Podharillu Serial Today December26th: మహా రిజిస్ట్రర్ మ్యారేజీ ఆపడానికి చక్రి వేసిన ప్లాన్ ఏంటి..? పెళ్లి కోసం వస్తున్న భూషణ్‌ను కిడ్నాప్ చేసిందెవరు..?
Podharillu Serial Today Episode December 26th: మహా పెళ్లి ఆపడానికి తమ్ముళ్లతో కలిసి చక్రి పెళ్లికొడుకు భూషణ్‌ను కిడ్నాప్ చేసి బంధిస్తాడు. దీంతో మహా చాలా సంతోషంగా ఉంటుంది.

Podharillu Serial Today Episode: రిజిస్ట్రర్ మ్యారేజీ కోసం పేపర్లపై సంతకకాలు పెట్టించుకునేందుకు మహా వాళ్ల ఇంటికి వచ్చిన భూషణ్ వాటిపై మహాతో సంతకాలు పెట్టించుకుంటాడు. అతను వచ్చిన పని ముగియడంతో తిరిగి వెళ్లిపోతుంటే...కారు వద్దకు తోడుగా వెళ్లమని ప్రతాప్ మహాకు చెబుతాడు. ఆమె అయిష్టంగానే వెళ్తుంది. బయటకు వెళ్లిన తర్వాత భూషణ్ మళ్లీ మహాను అవమానిస్తుంటాడు. నీడ్రెస్సింగ్ సెన్స్ అసలు నచ్చలేదు అంటాడు. ఇలా పల్లెటూరి దానిలా ఉండొద్దని...నా లెవల్‌కు తగ్గట్లు మార్చుకోవాలని చెబుతాడు. ఆ మాటలకు మహాకు మరింత కోపం వస్తుంది. భూషణ్ తిరిగి వెళ్లబోతుండగా...అక్కడికి వచ్చిన చక్రి అతని కాళ్లు అడ్డుపెడతాడు. కిందపడబోయిన భూషణ్ కారు పట్టుకుని ఆగుతాడు. దీంతో చక్రిపై గట్టిగా మండిపడతాడు. ఆ గొడవకు ప్రతాప్ బయటకు వస్తాడు. ఏం జరిగిందని అడగ్గా...చక్రి చేసిన విషయం చెబుతాడు. కొంచెం ఉంటే పళ్లు రాలిపడేవని అంటాడు. ముందు వీడిని పనిలో నుంచి తీసివేయాలని అంటాడు.
చక్రి రమ్మనడంతో మాధవత్‌తోపాటు మిగిలిన తమ్ముళ్లందరూ వచ్చి అతన్ని కలుస్తారు. మహా గురించి ఆమె పరిస్థితి గురించి మాధవ్‌కు చెబుతాడు. నేను ఆ అమ్మాయిని ఇష్టపడుతున్నానని చెబుతాడు. ఆ పెళ్లికొడుకు అసలు మంచివాడే కాదని...ఆ అమ్మాయిని పెళ్లిచేసుకుని బందీగా ఉంచాలని చూస్తున్నాడని చెబుతాడు. ఆ అమ్మాయి నన్ను హెల్ఫ్ చేయమని కోరుతోందని అంటాడు. ఆ అమ్మాయిని రేపే రిజిస్ట్రర్ మ్యారేజీ చేసుకుంటాడని...ఈ ఒక్కటీ ఆపితే చాలని చక్రి బ్రతిమలాడతాడు. ఇదంతా పెద్దవాళ్లతో వ్యవహారమని.. ఏదైనా సమస్య వస్తే మనం ఇరుక్కుంటామని అంటాడు. దీంతో మాధవ్‌ను పక్కకు పంపించి...రిజిస్ట్రర్ మ్యారేజీ ఆపడానికి ఏం చేయాలో చక్రి మిగిలిన తమ్ముళ్లకు ప్లాన్ చెబుతాడు.
మహా రిజిస్ట్రర్ మ్యారేజీకి ఏర్పాట్లన్నీ చకాచకా జరిగిపోతుంటాయి. రిజిస్ట్రర్ ఆఫీసుకు వెళ్లేందుకు మహా కూడా రెడీ అవుతుంది. మా ఇంట్లోవాళ్లే ఆపలేకపోతుంటే...ఆ డ్రైవర్ మాత్రం ఏం చేస్తాడని అనుకుంటుంది. ఇంతలో నిహారికి వచ్చి మహాకు సర్దిచెబుతుంది. దీంతో ఆమెపై మహా మండిపడుతుంది. నా డ్రీమ్ కోసమే ఈ పెళ్లి వద్దని అంటున్నానని మీరంతా అనుకుంటున్నారు. కానీ వాడు అసలు నాకు నచ్చనే నచ్చలేదని చెబుతుంది. వాడు అసలు నాకు కరెక్ట్ కాదని అంటాడు. కాసేపట్లో నన్ను పెళ్లిచేసుకుని పంజరంలో పడేస్తాడని అంటాడు. దీంతో ఆమె వదిన సముదాయిస్తుంది. అన్నీ నెగిటివ్‌గా ఆలోచించొద్దని చెబుతుంది. ఇంతలో బయట చక్రి కంగారుపడుతుంటాడు. ఈ పెళ్లి ఆపాలని కేశవ్‌కు చెప్పానని..వాడికి చెప్పామంటే ఖచ్చితంగా చేసి తీరతాడని అనుకుంటాడు.ఇ ఇంట్లోకి వచ్చి పెళ్లికి రెడీ అయిన మహాను చూసి మురిసిపోతుంటాడు. ఖచ్చితంగా ఈ పెళ్లి ఆగిపోతుందని నువ్వేమీ భయపడొద్దని చెబుతాడు. మీరు అసలు పెళ్లి కోసం బయటకే రారని చెప్పి వెళ్లిపోతాడు.
ఇంతలో పెళ్లికొడుకు భూషణ్ తల్లిదండ్రులు కంగారుపడుతూ వస్తుంటారు. దీంతో చక్రికి అసలు విషయం అర్థమవుతుంది. మన కేశవ్‌గాడు ఏదో చేసి ఉంటాడని అనుకుంటాడు. వాళ్లు వచ్చి ప్రతాప్‌కు అసలు విషయం చెబుతాడు. మేం కారులో వస్తుంటే...ఎవరో దుండగులు వచ్చి భూషణ్‌ను కిడ్నాప్ చేసి తీసుకెళ్లారని చెబుతారు. దీంతో మేం కంగారుపడి ఇక్కడికి పరుగెత్తుకుని వచ్చామని అంటారు. ఈ విషయం విని ప్రతాప్ కుటుంబ సభ్యులు మొత్తం షాక్‌కు గురవ్వగా...చక్రి, మహా మాత్రం ఎంతో సంతోషిస్తారు.





















