Satyabhama Serial Today January 2nd Episode : 'సత్యభామ' న్యూ సీరియల్: రౌడీల టార్చర్‌కి సత్యభామకు వెంటనే పెళ్లి చేసేయాలన్న బామ్మ, క్రిష్ ప్రపోజ్ చేస్తాడా!
Satyabhama Serial January 2nd Episode రౌడీలకు భయపడి సత్యభామకు తన నానమ్మ పెళ్లి చేయాలని ఇంట్లో చెప్పడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.
Satyabhama Telugu Serial Today Episode
క్రిష్ సత్యభామ ప్రేమలో పడతాడు. సత్యభామ తన పుట్టిన రోజు నాడు తిన్న కేకు ముక్కను ఎంతో అపురూపంగా ఓ బాక్స్‌లో పెట్టి దాని గురించి తన ఫ్రెండ్స్‌కి వర్ణిస్తాడు క్రిష్. తన ఫ్రెండ్స్ ఆ బాక్స్‌లో ఏముందని అడుగుతారు. దీంతో క్రిష్ బాక్స్ ఓపెన్ చేసి అందులో సగం తిన్న కేక్ ముక్క చూపిస్తాడు. దాన్ని చూసి వాళ్లు కేకు ముక్కా అంటే.. అది మీ వదిన తాకిన కేక్ అని దాన్ని ఓ జ్ఞాపకంగా ఉంచుకుంటా అని క్రిష్ అంటాడు. ఇక సత్యభామకు ప్రపోజ్ చేయమని తన ఫ్రెండ్స్ సలహా ఇస్తారు.
సంధ్య: అక్కా ఏమైందే..
సత్యభామ: ఏం లేదు మనం బయటకు వచ్చామని ఈ పాటికి నానమ్మకు తెలిసిపోయి ఉంటే ఎంత గోల చేస్తుందా ఏంటో.. నానమ్మకు తెలీకుండా నాన్న మనల్ని బయటకు పంపినందుకు నాన్నని ఏమంటుందో.. మనల్ని ఏమంటుందో.. చాలా కంగారుగా ఉంది.
సంధ్య: ఇంటికి వెళ్తే ఎలానూ క్లాస్ ఉంటుంది. దానికి ఇప్పటి నుంచే టెన్షన్ ఎందుకు కూల్ అక్క. ఇక ఆటోలో సత్యభామను చూసిన క్రిష్ వాళ్లని ఫాలో అవుతాడు.
రుద్ర: రేణుకతో.. కడుపు గురించి ఇంట్లో తెలిసిందే అనుకో అప్పుడు ఉంటుంది నీకు..
రుద్రతల్లి: వచ్చారా.. ఇంత లేటు ఏంటిరా.. పిల్లల గురించి టెస్ట్ చేయించారా లేదా..
రుద్ర: చేయించాను.. దీనికి అన్నీ రోగాలేకదా.. ఎప్పుడూ నీరసే కదా.. బలానికి మందులు వాడి అప్పుడు రమ్మన్నారు.
రుద్రతల్లి: అసలు నీకు పిల్లలు పుట్టే రాత ఉన్నాదా లేదనే.. ఏం రాతరాసుకొచ్చినవే.. మా వంశం నిలబెట్టేది ఉందా లేదా.. ఏంటి మీ మామ ముందు నిల్చొన్నావ్.. ఆ ఏడ్చేదేదో నీ రూమ్ లోకి పోయి ఏడు. మనవడ్ని ఎత్తుకోవాలి అని మనకు ఉంటే చాలదు వాళ్లకి ఉండాలి.
క్రిష్ సత్యభామను చూస్తూ మురిసిపోతాడు. ప్రపోజ్ చేయడానికి వెళ్తాడు. ఇంతలో సత్యభామ ఫ్రెండ్ సతీష్ పెళ్లి చేసుకుంటా అని చెప్తాడు. దీంతో సత్యభామ నో చెప్పి వెళ్లిపోతుంది. ఇక తన పెళ్లి వాళ్ల నాన్న ఇష్టమని ఆయన ఎవర్ని చేసుకోమంటే వాళ్లని చేసుకుంటా అని చెప్పి వెళ్లిపోతుంది. ఇక క్రిష్ సత్యభామ మాటలకు ఫిదా అయిపోతాడు.
నానమ్మ: ఆగండి.. నేను ఈ ఇంటికి పెద్ద దిక్కులా కనిపిస్తున్నానా.. లేదా.. నన్ను చూసి కూడా ఏం అనకుండా లోపలికి వెళ్లారు. నా భయం మీకు చాదస్తంగా అనిపిస్తుందా. నా భయానికి విలువ లేదా.. ఇంటి ముందు ఏం జరుగుతుందో కనిపిస్తుంది కాదా.. వదినా అంటూ ఒకడు వస్తాడు. వాడికి అన్నా అంటూ ఇంకొకడు వస్తాడు. వాడికి వీడికి ఏం సంబంధమో.. వాళ్లకి మనకి ఏం సంబంధమో అర్థంకావడం లేదు. ఇంటి మీదకు మాత్రం దరిద్రం దండెత్తుకొస్తుంది. ఈ పరిస్థితుల్లో మీరు గడప దాటడం మంచిది కాదు అంటే అర్థం కాదు. ముందు దీనికి పెళ్లి చేసేయ్‌రా విశ్వం.
