Acharya: శ్రీకాకుళం కథతో మెగాస్టార్ సినిమా.. ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్..
'ఆచార్య' సినిమాకి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ విషయం వెలుగులోకి వచ్చింది.
మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ కీలక పాత్రలో తెరకెక్కుస్తోన్న చిత్రం 'ఆచార్య'. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ సమర్పణలో, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకాలపై స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో నిరంజన్ రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటుంది. ఫిబ్రవరి 4న ఈ సినిమాను రిలీజ్ చేయనున్నట్లు అనౌన్స్ చేశారు. కానీ ఇప్పుడు చెప్పిన టైంకి వస్తుందో లేదో తెలియని పరిస్థితి.
ఇదిలా ఉండగా.. ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. నిజానికి ఈ సినిమాను దేవాదాయ భూములు అన్యాక్రాంతం కావడం అనే అంశంపై తెరకెక్కిస్తున్నారు. అయితే ఇది నిజమైన కథ అని అంటున్నారు. 1970లలో శ్రీకాకాకుళం జిల్లాలో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ సినిమాను రూపొందించారట.
ఒరిస్సాకు చెందిన సుబ్బారావు అనే వ్యక్తి శ్రీకాకుళంలో బొడ్డపాడు అనే గ్రామంలో శివుడి గుడిలో పూజారిగా వ్యవహరిస్తూ.. భూస్వాములకు వ్యతిరేకంగా ఉద్యమం చేశారు. అతడి జీవితం ఆధారంగానే 'సుబ్బారావు పాణిగ్రాహి' అనే పుస్తకాన్ని రాశారు. సుబ్బారావు తరువాత అతడి తమ్ముడు హేమచంద్ర పాణిగ్రాహి ఈ ఉద్యమాన్ని నడిపించారు.
అదే సమయంలో ఆదిభట్ల కైలాసం, వెంపటి సత్యం అనే ఇద్దరు నక్సలైట్లు సుబ్బారావు ఉద్యమానికి చేదోడుగా నిలిచారు. వీరిద్దరూ ఉపాధ్యాయులుగా పని చేసి అక్కడ ప్రజలను చైతన్యవంతులను చేసేవారు. ఇదే కథతో కొరటాల సినిమా తీశారట. అందుకే సినిమాకి 'ఆచార్య' అనే టైటిల్ కూడా పెట్టినట్లు వార్తలొస్తున్నాయి. మరి ఇందులో ఎంతవరకు నిజముందో కొరటాల శివ స్పందిస్తే కానీ క్లారిటీ రాదు.
Also Read: 'నేనే ఫస్ట్ ప్రపోజ్ చేశా..' శాంతనుతో ఎఫైర్ పై శృతి కామెంట్స్..
Also Read: వేద పాత్రలో హృతిక్ ఇంటెన్స్ లుక్.. ఫ్యాన్స్ కు బర్త్ ట్రీట్..
Also Read: 'మీరెప్పటికీ మాతోనే ఉంటారు..' నమ్రత ఎమోషనల్ పోస్ట్..