatar Facts: అవతార్.. ఇది కేవలం సినిమా మాత్రమే కాదు.. అంతకు మించి!

2009లో అవతార్ వచ్చి చరిత్రలోనే అతిపెద్ద బ్లాక్‌బస్టర్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమా గురించి ఇంట్రస్టింగ్ వివరాలు..

FOLLOW US: 
Share:

2009.. డిసెంబర్ 18.. అవతార్ అనే మరో ప్రపంచం మన ప్రపంచానికి దిగి వచ్చింది. థియేటర్లలోకి వెళ్లిన వారిని తన ప్రపంచంలోకి లాక్కుపోయింది. అంతకుముందు, ఆ తర్వాత కూడా హాలీవుడ్‌లో విజువల్ వండర్స్ అనదగ్గ వచ్చాయి. కానీ అవన్నీ వేరు.. అవతార్ వేరు. 2009లో విడుదలైన అవతారే ఇప్పటికీ ప్రపంచంలో అత్యధిక కలెక్షన్లు సాధించిన సినిమా అంటేనే అర్థం చేసుకోవచ్చు అవతార్ ఎంత మ్యాజిక్ క్రియేట్ చేసిందో. ఆ తర్వాత పదుల సంఖ్యలో సూపర్ హీరోలు కలిసి అవెంజర్స్ సిరీస్‌లు, జస్టిస్ లీగ్‌లతో వచ్చినా అవతార్‌ను టచ్ చేయలేకపోయారు. 2019లో వచ్చిన అవెంజర్స్: ఎండ్ గేమ్ అవతార్‌ను దాటినప్పటికీ.. తర్వాత అవతార్ రీ-రిలీజ్ అయి మళ్లీ సింహాసనం మీద కూర్చుంది.

2009 నాటికి భారతీయ సినిమాలు అప్పుడప్పుడే రూ.100 కోట్ల మార్కును చూస్తున్నాయి. అవతార్ వచ్చే సమయానికి శివాజీ (2007), హిందీ గజిని (2008), మగధీర (2009) మాత్రమే రూ.100 కోట్లు దాటిన భారతీయ సినిమాలు. కానీ అవతార్ కూడా మనదేశంలో రూ.113 కోట్లు వసూలు చేసింది. ఒక హాలీవుడ్ సినిమా.. ప్రాంతీయ పెద్ద హీరోల సినిమాలకు దీటుగా కలెక్షన్లు వసూలు చేయడం మామూలు విషయం కాదు. అవతార్ వచ్చిన సరిగ్గా వారం రోజుల తర్వాత అమీర్ ఖాన్ కల్ట్ క్లాసిక్ సినిమా ‘3 ఇడియట్స్’ కూడా థియేటర్లలోకి వచ్చింది. అయినప్పటికీ ఆ ప్రభంజనాన్ని తట్టుకుని కూడా అవతార్ మార్కెట్లో నిలబడింది.

ఇప్పుడు అవతార్ సీక్వెల్ కూడా వచ్చేస్తుంది. అవును.. అవతార్-2ని 2022, డిసెంబర్ 16వ తేదీన విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. దీంతోపాటు అవతార్ 3 విడుదల తేదీని కూడా ప్రకటించారు. 2024, డిసెంబర్ 3వ తేదీన అవతార్ 3 థియేటర్లలో విడుదల కానుంది. దర్శకుడు జేమ్స్ కామెరూన్ దాదాపు 1997 నుంచి అవతార్ మీదనే పనిచేస్తున్నారు. టైటానిక్ తర్వాత కామెరూన్ అవతార్ తప్ప మరో సినిమాను తీయలేదు. ఒక రెండు డాక్యుమెంటరీలకు మాత్రమే దర్శకత్వం వహించారు.

