Hrithik Roshan: వేద పాత్రలో హృతిక్ ఇంటెన్స్ లుక్.. ఫ్యాన్స్ కు బర్త్ ట్రీట్..

వేద పాత్రలో హృతిక్ లుక్ ఆకట్టుకుంటుంది. ఆయన రగ్డ్ గెటప్ కి ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు.

FOLLOW US: 

కోలీవుడ్ లో మాధవన్- విజయ్ సేతుపతి కలిసి నటించిన 'విక్రమ్ వేద' సినిమా భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను మిగిలిన భాషల్లో రీమేక్ చేయబోతున్నట్లు వార్తలు వచ్చాయి. తెలుగులో కూడా సినిమా రీమేక్ అవుతుందని అన్నారు. అయితే ముందుగా హిందీ రీమేక్ మొదలైంది. ఈ రీమేక్ లో బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్, సైఫ్ అలీ ఖాన్ లు నటిస్తున్నారు. భూషణ్ కుమార్ టీసీరీస్‌, రిల‌య‌న్స్ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌, ఫ్రైడే ఫిల్మ్ వ‌ర్క్స్, ఎస్‌.శ‌శికాంత్ వైనాట్ స్టూడియోస్‌తో క‌లిసి ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. 

ఈ సినిమాలో రాధికా ఆప్టే హీరోయిన్ గా నటిస్తోంది. 'విక్ర‌మ్‌ వేద' ఒరిజిన‌ల్‌ వెర్షన్ కు క‌థ రాసి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన పుష్క‌ర్‌, గాయత్రి.. ఈ హిందీ రీమేక్ ను కూడా డైరెక్ట్ చేస్తున్నారు. ఈ సినిమా ఎప్పుడు విడుదలవుతుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు అభిమానులు. ఈరోజు హృతిక్ రోషన్ తన 48వ పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా సినిమాలో ఆయన ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు. 

వేద పాత్రలో హృతిక్ లుక్ ఆకట్టుకుంటుంది. ఆయన రగ్డ్ గెటప్ కి ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. లాంగ్ హెయిర్, గడ్డం, నల్ల కుర్తా, గ్లాసెస్ వేసుకొని రక్తంతో తడిసిన అతడిని చూస్తుంటే.. సినిమాలో యాక్షన్ సీన్స్ ఓ రేంజ్ లో ఉంటాయని తెలుస్తోంది. విక్ర‌మ్ ఔర్ బీటాల్‌ను ఆధారంగా చేసుకుని తెర‌కెక్కించిన నియో-నాయ‌ర్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ సినిమా ఇది. ఒక పోలీస్‌.. గ్యాంగ్ స్టర్ ను పట్టుకోవడానికి చేసే ప్రయత్నమే ఈ సినిమా. 

Also Read: 'మీరెప్పటికీ మాతోనే ఉంటారు..' నమ్రత ఎమోషనల్ పోస్ట్..

Published at : 10 Jan 2022 11:26 AM (IST) Tags: Saif Ali Khan Hrithik Roshan vikram veda hrithik first look Hrithik roshan birthday

సంబంధిత కథనాలు

Ram Charan: రామ్ చరణ్ ను తీసుకోకుండా ఉండాల్సింది - స్టార్ రైటర్ కామెంట్స్!

Ram Charan: రామ్ చరణ్ ను తీసుకోకుండా ఉండాల్సింది - స్టార్ రైటర్ కామెంట్స్!

Samanta on Liger poster: వాటిని కూడా బ్రేక్ చేయగలడు - విజయ్ దేవరకొండ ‘లైగర్’ పోస్టర్‌పై సమంత కామెంట్

Samanta on Liger poster: వాటిని కూడా బ్రేక్ చేయగలడు - విజయ్ దేవరకొండ ‘లైగర్’ పోస్టర్‌పై  సమంత కామెంట్

Naresh Pavithra Lokesh: మా అత్తగారి డైమండ్ నెక్లెస్ పవిత్ర దగ్గరే ఉంది, నరేష్ మూడో భార్య రమ్య ఆరోపణలు

Naresh Pavithra Lokesh: మా అత్తగారి డైమండ్ నెక్లెస్ పవిత్ర దగ్గరే ఉంది, నరేష్ మూడో భార్య రమ్య ఆరోపణలు

Naresh and Pavithra Lokesh: మైసూరు హోటల్‌లో నరేష్, పవిత్ర - చెప్పుతో కొట్టబోయిన మూడో భార్య రమ్య

Naresh and Pavithra Lokesh: మైసూరు హోటల్‌లో నరేష్, పవిత్ర - చెప్పుతో కొట్టబోయిన మూడో భార్య రమ్య

Samantha On Unhappy Marriage: సంసార జీవితాల్లో సంతోషం లేకపోవడానికి నువ్వే కారణం కరణ్ - సమంత

Samantha On Unhappy Marriage: సంసార జీవితాల్లో సంతోషం లేకపోవడానికి నువ్వే కారణం కరణ్ - సమంత

టాప్ స్టోరీస్

Pawan Kalyan: జనవాణి జనసేన భరోసాకు విశేష స్పందన - పవన్ కళ్యాణ్‌కు సీఎం జగన్‌పైనే తొలి ఫిర్యాదు !

Pawan Kalyan: జనవాణి జనసేన భరోసాకు విశేష స్పందన - పవన్ కళ్యాణ్‌కు సీఎం జగన్‌పైనే తొలి ఫిర్యాదు !

Viral Video: గుర్రమెక్కిన ఫుడ్ డెలివరీ బాయ్, ఎందుకో ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది

Viral Video: గుర్రమెక్కిన ఫుడ్ డెలివరీ బాయ్, ఎందుకో ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది

Amit Shah: తెలంగాణ, పశ్చిమ బెంగాల్లో అధికారంలోకి వస్తాం: అమిత్‌షా, భాగ్యనగర్ డిక్లరేషన్ పేరుతో తీర్మానం

Amit Shah: తెలంగాణ, పశ్చిమ బెంగాల్లో అధికారంలోకి వస్తాం: అమిత్‌షా, భాగ్యనగర్ డిక్లరేషన్ పేరుతో తీర్మానం

BJP Executive Meeting: బీజేపీ మీటింగ్‌లోకి ఇంటెలిజెన్స్ అధికారి ఎంట్రీ, అవి ఫోటోలు తీస్తుండగా పట్టేసిన నేతలు!

BJP Executive Meeting: బీజేపీ మీటింగ్‌లోకి ఇంటెలిజెన్స్ అధికారి ఎంట్రీ, అవి ఫోటోలు తీస్తుండగా పట్టేసిన నేతలు!