అన్వేషించండి
Advertisement
Seethe Ramudi Katnam August 16th: అన్నంత పని చేసిన సీత- అత్తతో రోడ్లను కూడా ఊడ్పించింది.
Seethe Ramudi Katnam August 16th: 'సీతే రాముడి కట్నం' సీరియల్: భరతమాత వేషంలో వచ్చి అత్తతో సెల్యూట్ కొట్టించుకోవడమేగాక..పాటలపోటీల్లో ఓడించి ఊరంతా చీపుర్లతో ఊడ్చేలా చేసిన సీత ఈరోజు ఏపిసోడ్‌లో చూడొచ్చు
Seethe Ramudi Katnam Today Episode:మహాలక్ష్మీయే తనతో భరతమాత వేషం వేయించదాని సీత చెప్పగా....అంత మంచి ఐడియా ఇచ్చిన మహాలక్ష్మికి జిందాబాద్ కొట్టాలని అర్చన అందరినీ కోరుతుంది. ఇంతలో కాలనీవాళ్లు వచ్చి....స్వాతంత్ర్యదినోత్సవం రోజూ జిందాబాద్ కొట్టాల్సింది భరతమాతకు అంటూ సీతకు జై కొట్టాల్సిందిగా కోరతారు. భారతమాత వేషధారణలో ఉన్న సీతకు అందరూ జైకొట్టి సెల్యూట్ చేయడంతో తప్పనిసరి పరిస్థితుల్లో మహాలక్ష్మీతోపాటు అర్చన కూడా సెల్యూట్ కొట్టాల్సి వస్తుంది. ఆ తర్వాత జాతీయ జెండా కూడా ఆమె ఎగురవేయాలని సీతకోరడంతో మహా లక్ష్మీ జాతీయ జెండా ఎగురవేస్తుంది. ఆ తర్వాత దేశం గొప్పతనం గురించి చెప్పాలంటూ మహాలక్ష్మీని సీత ఇరికించేస్తుంది. కోపం వస్తున్నా బయటకు చెప్పుకోలేక మహాలక్ష్మీ పంటిబిగువున ఆపుకుని కాలనీ వాళ్ల ముందు పరువుపోకుండా దేశం కోసం ప్రాణాలు అర్పించిన మహనీయుల త్యాగాలను పొగుడుతూ ప్రసంగిస్తుంది. సీత కావాలనే ఇదంతా చేసిందని మండిపడిన మహాలక్ష్మీ విసురుగా అక్కడి నుంచి నిష్ర్కమిస్తుంది. మహాలక్ష్మీనే సీత అనుసరిస్తుంది.
సీత: నోరు తీపిచేసుకోండి అత్తా ….నేను మిమల్ని అత్తా అని పిలవడం ఎవరూ వినలేదులే కంగారుపడకండి
మహాలక్ష్మీ: నా పరువు తీయడానికే నువ్వు తయారయ్యావు. భారతమాత వేషం వేసుకుని వచ్చి నాతోన సెల్యూట్ చేయించుకుంటావా..?
సీత: భారతమాతకు నువ్వేంటి...ఎవరైనా సెల్యూట్ చేసి తీరాల్సిందే.
మహాలక్ష్మీ: నువ్వు ఈ వేషంలో ఉన్నావు కాబట్టి బ్రతికిపోయావ్..లేకుంటే నిన్ను ఉతికి పారేశాదాన్ని
సీత: అంతతప్పు నేనేం చేశాను అత్తా...ఈ కాలనీలో మీ గౌరవం పెంచాను. నా అత్తవన్న మర్యాద ఇచ్చి ఏ కోశాన మంచితననే లేని నీ నోటి నుంచి కూడా దేశభక్తి మాటలు మాట్లాడించాను. మనదేశానికి స్వాతంత్య్రం వచ్చింది కానీ...మన ఇంట్లో నాకు రాలేదు. స్వార్థ్యంతో ఆలోచించే మీలాంటి అత్తలు మారనంతకాలం ...నాలాంటి కోడళ్లు స్వాతంత్ర్యం కోసం ఇలాంటి పోరాటాలు చేయాల్సిందే.
మహాలక్ష్మీ: అంటే నిన్ను నువ్వు ప్రీడం ఫైటర్ అనుకుంటున్నావా..?
సీత: మీలాంటి అత్తలతో ఫైట్ చేసే ప్రతి కోడలు కూడా ప్రీడం ఫైటరే
మహాలక్ష్మీ: వంటింటి కుందేళ్లు కూడా వందేమాతరం అంటే మా తరం అత్తలు ఊరుకోరే.?
సీత: మీతరమైనా...ఏతరమైనా స్వేచ్ఛకోసం బిగించిన పిడికిలికి తలదించాల్సిందే అత్తా...ఆనాడు గాంధీమహాత్ముడు క్విట్ ఇంటియా అని తెల్లవారిని తరిమినట్లే...ఈనాడు మీ స్వార్థాన్ని, అహంకారాన్ని నేను తరిమికొడతాను. ఆషాడం అయ్యేలోపు మీతోనే నేను మీ కోడల్ని అనిపించుకుంటాను.
