అన్వేషించండి
Hero Trailer: మహేష్ మేనల్లుడి 'హీరో' సినిమా ట్రైలర్ చూశారా..?
హీరో మహేష్ బాబు మేనల్లుడు గల్లా అశోక్ తెరగ్రేంటం చేస్తూ అందిస్తున్న తొలి సినిమా హీరో. ఈ సినిమా ట్రయిలర్ ను దర్శకుడు రాజామౌళి విడుదల చేశారు.

'హీరో' సినిమా ట్రైలర్
టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబు మేనల్లుడు గల్లా అశోక్ కథానాయకుడిగా 'హీరో' అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయమవుతున్నారు. ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 15న విడుదల చేయనున్నారు. ప్రమోషన్స్ లో భాగంగా సినిమా ట్రైలర్ ను దర్శకధీరుడు రాజమౌళి విడుదల చేశారు. 'కళ్లలో బిరియానీ వండుకుంటే వాస్తవంలో కడుపు నిండదురా' అనే డైలాగ్ తో ట్రైలర్ మొదలైంది.
ట్రైలర్ చూస్తున్నంతసేపు డిఫరెంట్ ఫీలింగ్ కలుగుతుంది. ఇక చివర్లో 'క్రియేటివ్ పీపుల్ కథ చెప్పరు' అనే డైలాగ్ హైలైట్ గా నిలిచింది. ట్రైలర్ లో కథను చెప్పకుండా జాగ్రత్త పడ్డాడు డైరెక్టర్. చాలా మంది నటుడు, సన్నివేశాలను మాత్రం ట్రైలర్ లో చూపించారు. హీరో క్యారెక్టర్ ఎలా ఉండబోతుందో మాత్రం క్లారిటీ ఇచ్చారు.
కానీ ఆ పాత్ర చుట్టూ అల్లుకున్న కథేంటో సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. కమెడియన్స్ కూడా చాలా మంది ఉన్నారు. కానీ ట్రైలర్ లో కామెడీ సన్నివేశాలను చూపించలేదు. లవ్, కామెడీ, యాక్షన్ సన్నివేశాలతో సినిమా సాగనుందని తెలుస్తోంది. జిబ్రాన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ట్రైలర్ కి హైలైట్ గా నిలిచింది. నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమాలో జగపతిబాబు, వెన్నెల కిషోర్ తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. పద్మావతి గల్లా ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
Here’s #HeroTrailer… https://t.co/T3VEGVOszT
— rajamouli ss (@ssrajamouli) January 10, 2022
My best wishes to the entire team of #HERO and especially to @AshokGalla_ on his debut..:)#HEROFromJAN15th@AgerwalNidhhi @SriramAdittya @GhibranOfficial #PadmavathiGalla @JayGalla @amararajaent @adityamusic
Also Read: సంక్రాంతి రేసు నుంచి తప్పుకున్న మరో సినిమా..
ఇంకా చదవండి





















