Deepthi Sunaina: దీప్తి బ్రేకప్ చెప్పినా.. షన్ను అదే పని, ఆ స్టాటస్ చూసిందో లేదో..
ఈరోజు దీప్తి సునయన పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటుంది. ఈ సందర్భంగా షణ్ముఖ్ ఆమెకి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పాడు.
యూట్యూబ్ స్టార్ షణ్ముఖ్, దీప్తి సునయన దాదాపు ఐదేళ్లపాటు రిలేషన్ లో ఉన్నారు. కానీ రీసెంట్ గా ఈ జంట విడిపోయింది. దానికి కారణం బిగ్ బాస్ షో అనే చెప్పాలి. బిగ్ బాస్ సీజన్ 5లో కంటెస్టెంట్ గా పాల్గొన్న షణ్ముఖ్ కొన్ని రోజుల పాటు హౌస్ లో బాగానే ఉన్నాడు. ఎప్పుడైతే అతడు సిరికి ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యాడో.. అప్పటినుంచి సీన్ మొత్తం మారిపోయింది. ఆమెతో హగ్గులు, కిస్సులతో హౌస్ లో రెచ్చిపోయాడు. షణ్ముఖ్-సిరిలను ఆన్ స్క్రీన్ పై చూడడానికి జనాలు కూడా ఇబ్బంది పడ్డారు.
ఈ విషయం దీప్తి సునయనకు కూడా నచ్చలేదు. షణ్ముఖ్ హౌస్ లో ఉన్నంతకాలం అతడికి సపోర్ట్ గా నిలిచిన ఆమె.. అతడు బయటకొచ్చిన తరువాత బ్రేకప్ చెప్పేసింది. షణ్ముఖ్ కూడా ఆమె నిర్ణయాన్ని గౌరవిస్తూ.. ఆమె కోసం సోషల్ మీడియాలో ఓ లెటర్ పోస్ట్ చేశాడు. అప్పటినుంచి వీరిద్దరికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఈరోజు దీప్తి సునయన పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటుంది. ఈ సందర్భంగా షణ్ముఖ్ ఆమెకి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పాడు. ఈ మేరకు దీప్తితో కలిసి తీసుకున్న ఓ పాత ఫొటోను షేర్ చేస్తూ.. 'హ్యాపీ బర్త్ డే D(దీప్తి)' అని రాసుకొచ్చాడు. అలానే వీరిద్దరూ కలిసి నటించిన 'మలుపు' సిరీస్ లోని ఓ సాంగ్ ను జత చేశాడు. అయితే షన్ను పెట్టిన ఈ పోస్ట్ ను దీప్తి చూసిందో లేదో మరి. ఇప్పటివరకు అయితే ఆమె దీనిపై రియాక్ట్ అవ్వలేదు!
Also Read: శ్రీకాకుళం కథతో మెగాస్టార్ సినిమా.. ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్..
Also Read: 'నేనే ఫస్ట్ ప్రపోజ్ చేశా..' శాంతనుతో ఎఫైర్ పై శృతి కామెంట్స్..
Also Read: వేద పాత్రలో హృతిక్ ఇంటెన్స్ లుక్.. ఫ్యాన్స్ కు బర్త్ ట్రీట్..
Also Read: 'మీరెప్పటికీ మాతోనే ఉంటారు..' నమ్రత ఎమోషనల్ పోస్ట్..