అవతార్ ఆలోచన ఎలా?
అవతార్ లాంటి సినిమాను తీయడం కాదు, దానికి సంబంధించిన ఆలోచన రావడం, విజువలైజ్ చేసుకోవడమే పెద్ద టాస్క్. 1994లోనే జేమ్స్ కామెరూన్ అవతార్‌ను రాయడం ప్రారంభించారు. ఆయన చిన్నప్పటి నుంచి చదివిన ప్రతి సైన్స్ ఫిక్షన్ పుస్తకం ఆయనను ఇన్‌స్పైర్ చేశాయి. 1997లో టైటానిక్ పూర్తయ్యాక అవతార్‌ను తీసి.. 1999లో రిలీజ్ చేయాలనేది కామెరూన్ ప్లాన్. దానికి అప్పట్లోనే 100 మిలియన్ డాలర్ల బడ్జెట్ అవుతుందని అంచనా వేశారు. అయితే అప్పుడు అందుబాటులో ఉన్న టెక్నాలజీతో తను అవతార్‌ను అనుకున్నట్లు తీయలేనని కామెరూన్‌కు అర్థమైంది.

ఆ తర్వాత కొన్ని సంవత్సరాలకు లార్డ్ ఆఫ్ ది రింగ్స్‌లో గొల్లమ్, కింగ్ కాంగ్ సినిమాలో కాంగ్, పైరేట్స్ ఆఫ్ ది కరేబియన్ సిరీస్ డేవీ జోన్స్ క్యారెక్టర్లను స్క్రీన్ మీద చూశాక అవతార్‌ను తెరకెక్కించే టెక్నాలజీ వచ్చిందని కామెరూన్ నమ్మారు. అవతార్‌కు సంబంధించిన షూటింగ్ 2007 ఏప్రిల్‌లో ప్రారంభం అయింది. అవతార్ సినిమా షూటింగ్ డేస్ కేవలం 62 మాత్రమే. ఇందులో 31 రోజులు మోషన్ క్యాప్చర్ టెక్నాలజీతో తెరకెక్కించగా.. మరో 31 రోజులు లైవ్ యాక్షన్ ఫొటోగ్రఫీ ద్వారా తీశారు.

అవతార్ అనగానే మనకు గుర్తొచ్చేది పండోరా గ్రహం. గాల్లో వేలాడే పర్వతాలు, ఎత్తైన జలపాతాలు, వింతైన జీవులు మనల్ని ఆశ్చర్యానికి గురి చేశాయి. అయితే జేమ్స్ కామెరూన్ చాలా సినిమాల్లో చూసిన లొకేషన్లు, చైనాలోని పర్వతాలు, ముఖ్యంగా యానిమేషన్ సినిమాల్లో చూసిన ప్రదేశాలు ఆయనను ఇన్‌స్పైర్ చేశాయి. వాటి ఆధారంగానే పండోరాను డిజైన్ చేశారు. అలాగే కొంతమంది భాషా నిపుణుల సాయంతో ఆ గ్రహంలోని వారు మాట్లాడే ‘నావి’ భాషకు సంబంధించిన లిపిని సృష్టించారు.

గ్రాఫిక్స్ నభూతో నభవిష్యత్!
ఈ సినిమాకు సంబంధించి అతి పెద్ద టాస్క్ గ్రాఫిక్స్. ఈ సినిమా విజువల్ ఎఫెక్ట్స్‌ను వెటా డిజిటల్ అనే సంస్థ హ్యాండిల్ చేసింది. కేవలం అవతార్ కోసమే 10 వేల చదరపు అడుగుల స్థలంలో 4,000 సర్వర్లు, 35 వేల ప్రాసెసర్ కోర్లతో సర్వర్ ఫాంను ఏర్పాటు చేయాల్సి వచ్చింది. గ్రాఫిక్స్ ప్రాసెస్ చేయడానికి 104 టీబీ ర్యామ్ (దాదాపు 1,04,000 జీబీ) అవసరం అయ్యేది. దాని స్టోరేజ్ కోసం 3 పెటాబైట్ల డేటా (దాదాపు 30 లక్షల జీబీ) కావాల్సి వచ్చేది. కేవలం అవతార్‌కు సంబంధించిన గ్రాఫిక్స్, స్టోరేజ్ కోసమే మైక్రో సాఫ్ట్ ‘గయా’ అనే క్లౌడ్ కంప్యూటింగ్, డిజిటల్ అసెట్ మేనేజ్‌మెంట్ సంస్థను స్థాపించింది. డిజిటల్ ప్రాసెసింగ్ సమన్వయం మొత్తం ఈ సంస్థ ద్వారానే జరిగేది.

