Allu Arjun: ఇది కదా బన్నీ బ్రాండ్.. ప్రమోషన్‌లోనూ ఐకాన్ స్టార్ తగ్గేదేలే..
పుష్పరాజ్ రోల్ లో డిఫరెంట్ వేరియేషన్స్ చూపించడమే కాకుండా.. ఈ సినిమాతో తనకంటూ ఓ బ్రాండ్ ను క్రియేట్ చేసుకోవాలని చూశారు బన్నీ.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ 'పుష్ప' సినిమా సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నారు. మొదట ఈ సినిమాకి డివైడ్ టాక్ వచ్చినా.. ఇప్పుడు సినిమాను బ్లాక్ బస్టర్ అంటున్నారు. ఈ రేంజ్ కి తీసుకురావడానికి బన్నీ చాలానే కష్టపడ్డారు. పుష్పరాజ్ రోల్ లో డిఫరెంట్ వేరియేషన్స్ చూపించడమే కాకుండా.. ఈ సినిమాతో తనకంటూ ఓ బ్రాండ్ ను క్రియేట్ చేసుకోవాలని చూశారు. తన హార్డ్ వర్క్ తో అనుకున్నది సాధించారు.
ఈ సినిమా విషయంలో మన ఐకాన్ స్టార్ తీసుకున్న కేర్ అంతా ఇంతా కాదు. రిలీజ్ కి ముందు హైప్ తీసుకురావడానికి రకరకాల ప్రమోషన్స్ చేశారు. చిన్న సినిమా ఈవెంట్స్ కి గెస్ట్ గా వెళ్తూ.. వాళ్లను ప్రోత్సహించడంతో పాటు.. 'తగ్గేదేలే' అంటూ తన సినిమాను కూడా ప్రమోట్ చేసుకునేవారు. నందమూరి బాలకృష్ణ నటించిన 'అఖండ' సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ కి గెస్ట్ గా వెళ్లి 'జై బాలయ్య' అంటూ నందమూరి ఫ్యాన్స్ ను కూడా తనవైపు తిప్పుకున్నారు.
సినిమా భారీ విజయాన్ని అందుకున్న తరువాత కూడా ఇదే ట్రెండ్ ను కంటిన్యూ చేస్తూ.. మరింత హైప్ తీసుకొస్తున్నారు. రీసెంట్ గా దిల్ రాజు సోదరుడి కుమారుడు ఆశిష్ రెడ్డి నటించిన 'రౌడీబాయ్స్' సినిమా ఈవెంట్ కి వెళ్లారు అల్లు అర్జున్. ఈ ఈవెంట్ లో బన్నీ కాస్ట్యూమ్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. 'పుష్ప' సినిమాలో 'ఇది సార్ నా బ్రాండ్' అనే పాపులర్ డైలాగ్ ని టీషర్ట్ పై ప్రింట్ చేయించుకొని.. దాన్ని 'రౌడీబాయ్స్' ఈవెంట్ లో ధరించారు బన్నీ.
ఓపక్క చిన్న సినిమాను ప్రమోట్ చేస్తూనే.. తన 'పుష్ప' సినిమా గురించి హైలైట్ చేస్తూ మాట్లాడారు. సినిమాలో డైలాగ్స్ ని చెబుతూ ఫ్యాన్స్ ను ఎంటర్టైన్ చేశారు. ఇంతకముందు చాలా మంది హీరోలు ఇలా చేశారు కానీ బన్నీ స్టయిలే వేరు. అందుకే ఎక్కడ చూసినా 'పుష్ప' హవానే కనిపిస్తుంది. ట్విట్టర్ లో రోజుకి ఈ సినిమాను పొగుడుతూ లక్షల మంది ట్వీట్స్ వేస్తున్నారు. సినిమా విడుదలై ఇన్ని రోజులవుతున్నా.. 'పుష్ప' ఫీవర్ మాత్రం వదలడం లేదు. మొత్తానికి బన్నీ తన బ్రాండ్ ను ప్రమోట్ చేసుకోవడంలో అస్సలు తగ్గడం లేదు!
Also Read: కరోనా బారిన పడ్డ స్టార్ హీరోయిన్..