అన్వేషించండి
Ramesh Babu: 'మీరెప్పటికీ మాతోనే ఉంటారు..' నమ్రత ఎమోషనల్ పోస్ట్..
మహేష్ బాబు భార్య నమ్రత రమేష్ బాబు మృతి పట్ల స్పందిస్తూ ఎమోషనల్ అయ్యారు.
![Ramesh Babu: 'మీరెప్పటికీ మాతోనే ఉంటారు..' నమ్రత ఎమోషనల్ పోస్ట్.. Namrata Emotional post on Ramesh Babu Ramesh Babu: 'మీరెప్పటికీ మాతోనే ఉంటారు..' నమ్రత ఎమోషనల్ పోస్ట్..](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/01/09/94db1a607538f7a57aee5674f0c9a87b_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
నమ్రత ఎమోషనల్ పోస్ట్..
సూపర్ స్టార్ కృష్ణ కుమారుడు రమేష్ బాబు(56) శనివారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. లివర్ వ్యాధితో బాధపడుతున్న ఆయన్ను హాస్పిటల్ లో జాయిన్ చేయడానికి తీసుకెళ్లే సమయంలో మరణించారు. రమేష్ బాబు మరణవార్తతో కృష్ణ ఫ్యామిలీ దిగ్బ్రాంతికి గురైనది. సినీ ఇండస్ట్రీలో విషాద ఛాయలు నెలకొన్నాయి. సెలబ్రిటీలంతా సోషల్ మీడియా వేదికగా రమేష్ బాబుకి నివాళులు అర్పిస్తున్నారు. తన కుమారుడి పార్థివదేహాన్ని చూసి కృష్ణ ఎమోషనల్ అయ్యారు.
కాసేపటి క్రితమే మహాప్రస్థానంలో రమేష్ బాబు అంత్యక్రియలు పూర్తయ్యాయి. అయితే తన అన్నయ్యను చివరిసారిగా కూడా చూసుకోలేకపోయారు మహేష్ బాబు. తనకు కరోనా సోకడంతో ఐసోలేషన్ లో ఉన్నారు. ఇలాంటి సమయంలో తన అన్నయ్యను కోల్పోవడాన్ని తట్టుకోలేకపోతున్నారు మహేష్ బాబు. సోషల్ మీడియాలో తన అన్నయ్యను ఉద్దేశిస్తూ ఓ పోస్ట్ పెట్టారు.
'నువ్వే నాకు స్ఫూర్తి.. నువ్వే నా బలం.. నువ్వే నా ధైర్యం.. నాకంతా నువ్వే.. నువ్ లేకుంటే ఈరోజు నేను ఇలా ఉండేవాడిని కాదు. నువ్ నాకోసం చేసిన అన్నింటికీ ధన్యవాదాలు. ఇప్పుడు విశ్రాంతి తీస్కో.. ఈ జీవితంలోనే కాదు.. నాకు మరో జీవితం ఉంటే అప్పటికీ నువ్వే నా అన్నయ్య.. నిన్ను ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటాను' అంటూ రాసుకొచ్చారు.
మహేష్ బాబు భార్య నమ్రత కూడా రమేష్ బాబు మృతి పట్ల స్పందిస్తూ ఎమోషనల్ అయ్యారు. ఆయన భౌతికంగా దూరమైనా.. ఎప్పటికీ మా గుండెల్లోనే ఉంటారని.. మా కుటుంబాలకు అన్నయ్య పిల్లర్ లాంటి వారు అని చెప్పుకొచ్చింది. ఆయన మాకు నేర్పిన జీవిత పాఠాలను ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటామని .. అన్నయ్య మేమంతా మిమ్మల్ని ప్రేమిస్తూనే ఉంటామని నమ్రత ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది.
View this post on Instagram
Also Read: వందల కోట్ల ఆఫర్.. రిజెక్ట్ చేసిన ప్రభాస్..
Also Read: రమేష్ బాబు Vs బాలకృష్ణ.. ఆ టైటిల్ కోసం వివాదం..
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్స్క్రైబ్ చేయండి.
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఇండియా
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్
సినిమా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)
Nagesh GVDigital Editor
Opinion