అన్వేషించండి
Advertisement
DJ Tillu: సంక్రాంతి రేసు నుంచి తప్పుకున్న మరో సినిమా..
తాజాగా 'డీజే టిల్లు' సినిమా కూడా వాయిదా పడినట్లు తెలుస్తోంది. యువ హీరో సిద్ధూ జొన్నలగడ్డ నేహా శెట్టి జంటగా సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ ఈ సినిమాను నిర్మించింది.
నిజానికి ఈ సంక్రాంతికి 'ఆర్ఆర్ఆర్', 'రాధేశ్యామ్' లాంటి సినిమాలు థియేటర్లలో సందడి చేయాల్సింది కానీ ఇప్పుడు పెద్ద సినిమాలన్నీ వాయిదా పడ్డాయి. ముందుగా 'ఆర్ఆర్ఆర్' సినిమాను వాయిదా వేయగా.. ఆ తరువాత 'రాధేశ్యామ్'ను కూడా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. కరోనా, ఒమిక్రాన్ కేసులు పెరిగిపోవడం.. కొన్ని రాష్ట్రాల్లో లాక్ డౌన్, థియేటర్లలో యాభై శాతం ఆక్యుపెన్సీ ఇలా పలు కారణాల వలన సినిమాలన్నీ వాయిదా పడుతున్నాయి.
ఎప్పుడైతే పెద్ద సినిమాలు వాయిదా పడ్డాయో.. వెంటనే చిన్న సినిమాలన్నీ క్యూ కట్టేశాయి. దాదాపు పది సినిమాలు రిలీజ్ డేట్స్ ని అనౌన్స్ చేశాయి. కానీ ఇప్పుడు అవి కూడా ఒక్కొక్కటిగా పోస్ట్ పోన్ అవుతున్నాయి. దర్శకుడు ఎం.ఎస్.రాజు రూపొందించిన '7 డేస్ 6 నైట్స్' సినిమాను సంక్రాంతి సీజన్ లో రిలీజ్ చేస్తామని అనౌన్స్ చేసి మళ్లీ వాయిదా వేశారు.
తాజాగా 'డీజే టిల్లు' సినిమా కూడా వాయిదా పడినట్లు తెలుస్తోంది. యువ హీరో సిద్ధూ జొన్నలగడ్డ నేహా శెట్టి జంటగా సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ ఈ సినిమాను నిర్మించింది. విమల్ కృష్ణ దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ సినిమాను జనవరి 14న రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. కానీ ఇప్పుడేమో సినిమా వాయిదా పడిందని తెలిపారు. కోవిడ్ కేసులు పెరిగిపోతుండడంతో.. 'డీజే టిల్లు' చెప్పిన టైంకి రాలేకపోతున్నాడని.. రిలీజ్ ఆలస్యమైనా రావడం పక్కా అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు.
Hang in there, to experience the crazy fun ride in theatres just when it's the time. Until then everyone #MaskUp & #StaySafe
— Sithara Entertainments (@SitharaEnts) January 10, 2022
#DJTillu #DJTilluPostponed @siddu_buoy @MusicThaman @iamnehashetty @K13Vimal @vamsi84 @SricharanPakala @SitharaEnts @Fortune4Cinemas @adityamusic pic.twitter.com/roKmFwTedn
Also Read: శ్రీకాకుళం కథతో మెగాస్టార్ సినిమా.. ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్..
Also Read: 'నేనే ఫస్ట్ ప్రపోజ్ చేశా..' శాంతనుతో ఎఫైర్ పై శృతి కామెంట్స్..
Also Read: వేద పాత్రలో హృతిక్ ఇంటెన్స్ లుక్.. ఫ్యాన్స్ కు బర్త్ ట్రీట్..
Also Read: 'మీరెప్పటికీ మాతోనే ఉంటారు..' నమ్రత ఎమోషనల్ పోస్ట్..
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
పాలిటిక్స్
హైదరాబాద్
ఆటో
హైదరాబాద్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion