అన్వేషించండి

Trinayani Serial Today November 11th:  ‘త్రినయని’ సీరియల్: నయని పరిస్థితి క్రిటికల్‌ అన్న డాక్టర్లు – నయని ఎప్పుడో చనిపోయి దెయ్యం అయిందనన్న వల్లభ  

trinayani Today Episode:  హాస్పిటల్ లో త్రినేత్రిని చూసి నయని చనిపోయి దెయ్యం అయిందని వల్లభ భయంతో వణికిపోతుంటాడు. దీంతో ఇవాళ్టీ ఏపిసోడ్‌ చాలా ఆసక్తిగా జరిగింది.

trinayani Serial Today Episode:  సిస్టర్‌ దగ్గరకు వెళ్లి నయని బతుకుతుందా.. లేదా అని అడుగుతున్న సుమనను విక్రాంత్‌ తిడతాడు. సిస్టర్‌ ను అడిగితే ఏం చెప్తుందని చెప్తాడు. అయితే వాళ్లే కదా అక్క దగ్గర ఉండేది ఏమైనా తెలుస్తుందోమోనని అడిగానని సుమన చెప్తుంది. వాళ్లు నిజానికి నువ్వు ఉండాలి తొడబుట్టిన చెల్లెవి కనీసం మా అక్క దగ్గర ఉందామన్న జ్ఞానం అయినా ఉందా నీకు అంటూ తిడతాడు. మీ అమ్మ కడుపున ఇద్దరు పుట్టారు కదా..? మీ అక్కకు ఏమీ కాకూడదని ఎప్పుడైనా దేవుడికి మొక్కావా..? అని అడుగుతాడు. దీంతో మెక్కితే ప్రాణాలు నిలబడతాయా..? అంటూ సుమన అనడంతో విక్రాంత్‌ నా బుద్ది తక్కువ అయి నీకు చెప్పాను అంటూ సుమనను తిడతాడు. సుమన అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఐసీయూ దగ్గర బాధపడుతున్న విశాల్ దగ్గరకు హాసిని వెళ్తుంది.

హాసిని: డాక్టర్లు ఏమైనా చెప్పారా..? విశాల్‌.

విశాల్‌:  ఇంకా ఏమీ చెప్పలేదు వదిన..  లోపలి నుంచి డాక్టర్లు ఇంకా రాలేదు.

సుమన: అలా అయితే ఎలా ఏదో ఒకటి చెప్పాలి కదా డాక్టర్లు.

తిలొత్తమ్మ: అవును ఇంత సమయం అవుతుంది ఇంకా డాక్టర్లు బయటకు రాకపోతే ఎలా… మనం ఎంత టెన్షన్‌ పడతాం.

 అంటూ అందరూ మాట్లాడుకుంటుంటారు. త్రినేత్రి బామ్మను తీసుకుని డాక్టర్‌ దగ్గర నుంచి బయటకు వస్తుంది. ఇంజక్షన్‌ ఇచ్చిన డాక్టర్‌ ను బామ్మ తిడుతుంగి. ఆ ఇంజక్షన్‌ ఇవ్వకపోతే నీకు త్వరగా బాగు అవ్వదట బామ్మా డాక్టర్‌ చెప్పారు అంటుంది. దీంతో బామ్మ డాక్టర్‌ ను తిడుతుంది. నీకు విశాల్‌ బాబుతో పెళ్లి అయితే నేను చనిపోయినా పర్వాలేదు అంటుంది. ఐసీయూలోంచి డాక్టర్‌ బయటకు వస్తుంది.

విశాల్‌: నయనికి ఎలా డాక్టర్‌.. ఎనీ ప్రాబ్లమ్‌.

డాక్టర్‌: కండీషన్‌ క్రిటికల్‌ గానే ఉంది. 48 గంటలు గడిస్తే తప్పా ఏమీ చెప్పలేం

అని డాక్టర్‌ చెప్పగానే అందరూ కంగారుపడుతుంటారు. దూరం నుంచి చూస్తున్న బామ్మ వార్డెన్‌ను పిలిచి అక్కడ ఏం జరగుతుంది అని అడుగుతుంది. యాక్సిడెంట్‌ అయింది. ఆమె బతుకుతుందో లేదోనని అంటున్నారు అని చెప్పి వెళ్లిపోతాడు.

విశాల్‌: ఎంత డబ్బైనా పర్వాలేదు డాక్టర్‌  బెటర్‌ ట్రీట్‌ మెంట్‌ ఇవ్వండి.

హాసిని: డాక్టర్‌ దయచేసి మా చెల్లెలిని ఎలాగైనా కాపాడండి. మీ కాళ్లు పట్టుకుంటాను ఫ్లీజ్‌. 

విశాల్‌: వదిన ఏంటిది ఆగండి..

సుమన: డాక్టర్‌ గారు మేము మా అక్కను చూడొచ్చా…?

డాక్టర్‌: పేషెంట్‌కు డిస్టర్బ్‌ చేయకుండా చూడండి.

అని డాక్టర్‌ చెప్పగానే విక్రాంత్‌ తప్ప అందరూ లోపలికి వెళ్తారు. విక్రాంత్‌ బయటే ఉండి అసలు నిజం చెప్పండి డాక్టర్‌ అని అడుగుతాడు. దీంతో విక్రాంత్‌ కు డాక్టర్‌ నిజం చెప్తుంది. నయని కోమాలోకి వెళ్లిందని ఎప్పుడు వచ్చేది తెలియదని అంటుంది. దీంతో విక్రాంత్‌ బోరు ఏడుస్తాడు. డాక్టర్‌ వెల్లిపోతుంది. ఏడుస్తున్న విక్రాంత్‌ను బామ్మ పలకరిస్తుంది. ఏమైందని అడుగుతుంది. మా వదినకు యాక్సిడెంట్‌ జరిగిందని చెప్తాడు. విక్రాంత్‌ ను బామ్మ ఓదారుస్తుంది. మరోవైపు మందుల కోసం లోపలికి వెళ్లిన త్రినేత్రిని వల్లభ చూసి దెయ్యం అనుకుని భయంతో ఐసీయూలోకి పరెగెత్తుకుని వెళ్తాడు.

హాసిని: చెల్లిని ఇలా చూడాల్సి వస్తుందని కలలో కూడా అనుకోలేదు. 

సుమన: ఊరుకో అక్క.. తోడబుట్టిన దాన్ని నేనే ధైర్యంగా ఉన్నాను నువ్వు ధైర్యంగా ఉండు అక్కకు ఏం కాదు రెండు రోజుల్లో అందరినీ పలకరిస్తుంది చూడు.

