అన్వేషించండి
Advertisement
Mahesh Babu: 'నువ్ లేకుంటే నేను లేను.. నువ్ ఎప్పటికీ నాకు అన్నయ్యవే' మహేష్ భావోద్వేగం..
రమేష్ బాబుతో మహేష్ బాబుకి మంచి బాండింగ్ ఉండేది. అన్నయ్యగా కంటే తండ్రిగా మహేష్ బాబుని చూసుకునేవారు రమేష్ బాబు.
సూపర్ సార్ట్ కృష్ణ తనయుడు, మహేష్ బాబు సోదరుడు రమేష్ బాబు శనివారం రాత్రి ఆరోగ్య సమస్యలతో మరణించారు. లివర్ సంబంధిత వ్యాధితో ఆయన కన్నుమూసినట్లు తెలుస్తోంది. శనివారం సాయంత్రం ఆయన తీవ్ర అస్వస్థతకు గురవడంతో ఏషియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ ఆస్పత్రికి తరలించారు. కానీ ఆయన అప్పటికే మరణించినట్టు వైద్యులు పేర్కొన్నారు. దీంతో కృష్ణ కుటుంబంలో విషాద ఛాయలు నెలకొన్నాయి.
రమేష్ బాబుతో మహేష్ బాబుకి మంచి బాండింగ్ ఉండేది. అన్నయ్యగా కంటే తండ్రిగా మహేష్ బాబుని చూసుకునేవారు రమేష్ బాబు. కృష్ణ సినిమాలతో బిజీగా ఉండడంతో.. మహేష్ బాధ్యతలను రమేష్ చూసుకునేవారు. దీంతో అన్నయ్య అంటే మహేష్ కి అమితమైన ప్రేమ. తనకు ఏం కావాలన్నా.. ముందు అన్నయ్య దగ్గరకే వెళ్లేవారు మహేష్. అలాంటి వ్యక్తిని కోల్పోవడం మహేష్ కి ఎప్పటికీ తీరని లోటు.
సొంత అన్నయ్య చనిపోయినా.. చివరి చూపు కూడా చూసుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు మహేష్ బాబు. ఆయనకు కరోనా రావడంతో ఐసొలేషన్ లో ఉన్నారు. దీంతో అంత్యక్రియలకు వెళ్లలేకపోయారు. సోషల్ మీడియా వేదికగా తన అన్నయ్యకు నివాళులు అర్పించారు.
'నువ్వే నాకు స్ఫూర్తి.. నువ్వే నా బలం.. నువ్వే నా ధైర్యం.. నాకంతా నువ్వే.. నువ్ లేకుంటే ఈరోజు నేను ఇలా ఉండేవాడిని కాదు. నువ్ నాకోసం చేసిన అన్నింటికీ ధన్యవాదాలు. ఇప్పుడు విశ్రాంతి తీస్కో.. ఈ జీవితంలోనే కాదు.. నాకు మరో జీవితం ఉంటే అప్పటికీ నువ్వే నా అన్నయ్య.. నిన్ను ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటాను' అంటూ ఎమోషనల్ గా రాసుకొచ్చారు. దీన్ని బట్టి మహేష్ కి తన అన్నయ్య అంటే ఎంత ప్రేమో తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ అవుతోంది. ఇక మహాప్రస్థానంలో రమేష్ బాబు అంత్యక్రియలను పూర్తి చేశారు.
— Mahesh Babu (@urstrulyMahesh) January 9, 2022
Also Read: వందల కోట్ల ఆఫర్.. రిజెక్ట్ చేసిన ప్రభాస్..
Also Read: రమేష్ బాబు Vs బాలకృష్ణ.. ఆ టైటిల్ కోసం వివాదం..
Also Read: రామ్.. మంచి కాఫీ లాంటి అబ్బాయ్.. భర్తపై ప్రేమ కురిపించిన సునీత..
Also Read: 2022.. చప్పగా స్టార్ట్ అయిందే..
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్స్క్రైబ్ చేయండి.
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
ఇండియా
సినిమా
సినిమా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Nagesh GVDigital Editor
Opinion