Arjun Kapoor: మలైకాకి బ్రేకప్ చెప్పేశాడా..? ఇదిగో క్లారిటీ..
అర్జున్ కపూర్ తన లవ్ లైఫ్ గురించి క్లారిటీ ఇచ్చారు.
బాలీవుడ్ యంగ్ హీరో అర్జున్ కపూర్ చాలా కాలంగా మలైకా అరోరాతో డేటింగ్ చేస్తున్నారు. మలైకా కంటే అర్జున కపూర్ 12 ఏళ్లు చిన్నవాడు. అయినప్పటికీ.. ఆమెతో ప్రేమాయణం సాగిస్తున్నారు. ఈ విషయంలో చాలా మంది అర్జున్ కపూర్ ని ట్రోల్ చేస్తుండేవారు. ఇప్పటికీ ఈ జంట అప్పుడప్పుడు సోషల్ మీడియాలో ట్రోలింగ్ కి గురవుతూ ఉంటుంది. కానీ ఆ విమర్శలను ఈ జంట పెద్దగా పట్టించుకోదు.
పైగా ప్రేమకు వయసుతో సంబంధంలేదని.. తమకు ఒకరిపట్ల ఒకరికి గౌరవం ఉందంటూ ఎప్పటికప్పుడు కొటేషన్స్ షేర్ చేస్తూ ఉంటారు. ఇదిలా ఉండగా.. అర్జున్ కపూర్, మలైకా అరోరా బ్రేకప్ చెప్పుకున్నారని బాలీవుడ్ మీడియాలో కథనాలను ప్రచురిస్తున్నారు. కారణాలు ఏంటో తెలియదు కానీ.. వీరి బ్రేకప్ మాత్రం కన్ఫర్మ్ అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది.
దీంతో నెటిజన్లు.. అన్ని కొటేషన్స్ చెప్పి వీళ్లు కూడా అందరిలానే విడిపోయారంటూ కామెంట్స్ చేయడం మొదలుపెట్టారు. వీటిపై స్పందించిన అర్జున్ కపూర్ తన లవ్ లైఫ్ గురించి క్లారిటీ ఇచ్చారు. మలైకాతో కలిసి తీసుకున్న ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. నీచమైన పుకార్లకు ఇక్కడ చోటు లేదని అన్నారు. అందరూ జాగ్రత్తగా ఉండాలంటూ సూచించారు. దీంతో ఈ వార్తలకు ఫుల్ స్టాప్ పడింది.
View this post on Instagram
Also Read: మెగా హీరో కొత్త సినిమా టైటిల్ ఇదేనా..?
Also Read: సమంతతో విడాకులపై స్పందించిన చైతు.. ఇప్పుడు నేను హ్యాపీ..
Also Read: అక్కడ వినిపించుకునే నాథుడు ఉండాలి కదా..? టికెట్ రేట్ ఇష్యూపై బాలయ్య వ్యాఖ్యలు..
Also Read: ఇలా బెదిరిస్తే వచ్చి కొడతా.. ప్రభాస్ ఫ్యాన్స్ కి 'రాధేశ్యామ్' డైరెక్టర్ వార్నింగ్..
Also Read: 22 ఏళ్ల తరువాత మెగాస్టార్ తో రవితేజ.. ఈసారి ఎలాంటి హిట్ కొడతారో..?
Also Read: ఫూల్స్ డే రోజు మహేష్ రాడట.. కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడంటే..?