అర్చన: అందరూ అక్కడ ఉంటే మీరిద్దరూ ఇక్కడేం చేస్తున్నారు..?
సీత: అత్తాకోడళ్ల మధ్య వంద ఉంటాయి..మధ్యలో మీలాంటి పనీపాటలేని చిన్న అత్తలు వచ్చి అత్తాకోడళ్ల మధ్య దూరం పెంచుతున్నారు.
అర్చన: మీ ఇద్దరినీ నేను విడదీస్తున్నానా..?
సీత: నన్ను, రామ్‌మామను విడదీయడం మీ వల్లకాదని చెబుతున్నాను
అర్చన: ఏంటి మహా...అది ఈరోజు మనదో ఇలా ఆడుకుంటుంది
మహాలక్ష్మీ: ఈరోజు దాని టైం బాగుంది.అందుకే దాని ఆటలు సాగుతున్నాయి. ఏదో ఒకరోజు మన టైం రాకపోదూ...అప్పుడు మనం పడిన అవమానాలకు రెట్టింపు బదులు తీర్చుకుందాం.
అర్చన: దాన్ని చూస్తుంటే మనకు దొరికేలా లేదు మహా...మళ్లీమళ్లీ దానికే మనం దొరికేలా ఉన్నాం
మహాలక్ష్మీ: ఇండిపెండెన్స్‌డే రోజు కూడా ఇంత పిరికిగా ఎలా ఉంటావ్..? కొంచెం పాజిటివ్‌గా ఉండు పదా..
మళ్లీ జాతీయ జెండా వద్దకు తిరిగొచ్చిన మహాలక్ష్మీ...జెండా వందనం అయిపోయిందిగా అందరూ వెళ్లిపోకుండా ఇంకా ఇక్కడే ఉన్నారు ఎందుకు అని ప్రశ్నిస్తుంది. అందరూ వెళ్లిపోతుంటే తానే ఆపానని తమ్ముడు చెబుతాడు. ఈ కార్యక్రమాన్ని ఇంకాస్త కలర్‌పుల్‌గా చేద్దామని అంటాడు. మనలో ఎవరెవరికి ఎంతెంత దేశభక్తి ఉందో ఒక టెస్ట్‌పెట్టుకుందామంటాడు.
సీత: అవునవును..ఎవరెవరికి ఎంత దేశభక్తి ఉందో నిరూపించుకోవాల్సిందే. దేశభక్తి గీతాల పోటీ అయితే బాగుటుంది. పోటీలో గెలిచివాళ్లు ఏం చెబితే ఓడిపోయిన వాళ్లు చేయాలి.
మహాలక్ష్మీ: తను చెప్పింది నాకు ఓకే....మనం రెండు జట్లుగా విడిపోయి పోటీపడదాం.
సీత, రామ్, చలపతి జట్టుగా ఒకటీం...మిగిలి మహాలక్ష్మీ,అర్చన వాళ్లబ్యాచ్ అంతా కలిసి ఒక జట్టుగా చేరి పాటల పోటీకి దిగుతారు. ఈ పోటీలో మహాలక్ష్మీ టీం ఓడిపోతుంది. దీంతో మహా వాళ్లకు టాస్క్ ఇస్తుంది. ఓడిపోయిన టీం సభ్యులంతా కలిసి కాలనీ వీధులన్నీ చీపుర్లతో ఊడ్చి స్వచ్ఛభారత్ చేయాలంటుంది. దీంతో మహాలక్ష్మీ, అర్చన వాళ్ల ఆయన అందరూ కలిసి వీధులన్నీ చీపుర్లతో ఊడుస్తారు.
ఆషాడం పేరిట రామ్, సీతను మహాలక్ష్మీ విడదీయడంతో వారు ఎవరి ఇంట్లో వారు ఉంటూ పాటలు పాడుకుంటూ ఉంటారు. ఆ పాటలు వినలేక మహాలక్ష్మీ తలపట్టుకుని కూర్చుంటుంది. సీత గోడదూకి రామ్ కోసం వచ్చినా వస్తుందని మహాలక్ష్మీ అనుమానిస్తుంది. దీంతో గిరితో కలిసి తన భర్తను రామ్‌కు కాపలాగా ఉంటాలని మహాలక్ష్మీ ఆదేశిస్తుంది. దీంతో రామ్ రూమ్‌కి తాళం వేద్దామని పైకి వెళ్లి చూడగా...అప్పటికే రామ్ ఇంట్లో నుంచి వెళ్లిపోవడం చూసి వాళ్లిద్దరూ అవాక్కవవుతారు. సీతకోసం రామ్ వాళ్ల ఇంటికి వెళ్లడంతో ఇవాల్టి ఏపిసోడ్ ముగుస్తుంది.
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
పాలిటిక్స్
రాజమండ్రి
సినిమా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement