Ravi Teja: 22 ఏళ్ల తరువాత మెగాస్టార్ తో రవితేజ.. ఈసారి ఎలాంటి హిట్ కొడతారో..?
కొంతకాలంగా చిరంజీవి సినిమాలో రవితేజ క్యామియో రోల్ పోషించబోతున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.
టాలీవుడ్ హీరో రవితేజ తన కెరీర్ బిగినింగ్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చాలా సినిమాలే చేశారు. మెగాస్టార్ చిరంజీవి నటించిన 'అన్నయ్య' సినిమాలో అతడికి తమ్ముడి పాత్రలో నటించారు. 2000లో విడుదలైన ఈ సినిమా అప్పట్లో మంచి సక్సెస్ అందుకుంది. దాదాపు 22 ఏళ్ల తరువాత రవితేజ మరోసారి మెగాస్టార్ చిరంజీవితో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారని సమాచారం.
కొంతకాలంగా చిరంజీవి సినిమాలో రవితేజ క్యామియో రోల్ పోషించబోతున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు నిజంగా రవితేజ.. మెగాస్టార్ సినిమాలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. చిరు హీరోగా దర్శకుడు బాబీ ఓ సినిమాను రూపొందించనున్న సంగతి తెలిసిందే. దీనికి 'వాల్తేర్ వీరయ్య' అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు.
ఈ సినిమాలో ఓ క్యామియో రోల్ ఉందట. ఆ పాత్రకు రవితేజ అయితే బాగా సూట్ అవుతారని దర్శకుడు బాబీ అతడిని సంప్రదించినట్లు తెలుస్తోంది. గతంలో వీరిద్దరూ కలిసి 'పవర్' అనే సినిమా కోసం పని చేశారు. తన దర్శకుడిపై ఉన్న అభిమానంతో రవితేజ వెంటనే క్యామియో రోల్ లో కనిపించడానికి ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. కథ ప్రకారం.. రవితేజను మాస్ అవతారంలో చూపించబోతున్నారట.
రవితేజ పుట్టినరోజు జనవరి 26న ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించబోతున్నట్లు సమాచారం. మెగాస్టార్-రవితేజ కాంబో అనేసరికి సినిమాలో సన్నివేశాలు ఊరమాస్ ఉంటాయని ఆశిస్తున్నారు అభిమానులు. ప్రస్తుతం చిరంజీవి 'గాడ్ ఫాదర్' సినిమాలో నటిస్తున్నారు. అలానే 'భోళా శంకర్' సినిమా లైన్లో ఉంది. త్వరలోనే బాబీ సినిమాను పట్టాలెక్కించడానికి ప్లాన్ చేస్తున్నారు.
Also Read: ఫూల్స్ డే రోజు మహేష్ రాడట.. కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడంటే..?
Also Read: కనుబొమ్మలు ఎగరేసిన హీరోయిన్.. సిగ్గుపడిపోయిన చైతు.. వీడియో వైరల్..
Also Read: 'సార్' హీరోయిన్ తప్పుకుందా..? ఇదిగో క్లారిటీ..
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్స్క్రైబ్ చేయండి