అవతార్ ఫైనల్ ఫుటేజ్‌లో ప్రతీ నిమిషం డేటాకు 17.28 జీబీ డేటా స్టోరేజ్ అవసరం అయ్యేది. ఒక్కోసారి ఒక్కో ఫ్రేమ్ రెండర్ అవ్వడానికి కొన్ని గంటల సమయం పట్టేది. కేవలం పండోరా క్యారెక్టర్ల డిజైన్‌కే 10 లక్షల జీబీ వరకు స్టోరేజ్ అవసరం అయింది. ప్రపంచంలోని టాప్-500 సూపర్ కంప్యూటర్లలో అవతార్ రెండర్ ఫాంలోని కంప్యూటర్‌లు 193, 194, 195, 196, 197 స్థానాలను సంపాదించాయి. అంటే కేవలం ఈ సినిమా కోసం ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన సూపర్ కంప్యూటర్లు రూపొందించాల్సి వచ్చింది.

భారత్‌లో నాన్-బాహుబలి.. హాలీవుడ్‌లో నాన్ అవతార్!
సినిమాను ఎంత కళాత్మకంగా.. ఎంత వినూత్నంగా తీసినా ఆఖరికి మాట్లాడాల్సింది కలెక్షన్లే. అవతార్ సినిమా సక్సెస్ గురించి డిస్కషన్ వస్తే.. దానికి వచ్చిన కలెక్షన్లే ఆన్సర్ అని చెప్పవచ్చు. ప్రస్తుతం అవతార్ కలెక్షన్లు 2.847 బిలియన్ డాలర్లుగా (సుమారు రూ.21,400 కోట్లు) ఉంది. గతంలో ఈ సినిమా కలెక్షన్లు 2.789 బిలియన్ డాలర్లుగా ఉండేవి. తర్వాత వచ్చిన అవెంజర్స్: ఎండ్‌గేమ్ 2.797 బిలియన్ డాలర్లు సాధించి ఆ రికార్డును బద్దలు కొట్టింది. అయితే 2021 మార్చిలో అవతార్‌ను చైనాలో మళ్లీ విడుదల చేశారు. ఆ కలెక్షన్లతో కలుపుకుని అవతార్ మళ్లీ ఎండ్‌గేమ్‌ను దాటి తన సింహాసనాన్ని దక్కించుకుంది.

అవతార్ విడుదల అయినప్పుడు మొదటి రోజు, మొదటి వీకెండ్, మొదటి వారం.. ఇలా అన్ని రికార్డులను అవతార్ తన ఖాతాలో వేసుకుంది. ఆ తర్వాత చాలా సంవత్సరాల పాటు ఈ రికార్డులు అలానే ఉన్నాయి. 2015లో వచ్చిన స్టార్ వార్స్:  ఫోర్స్ అవేకెన్స్ కొన్ని రికార్డులు బద్దలు కొట్టగా.. ఆ తర్వాత వచ్చిన అవెంజర్స్: ఎండ్ గేమ్‌లు మిగతా రికార్డులు బద్దలు కొట్టాయి. ఇక మనదేశంలో కూడా రూ.100 కోట్ల మార్కును దాటిన మొదటి హాలీవుడ్ సినిమా ఇదే. ఫుల్ రన్‌లో రూ.113 కోట్లను ఈ సినిమా వసూలు చేసింది. ఇప్పటికీ ప్రపంచంలోని ఎన్నో దేశాల్లో అత్యధిక వసూళ్లు సాధించిన హాలీవుడ్ సినిమా అవతారే.

అవార్డులు కూడా..
బాక్సాఫీస్ రికార్డులతో పాటు అవార్డులు కూడా రావడం ఏ సినిమాకు అయినా కష్టమే. కానీ కామెరూన్ మాత్రమే ఈ రెండిటినీ సాధించగలడు. అవతార్ సినిమా మొత్తం తొమ్మిది విభాగాల్లో ఆస్కార్‌కు నామినేట్ కాగా.. ఉత్తమ ఆర్ట్ డైరెక్షన్, ఉత్తమ సినిమాటోగ్రఫీ, ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్ విభాగాల్లో అవార్డులను అందుకుంది. అంతకుముందు కామెరూన్ తీసిన క్లాసిక్ టైటానిక్ కూడా కలెక్షన్లతో పాటు ఏకంగా 11 ఆస్కార్ అవార్డులను తన ఖాతాలో వేసుకుంది.

నెక్స్ట్ ఏంటి?
2009లో అవతార్ విడుదల అయినప్పటి నుంచి జేమ్స్ కామెరూన్ ఆ సినిమా సీక్వెల్స్ మీదనే పనిచేస్తున్నారు. మొదట అనుకున్న ప్లాన్ ప్రకారం.. 2014లో అవతార్ 2, 2015లో అవతార్ 3 రిలీజ్ అవ్వాల్సింది. అయితే ఈ భాగాల్లో పండోరాలోని మరిన్ని ప్రదేశాలను చూపించడానికి క్లిష్టతరమైన గ్రాఫిక్స్ అవసరం కావడంతో.. అది ఆలస్యం అయింది. మొత్తంగా నాలుగు సీక్వెల్స్ రూపొందిస్తున్నారని కూడా వార్తలు అప్పుడే వచ్చాయి.

2016లో జరిగిన కామిక్ కాన్ ఈవెంట్‌లో జేమ్స్ కామెరూన్ అవతార్ 2, అవతార్ 3, అవతార్ 4, అవతార్ 5లను అధికారికంగా ప్రకటించారు.  అవతార్ 2, 2020లో అవతార్ 3, 2022లో అవతార్ 4, 2023లో అవతార్ 5 విడుదల అవుతాయని 2018లో తెలిపారు. అయితే ఆ తర్వాత అవి ప్రతి సంవత్సరం వాయిదా పడుతూనే వచ్చాయి.

ఎనిమిది సార్లు వాయిదా పడ్డాక.. 2022, డిసెంబర్ 16వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. 2024 డిసెంబర్ 20వ తేదీన అవతార్ 3 విడుదల కానుంది. 2026 డిసెంబర్ 18వ తేదీన అవతార్ 4, 2028 డిసెంబర్ 22వ తేదీన అవతార్ 5 విడుదల అవుతాయని తెలిపారు.

అవతార్ 2, అవతార్ 3ల సక్సెస్ మీదనే మిగతా సినిమాల విడుదల ఆధారపడి ఉంటుందని నిర్మాతలు పేర్కొన్నారు. కానీ 2020లో జేమ్స్ కామెరూన్ మీడియాతో మాట్లాడినప్పుడు అవతార్ 2 పూర్తిగా, అవతార్ 3.. 95 శాతం షూటింగ్ పూర్తయిపోయిందని తెలిపారు. సినిమా నిర్మాతల్లో ఒకరు గతంలో మీడియాతో మాట్లాడుతూ.. అవతార్ 4 షూటింగ్ సగానికి పైగా పూర్తయిందని పేర్కొన్నారు. అవతార్ 4, అవతార్ 5ల షూటింగ్ కూడా దాదాపు చివరిదశకు వచ్చేసిందని పలు వార్తా కథనాలు వస్తున్నాయి. ఈ నాలుగు సినిమాలకు కలిపి బిలియన్ డాలర్ల (సుమారు రూ.7,500 కోట్లు పైనే) బడ్జెట్ అవుతుందని తెలుస్తోంది. మార్కెటింగ్, పబ్లిసిటీతో కలుపుకుంటే ఈ మొత్తం మరింత పెరగనుంది.

ఎప్పుడు వచ్చినా విధ్వంసం ఖాయం!
అవతార్ సీక్వెళ్లు ఎప్పుడు విడుదల అయినా బాక్సాఫీస్ దగ్గర ఊచకోత మాత్రం ఖాయం. ఈ సినిమాకు సంబంధించిన చిన్న అప్‌డేట్ వచ్చినా సోషల్ మీడియా మొత్తం షేక్ అవుతుంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్‌ను విడుదల చేసి రిలీజ్ డేట్‌ను ప్రకటించారు. అప్పట్నుంచి సోషల్ మీడియా అవతార్ మేనియాలో ఊగిపోతుంది. విడుదల దగ్గరకు వెళ్లేసరికి ఈ హైప్ ఆకాశాన్ని దాటి అంతరిక్షాన్ని చేరుకున్నా ఆశ్చర్యపోనవసరం లేదు.

Also Read: లిప్ లాక్ సీన్స్ పై ట్రోలింగ్.. స్పందించిన అనుపమ..

