Balakrishna: అక్కడ వినిపించుకునే నాథుడు ఉండాలి కదా..? టికెట్ రేట్ ఇష్యూపై బాలయ్య వ్యాఖ్యలు..
'అఖండ' సినిమా సక్సెస్ మీట్ లో బాలయ్య ఇచ్చిన స్పీచ్ ఇప్పుడు వైరల్ అవుతోంది.

నందమూరి బాలకృష్ణ(Balakrishna) నటించిన 'అఖండ'(Akhanda) సినిమా డిసెంబర్ మొదటివారంలో ప్రేక్షకుల ముందుకొచ్చి భారీ విజయాన్ని నమోదు చేసింది. బోయపాటి డైరెక్ట్ చేసిన ఈ సినిమా పాన్ వరల్డ్ సినిమాగా నిలిచిందని బాలకృష్ణ అన్నారు. హైదరాబాద్ లో నిర్వహించిన 'అఖండ' సినిమా సక్సెస్ మీట్ లో బాలయ్య ఇచ్చిన స్పీచ్ ఇప్పుడు వైరల్ అవుతోంది.
రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు పాకిస్థాన్ లో కూడా 'అఖండ' సినిమా చెలరేగిపోతుందని.. అక్కడ నుంచి వాట్సాప్ మెసేజ్ లు, వీడియోలు వస్తున్నాయని అన్నారు బాలయ్య. థియేటర్లకు అసలు జనాలు వస్తారా..? రారా..? అనే భయాందోళనల్లో ఇండస్ట్రీ ఉన్నప్పుడు 'అఖండ' సినిమాను ధైర్యంగా విడుదల చేసిన నిర్మాత రవీందర్ రెడ్డిని పొగిడారు బాలయ్య.
ఈ సినిమా విడుదలైనప్పటి నుంచే సంక్రాంతి పండగ మొదలైందని.. సినిమా ఇండస్ట్రీకి 'అఖండ' ధైర్యాన్నిచ్చిందని అన్నారు. చిన్న, పెద్ద అనే తేడా లేకుండా అన్ని సినిమాలు ఆడాలని కోరుకున్నారు. అలానే దర్శకుడు బోయపాటిని కొనియాడుతూ.. భారతీయ చిత్రపరిశ్రమ గర్వించే దర్శకుడాయన అని చెప్పుకొచ్చారు.
ఇదే సమయంలో విలేకరులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పుకొచ్చారు బాలయ్య. ఏపీలో సినిమా టికెట్ రేట్ ఇష్యూ గురించి బాలయ్యను ప్రశ్నించగా.. తన ఒక్కడి అభిప్రాయం కాదని.. అందరూ కలిసి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని చెప్పారు. ఇండస్ట్రీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో ఆ అభిప్రాయాన్ని ప్రభుత్వం ముందు పెడతామని అన్నారు. సినిమా ఇండస్ట్రీ నుంచి సరైన రిప్రజెంటేషన్ లేకపోవడమే ఈ పరిస్థితికి కారణమా..? అనే మరో ప్రశ్న బాలయ్యకు ఎదురవ్వగా.. 'అక్కడ వినిపించుకునే నాథుడు ఉండాలి కదా..?' అంటూ చెప్పుకొచ్చారు బాలయ్య. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి.
Also Read: ఇలా బెదిరిస్తే వచ్చి కొడతా.. ప్రభాస్ ఫ్యాన్స్ కి 'రాధేశ్యామ్' డైరెక్టర్ వార్నింగ్..
Also Read: 22 ఏళ్ల తరువాత మెగాస్టార్ తో రవితేజ.. ఈసారి ఎలాంటి హిట్ కొడతారో..?
Also Read: ఫూల్స్ డే రోజు మహేష్ రాడట.. కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడంటే..?
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