కంగారుగా లోపలికి వచ్చిన వల్లభ నయని చనిపోయి దెయ్యం అయంది అని నేను చెప్తే ఎవ్వరూ నమ్మరు పైగా నన్ను కొడతారు అని మనసులో అనుకుంటాడు. ఇంట్లో వల్లభ సెల్‌ఫోన్‌ టార్చి వేసుకుని భయపడుతూ ఉంటాడు. ఇంతలో అక్కడకు వచ్చిన తిలొత్తమ్మను చూసి దెయం అంటూ భయపడతాడు. తిలొత్తమ్మ వల్లభను తిడుతుంది. నన్ను దెయ్యం అంటావా? అంటూ కొట్టబోతే మమ్మీ అంటూ హాస్పిటల్ లో జరిగింది చెప్తాడు వల్లభ. వల్లభ మాటలు నమ్మదు తిలొత్తమ్మ. మరోవైపు విక్రాంత్‌ దగ్గరకు వెళ్లిన సుమన తనొకక ఐస్‌క్రీమ్‌ ఆర్డర్‌ పెట్టమని చెప్తుంది. దీంతో విక్రాంత్‌ సుమనను తిట్టి అక్కడి నుంచి వెళ్లిపోతాడు.  ఇంతటితో  ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ:  మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Andhra Pradesh Budget 2024-25: ఆంధ్రప్రదేశ్‌ బడ్జెట్‌ 2024-25 హైలైట్స్‌ - వివిధ శాఖలకు కేటాయింపుల పూర్తి వివరాలు ఇవే
ఆంధ్రప్రదేశ్‌ బడ్జెట్‌ 2024-25 హైలైట్స్‌ - వివిధ శాఖలకు కేటాయింపుల పూర్తి వివరాలు ఇవే
Basara IIIT: బాసర ట్రిపుల్ల్ ఐటీలో విద్యార్థిని ఆత్మహత్య - సూసైడ్ నోట్ రాసి మరీ..
బాసర ట్రిపుల్ల్ ఐటీలో విద్యార్థిని ఆత్మహత్య - సూసైడ్ నోట్ రాసి మరీ..
Minister Atchennaidu: 'రాష్ట్రానికి వ్యవసాయం వెన్నెముక వంటిది' - రూ.43,402 కోట్లతో వ్యవసాయ బడ్జెట్ ప్రవేశపెట్టిన మంత్రి అచ్చెన్నాయుడు
'రాష్ట్రానికి వ్యవసాయం వెన్నెముక వంటిది' - రూ.43,402 కోట్లతో వ్యవసాయ బడ్జెట్ ప్రవేశపెట్టిన మంత్రి అచ్చెన్నాయుడు
SSMB29 Budget: మహేష్ - రాజమౌళి సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ @ 2000 కోట్లు - తమ్మారెడ్డి షాకింగ్ కామెంట్స్
మహేష్ - రాజమౌళి సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ @ 2000 కోట్లు - తమ్మారెడ్డి షాకింగ్ కామెంట్స్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఆసీస్ తో టెస్టుకు రోహిత్ దూరం! కెప్టెన్ గా బుమ్రా?ట్రోలర్స్‌కి ఇచ్చి పడేసిన రౌడీ, ఒక్క వీడియోతో గప్‌చుప్బెల్టు తీస్తానన్నారు? రోజా సంచలన ట్వీట్గేమ్ చేంజర్ టీజర్ టాక్ ఎలా ఉందంటే?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Pradesh Budget 2024-25: ఆంధ్రప్రదేశ్‌ బడ్జెట్‌ 2024-25 హైలైట్స్‌ - వివిధ శాఖలకు కేటాయింపుల పూర్తి వివరాలు ఇవే
ఆంధ్రప్రదేశ్‌ బడ్జెట్‌ 2024-25 హైలైట్స్‌ - వివిధ శాఖలకు కేటాయింపుల పూర్తి వివరాలు ఇవే
Basara IIIT: బాసర ట్రిపుల్ల్ ఐటీలో విద్యార్థిని ఆత్మహత్య - సూసైడ్ నోట్ రాసి మరీ..
బాసర ట్రిపుల్ల్ ఐటీలో విద్యార్థిని ఆత్మహత్య - సూసైడ్ నోట్ రాసి మరీ..
Minister Atchennaidu: 'రాష్ట్రానికి వ్యవసాయం వెన్నెముక వంటిది' - రూ.43,402 కోట్లతో వ్యవసాయ బడ్జెట్ ప్రవేశపెట్టిన మంత్రి అచ్చెన్నాయుడు
'రాష్ట్రానికి వ్యవసాయం వెన్నెముక వంటిది' - రూ.43,402 కోట్లతో వ్యవసాయ బడ్జెట్ ప్రవేశపెట్టిన మంత్రి అచ్చెన్నాయుడు
SSMB29 Budget: మహేష్ - రాజమౌళి సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ @ 2000 కోట్లు - తమ్మారెడ్డి షాకింగ్ కామెంట్స్
మహేష్ - రాజమౌళి సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ @ 2000 కోట్లు - తమ్మారెడ్డి షాకింగ్ కామెంట్స్
CJI Justice Sanjiv Khanna: సీజేఐగా జస్టిస్ సంజీవ్ ఖన్నా ప్రమాణస్వీకారం
సీజేఐగా జస్టిస్ సంజీవ్ ఖన్నా ప్రమాణస్వీకారం
YS Sharmila: 'అత్త మీద కోపం దుత్త మీద చూపించినట్లుంది' - మాజీ సీఎం జగన్‌పై వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు
'అత్త మీద కోపం దుత్త మీద చూపించినట్లుంది' - మాజీ సీఎం జగన్‌పై వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు
Pragya Jaiswal : బాలయ్య, ప్రగ్యా జైస్వాల్ మధ్య లవ్ సీన్స్ ఎక్కువ కావాలట.. ప్రగ్యా ఫోటోలకు ఫ్యాన్ క్రేజి కామెంట్
బాలయ్య, ప్రగ్యా జైస్వాల్ మధ్య లవ్ సీన్స్ ఎక్కువ కావాలట.. ప్రగ్యా ఫోటోలకు ఫ్యాన్ క్రేజి కామెంట్
KTR: 'బాంబుల మంత్రిగా నామకరణం చేయాలి' - హామీలు బాంబులవుతాయంటూ కేటీఆర్ సెటైర్లు
'బాంబుల మంత్రిగా నామకరణం చేయాలి' - హామీలు బాంబులవుతాయంటూ కేటీఆర్ సెటైర్లు
Embed widget