అన్వేషించండి
Advertisement
Keerthy Suresh Covid: కరోనా బారిన పడ్డ స్టార్ హీరోయిన్..
స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ కి కోవిడ్ పాజిటివ్ అని నిర్ధారణ అయింది.
దేశంలో కరోనా కేసులు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. దీనికి తోడు ఒమిక్రాన్ వేరియంట్ ఒకటి ఉంది. గత వారం, పదిరోజుల్లో కోవిడ్ బారిన పడ్డ వారి సంఖ్య మరింత పెరిగింది. సామాన్యులతో పాటు సెలబ్రిటీలు కూడా ఈ వైరస్ బారిన పడుతున్నారు. టాలీవుడ్ లో ఇప్పటికే మహేష్ బాబు, మంచు మనోజ్, రాజేంద్రప్రసాద్ ఇలా చాలా మందికి కరోనా సోకింది. పవన్ కళ్యాణ్ కుమారుడు అకీరా నందన్, రేణు దేశాయ్ లు కూడా ఈ వైరస్ బారిన పడినట్లు సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.
ఇప్పుడేమో స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ కి కోవిడ్ పాజిటివ్ అని నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని ఆమె ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. తనకు కోవిడ్ పాజిటివ్ వచ్చిందని..మైల్డ్ సింప్టమ్స్ ఉన్నాయని తెలిపింది. వైరస్ చాలా ర్యాపిడ్ గా స్ప్రెడ్ అవుతుందని.. దయచేసి అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరింది.
ప్రస్తుతం తను ఐసొలేషన్ లో ఉంటున్నట్లు.. ఈ మధ్యకాలంలో తనను కలిసిన వారిని టెస్ట్ లు చేయించుకోమని సూచించింది. వ్యాక్సిన్స్ వేయించుకోకపోతే వెంటనే వెళ్లి వేయించుకోవాలని.. ఆ విధంగా కరోనా తీవ్రత తగ్గే అవకాశాలు ఉన్నాయని చెప్పింది. త్వరలోనే కోలుకొని మళ్లీ మీ ముందుకు వస్తానని తెలిపింది.
ఇక సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం ఈ బ్యూటీ సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన 'సర్కారు వారి పాట' అనే సినిమాలో నటిస్తోంది. పరశురామ్ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాను ఏప్రిల్ 1న విడుదల చేయనున్నారు. దీంతో పాటు మెగాస్టార్ సినిమా 'భోళా శంకర్'లో హీరో సిస్టర్ క్యారెక్టర్ లో కనిపించనుంది.
— Keerthy Suresh (@KeerthyOfficial) January 11, 2022
Also Read: వెంకీ మామ కొత్త బిజినెస్.. ఏంటో తెలుసా..?
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
ఇండియా
పాలిటిక్స్
ఎడ్యుకేషన్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion