Hanuman Movie OTT: ఆ ఓటీటీలో 'హనుమాన్' - థియేటర్లలో విడుదలైన ఎన్ని వారాలకు స్ట్రీమింగ్ అవుతుందంటే?
Hanuman Movie OTT Release Date: ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజా సజ్జా హీరోగా నటించిన సినిమా 'హనుమాన్'. థియేటర్లలో విడుదలైన ఎన్ని వారాలకు ఓటీటీలో విడుదల కానుందంటే?
Hanu Man Movie OTT digital streaming platform: సంక్రాంతికి విడుదల కానున్న తెలుగు సినిమాల్లో 'హను-మాన్' ఒకటి. క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుంచి వస్తున్న మొదటి ఇండియన్ ఒరిజినల్ సూపర్ హీరో మూవీ ఇది. ఇందులో తేజ సజ్జ హీరోగా నటించారు. జనవరి 12న విడుదలకు రెడీ అయ్యింది. అయితే, ఒక్క రోజు ముందుకు జరిగే అవకాశాలు ఉన్నాయని టాక్. మరి, ఓటీటీ సంగతి ఏంటి?
జీ 5 చేతికి 'హను-మాన్' ఓటీటీ రైట్స్
Zee5 OTT acquires Hanu-Man digital streaming rights: 'హను-మాన్' డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులు ప్రముఖ ఓటీటీ వేదిక 'జీ 5' సొంతం చేసుకుంది. తెలుగుతో పాటు హిందీ, మరాఠీ, తమిళం, కన్నడ, మలయాళం, ఇంగ్లీష్, స్పానిష్, కొరియన్, చైనీస్, జపనీస్‌తో సహా పలు భారతీయ భాషల్లో సినిమా విడుదల కానుంది. అన్ని భాషల్లోనూ 'జీ 5' ఓటీటీలో విడుదల కానుంది.
థియేటర్లలో విడుదలైన 60 రోజుల తర్వాత... అంటే ఎనిమిది వారాలకు 'హను-మాన్' ఓటీటీలోకి రానుంది. దర్శకుడు ప్రశాంత్ వర్మ సైతం ఈ విషయాన్ని కన్ఫర్మ్ చేశారు. త్వరగా ఓటీటీలోకి సినిమా రాదని, రెండు నెలల తర్వాత వస్తుందని ఆయన చెప్పారు. మార్చి రెండో వారంలో 'హనుమాన్' ఓటీటీలోకి రానుంది. మార్చి 15న 'జీ 5'లో సినిమా విడుదల కావచ్చు.
Also Read: ఎన్టీఆర్ న్యూ ఇయర్ కు ముందు జపాన్ వెళ్లారు, కొత్త ఏడాదిలో ఇండియాకు తిరిగొచ్చారు. జపాన్‌లో భూకంపంపై ఆయన ఏమన్నారంటే...
సెన్సార్ పూర్తి... రన్ టైమ్ ఎంతంటే?
Hanuman Censor Certificate: 'హనుమాన్' సెన్సార్ కార్యక్రమాలు పూర్తి అయ్యాయి. ఈ చిత్రానికి సెన్సార్ బోర్డ్ యూ/ఏ సర్టిఫికెట్ ఇచ్చింది. ''విజువల్స్ సూపర్. సినిమా అద్భుతంగా వుంది. ఎమోషన్స్ ఎక్స్ట్రార్డినరీగా ఉన్నాయి. కంటెంట్ మెస్మరైజింగ్'' అని చిత్ర బృందాన్ని సెన్సార్ సభ్యులు అభినందించారని సమాచారం.
Bandhu Mitra Sakutumbha Saparivara Sametham ga chudalsina Cinema #HanuMan
— Teja Sajja (@tejasajja123) December 29, 2023
Censored with U/A@PrasanthVarma Film @Primeshowtweets @RKDStudios pic.twitter.com/oGndLRPugb
Also Read: సర్కారు నౌకరి రివ్యూ: సింగర్ సునీత కొడుకు ఆకాష్ మొదటి సినిమా
తేజా సజ్జా సోదరిగా వరలక్ష్మీ శరత్ కుమార్ నటించిన 'హనుమాన్'లో అమృతా అయ్యర్ హీరోయిన్. వినయ్ రాయ్ విలన్ వేషం వేశారు. 'గెటప్' శ్రీను, 'స్వామి రారా' సత్య, రాజ్ దీపక్ శెట్టి తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి కాస్ట్యూమ్ డిజైనర్: లంకా సంతోషి, ప్రొడక్షన్ డిజైనర్: శ్రీనాగేంద్ర తంగాల, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: అస్రిన్ రెడ్డి, ఎడిటర్: సాయిబాబు తలారి, సంగీత దర్శకులు: గౌర హరి - అనుదీప్ దేవ్ - కృష్ణ సౌరభ్, ఛాయాగ్రహణం: దాశరధి శివేంద్ర, స్క్రీన్‌ప్లే: స్క్రిప్ట్స్ విల్లే, సమర్పణ: శ్రీమతి చైతన్య, నిర్మాణ సంస్థ: ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్, నిర్మాత: కె నిరంజన్ రెడ్డి, రచన & దర్శకత్వం: ప్రశాంత్ వర్మ.