సత్యభామ: నాన్న ఏంటిది ఎవడో ఒకడు వచ్చి బెదిరించాడు అని ఇప్పటికి ఇప్పుడు నేను పెళ్లి చేసుకోవాలా.. తండ్రిగా నా పెళ్లి చేయడం మీ బాధ్యత కాబట్టి పెళ్లి చేసుకోమని అడిగితే నేను తలవంచి పెళ్లి చేసుకుంటాను. కానీ ఇలా ఎవడికో భయపడి పెళ్లి చేసుకోమంటే చాలా బాధగా ఉంది నాన్న. అయినా నాకంటూ ఆశలు, ఆశయాలు ఉండవా నాన్న.
నానమ్మ: నీ కోరికలు ఈ ఇంటికి కష్టాలు తెచ్చిపెట్టేలా ఉన్నాయి. అందుకే పెళ్లి చేసుకోమని చెప్తున్నా.
సత్యభామ: కష్టమొస్తే ఎదురించాలి అని చెప్పాల్సిన నువ్వే భయపడి పెళ్లి చేసుకొని వెళ్లిపోమని చెప్తున్నావా నానమ్మ.
నానమ్మ: ఎదురించి పోరాడటానికి ఈ ఇంట్లో మగవాళ్ల వల్లే కాలేదు. ఆడపిల్లవి నువ్వేం చేస్తావే.
సత్యభామ: మనుషులు ఆలోచించి బతకాలి.. నువ్వు, అమ్మ ఇలా మీరంతా పెళ్లి చేసుకోవాలి అనుకున్నారు కాబట్టి మీ పెళ్లి జరిగింది కానీ ఇక్కడ నా పెళ్లిని ఎవడో రౌడీ వెదవ వచ్చి డిసైడ్ చేస్తున్నాడు. అది నాకు నచ్చడం లేదు. అసలు నా జీవితం నా చేతుల్లో లేకుండా పోతుందని అనిపిస్తుంది.
నానమ్మ: చూడు ఇప్పుడున్న పరిస్థితుల్లో నువ్వు పెళ్లి చేసుకోకుండా ఇక్కడే ఉంటే మీ నాన్నకి రోజుకో గండం.. గంటకో నరకంలా ఉంటుందే. ఇప్పటికే నిన్ను ఎలా కాపాడుకోవాలో తెలీక భయపడుతున్నాం.
సత్యభామ: సరే నాన్న ఇక నా వల్ల మీరెవరూ భయపడాల్సిన అవసరం లేదు. నేను పెళ్లి చేసుకొని వెళ్లిపోతా.. పెళ్లి సంబంధాలు చూడండి. ఇది మీరిచ్చిన జీవితం కాబట్టి నామీద మీకు అన్ని హక్కులు ఉంటాయి. ఎలాంటి సంబంధం తీసుకొచ్చినా సరే కళ్లు మూసుకొని బతికేస్తాను.
విశ్వం: అమ్మా సత్యా జరిగినదంతా చూసి నీకు ఏమవుతుందా అని భయపడుతున్నాం తప్ప నువ్వు భారం అని ఇంట్లో ఉంటే భరించలేమని కాదమ్మా. నీకు ఇష్టం లేకుండా నీ పెళ్లి జరగదు. నీ మనసుకు నచ్చినట్లు అన్ని రకాలుగా నీకు తగిన వాడు దొరికిన వరకు మేము ఏం చేయం. ఈ తండ్రి ఎప్పటికీ నీకు ఇష్టం లేని పని చేయడమ్మ.
నానమ్మ: నా మాటలు మీకు ఇప్పుడు అర్థం కావు. ఇప్పుడు వదినా అని ఒకడు వచ్చినట్లు రేపు భార్య అని ఇంకొకడు వస్తాడు అప్పుడు మన బతుకులు రోడ్డుమీద పడతాయి. అలా అవకూడదు అని మంచి చెప్తే ఎవరూ పట్టించుకోరా.. సరే కానీయండి.. మీకు నేను అవసరం లేనప్పుడు నేను మాత్రం ఎందుకు పట్టించుకుంటాను. నాకు ఎవరూ అవసరం లేదు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది.
Also Read: ఆ ఓటీటీలో 'హనుమాన్' - థియేటర్లలో విడుదలైన ఎన్ని వారాలకు స్ట్రీమింగ్ అవుతుందంటే?