Anupama Parameswaran: లిప్ లాక్ సీన్స్ పై ట్రోలింగ్.. స్పందించిన అనుపమ..
తాజాగా లిప్ లాక్ ట్రోలింగ్ పై స్పందించింది అనుపమ.
మలయాళ ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్ తెలుగులో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. మొదటినుంచి కూడా ఈ బ్యూటీ గ్లామర్ షోకి దూరంగా ఉంటుంది. అలానే ఇంటిమేట్ సీన్స్ లో అసలు నటించదు. తన పాత్రకు ప్రాముఖ్యత ఉన్న కథలనే ఎన్నుకుంటూ కెరీర్ పరంగా దూసుకుపోతుంది. తాజాగా 'రౌడీబాయ్స్' అనే సినిమాలో నటించింది. ప్రముఖ నిర్మాత దిల్ రాజు సోదరుడి కుమారుడు ఆశిష్ రెడ్డి ఈ సినిమాతో హీరోగా పరిచయమవుతున్నారు.
ఇటీవల విడుదలైన సినిమా ట్రైలర్ లో హీరోతో లిప్ లాక్ సీన్స్ లో నటించింది అనుపమ పరమేశ్వరన్. ఈ విషయంలో చాలా మంది అనుపమను ట్రోల్ చేశారు. డబ్బు కోసం ఇలాంటి సన్నివేశాల్లో నటిస్తావా..? అంటూ ఆమెను టార్గెట్ చేశారు. తాజాగా ఈ ట్రోలింగ్ పై స్పందించింది అనుపమ. హీరో ఆశిష్ తో కలిసి లిప్ లాక్ సీన్స్ పై వచ్చిన మీమ్స్ ను చూసి నవ్వుకుంది అనుపమ.
అభిమానులు ఫీల్ అవుతున్నారని భావించి వారికి సారీ చెప్పి.. ఇంకెప్పుడూ ఆశిష్ ను టచ్ చేయనని చెప్పింది. అయినా సినిమాలో లిప్ లాక్ సీన్స్ లో నటించింది తాము కాదని.. తమ పాత్రలని చెప్పుకొచ్చింది. సినిమాలో ఆ సీన్స్ చూసిన తరువాత నెటిజన్లు మనసు మార్చుకుంటారని చెప్పింది అనుపమ. లిప్ లాక్ సీన్స్ ను కూడా ప్రమోషన్స్ కోసం వాడేసుకుంది 'రౌడీబాయ్స్' టీమ్. ప్రస్తుతం అనుపమ రియాక్ట్ అయిన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Here’s the trailer of #RowdyBoys💥https://t.co/Ew1AZLVION
— Sri Venkateswara Creations (@SVC_official) January 8, 2022
This Jan 14th, Revisit the action,drama & romance of college life with #RowdyBoys
#Ashish @anupamahere @ThisIsDSP @HarshaKonuganti @Madhie1 @SVC_official @adityamusic #sahidevvikram @komaleeprasad pic.twitter.com/aMf4XKdtL0
Also Read: మొన్న 'RRR'.. ఇప్పుడు 'BBB'.. క్రేజీ మల్టీస్టారర్ సెట్ అవుతుందా..?
Also Read: సమంతతో త్రివిక్రమ్ ప్లాన్.. నిజమేనా..?
Also Read: 'అవతార్ 2' రిలీజ్ డేట్ లాక్ చేసిన మేకర్స్.. ఫ్యాన్స్ కు పండగే..
Also Read: మలైకాకి బ్రేకప్ చెప్పేశాడా..? ఇదిగో క్లారిటీ..
Also Read: మెగా హీరో కొత్త సినిమా టైటిల్ ఇదేనా..?
Also Read: సమంతతో విడాకులపై స్పందించిన చైతు.. ఇప్పుడు నేను హ్యాపీ..