Also Read: మొన్న 'RRR'.. ఇప్పుడు 'BBB'.. క్రేజీ మల్టీస్టారర్ సెట్ అవుతుందా..?

Also Read: సమంతతో త్రివిక్రమ్ ప్లాన్.. నిజమేనా..?

Also Read: 'అవతార్ 2' రిలీజ్ డేట్ లాక్ చేసిన మేకర్స్.. ఫ్యాన్స్ కు పండగే..

Also Read: మలైకాకి బ్రేకప్ చెప్పేశాడా..? ఇదిగో క్లారిటీ..

Also Read: మెగా హీరో కొత్త సినిమా టైటిల్ ఇదేనా..?

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at : 13 Jan 2022 06:27 PM (IST) Tags: James cameron Avatar 2 Avatar 2 release date Avatar Avatar Facts Avatar 3 Avatar 4 Avatar 5 Facts Behind Avatar

సంబంధిత కథనాలు

Karate Kalyani: నన్ను చంపేందుకు నా కార్ టైర్లు కోసేశారు, పెద్ద ప్రమాదం తప్పింది: కరాటే కళ్యాణి

Karate Kalyani: నన్ను చంపేందుకు నా కార్ టైర్లు కోసేశారు, పెద్ద ప్రమాదం తప్పింది: కరాటే కళ్యాణి

షారుక్‌‌తో నటించేందుకు ఆ పాక్ నటుడు రూ.1 మాత్రమే తీసుకున్నాడట!

షారుక్‌‌తో నటించేందుకు ఆ పాక్ నటుడు రూ.1 మాత్రమే తీసుకున్నాడట!

Adipurush: థియేటర్లో హనుమంతుడి కోసం ప్రత్యేకంగా ఒక సీటు - 'ఆదిపురుష్' టీమ్ అరుదైన నిర్ణయం

Adipurush: థియేటర్లో హనుమంతుడి కోసం ప్రత్యేకంగా ఒక సీటు - 'ఆదిపురుష్' టీమ్ అరుదైన నిర్ణయం

Agent OTT release: 'ఏజెంట్' రీ-కట్ వెర్షన్ కూడా బాగోలేదా? ఓటీటీలో రిలీజ్ ఇప్పట్లో కష్టమేనా?

Agent OTT release: 'ఏజెంట్' రీ-కట్ వెర్షన్ కూడా బాగోలేదా? ఓటీటీలో రిలీజ్ ఇప్పట్లో కష్టమేనా?

Adipurush: సినీ చరిత్రలో నిలిచిపోయే విధంగా ‘ఆదిపురుష్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏర్పాట్లు

Adipurush: సినీ చరిత్రలో నిలిచిపోయే విధంగా ‘ఆదిపురుష్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏర్పాట్లు

టాప్ స్టోరీస్

డ్వాక్రా మహిళల్ని మోసం చేసిన ఘనుడు సీఎం జగన్, చార్జ్ షీట్ రిలీజ్ చేసిన తెలుగు మహిళలు

డ్వాక్రా మహిళల్ని మోసం చేసిన ఘనుడు సీఎం జగన్, చార్జ్ షీట్ రిలీజ్ చేసిన తెలుగు మహిళలు

దేశంలోనే టాప్ విద్యాసంస్థగా ఐఐటీ మద్రాస్​, యూనివర్సిటీల్లో 10వ స్థానంలో హెచ్‌సీయూ!

దేశంలోనే టాప్ విద్యాసంస్థగా ఐఐటీ మద్రాస్​, యూనివర్సిటీల్లో 10వ స్థానంలో హెచ్‌సీయూ!

TSLPRB: పోలీసు అభ్యర్థులకు అలర్ట్, వివరాల్లో తప్పుల సవరణకు చివరి అవకాశం!

TSLPRB: పోలీసు అభ్యర్థులకు అలర్ట్, వివరాల్లో తప్పుల సవరణకు చివరి అవకాశం!

Google AI Course: ఉచిత ఏఐ కోర్సులు అందిస్తున్న గూగుల్, పూర్తి చేసిన వారికి బ్యాడ్జ్‌లు

Google AI Course: ఉచిత ఏఐ కోర్సులు అందిస్తున్న గూగుల్, పూర్తి చేసిన వారికి బ్యాడ్జ్‌లు