Avatar 2 Release Date: 'అవతార్ 2' రిలీజ్ డేట్ లాక్ చేసిన మేకర్స్.. ఫ్యాన్స్ కు పండగే..
'అవతార్' సినిమా విడుదలైన సమయంలోనే దీనికి సీక్వెల్ ఉంటుందని ప్రకటించారు మేకర్స్. దీంతో సీక్వెల్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు అభిమానులు.
మన దేశంలో హాలీవుడ్ సినిమాలు కూడా కోట్ల వసూళ్లు సాధిస్తుంటాయి. మార్వెల్ మూవీస్ కి ఇండియాలో ఉండే క్రేజే వేరు. అలానే 'అవతార్' సినిమా ఇండియా బాక్సాఫీస్ రికార్డులు బద్దలు కొట్టింది. వరల్డ్ బిగ్ బడ్జెట్ సినిమాల్లో అవతార్ సినిమా ముందు వరసలో ఉంటుంది. హాలీవుడ్ స్టార్ డైరెక్టర్ జేమ్స్ కామెరాన్ ఈ సినిమాను తెరకెక్కించారు. 'అవతార్' సినిమా 2.847 బిలియన్ల గ్రాస్ ను వసూలు చేసింది. దీన్ని బట్టి ఈ సినిమా డిమాండ్ ఏంటో అర్ధం చేసుకోవచ్చు.
'అవతార్' సినిమా విడుదలైన సమయంలోనే దీనికి సీక్వెల్ ఉంటుందని ప్రకటించారు మేకర్స్. దీంతో సీక్వెల్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు అభిమానులు. నిజానికి డిసెంబర్ 2021లోనే 'అవతార్ 2' విడుదల కావాల్సింది కానీ కరోనా కారణంగా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు మేకర్స్. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేశారు.
డిసెంబర్ 16, 2022లో సినిమాను విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ సినిమాకి మొత్తం నాలుగు సీక్వెల్స్ ఉంటాయని తెలిపారు. మొదటి సీక్వెల్ ను ని ఈ ఏడాదిలో రిలీజ్ చేస్తుండగా.. 2024 డిసెంబర్ లో రెండో సీక్వెల్ ను, 2026 డిసెంబర్ లో మూడో సీక్వెల్ ను, 2028లో నాల్గో సీక్వెల్ ను రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఒక్కో సినిమాకి కొత్త నటీనటులు యాడ్ అవుతారని తెలుస్తోంది.
ఈ సినిమా కోసం 250 మిలియన్ డాలర్ల బడ్జెట్ ను కేటాయించినట్లు తెలుస్తోంది. జేమ్స్ కామెరాన్.. జోష్ ఫ్రెడిమన్ తో కలిసి ఈ సినిమాకి స్క్రీన్ ప్లే ను సిద్ధం చేశారు. అలానే జాన్ లండవ్ తో కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. రస్సెల్ కార్పెంటర్ ఈ సినిమాకి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఈ సైన్స్ ఫిక్షన్ స్టోరీకి డేవిడ్ బ్రెన్నెర్, స్టీఫెన్ ఈ రివికిన్, జాన్ రిఫావ ఎడిటింగ్ వర్క్ చేస్తున్నారు.
Also Read: మలైకాకి బ్రేకప్ చెప్పేశాడా..? ఇదిగో క్లారిటీ..
Also Read: మెగా హీరో కొత్త సినిమా టైటిల్ ఇదేనా..?
Also Read: సమంతతో విడాకులపై స్పందించిన చైతు.. ఇప్పుడు నేను హ్యాపీ..
Also Read: అక్కడ వినిపించుకునే నాథుడు ఉండాలి కదా..? టికెట్ రేట్ ఇష్యూపై బాలయ్య వ్యాఖ్యలు..
Also Read: ఇలా బెదిరిస్తే వచ్చి కొడతా.. ప్రభాస్ ఫ్యాన్స్ కి 'రాధేశ్యామ్' డైరెక్టర్ వార్నింగ్..
Also Read: 22 ఏళ్ల తరువాత మెగాస్టార్ తో రవితేజ.. ఈసారి ఎలాంటి హిట్ కొడతారో..?