అన్వేషించండి

Meghasandesham Serial Today September 25th: ‘మేఘసందేశం’ సీరియల్‌: వంశీని చితక్కొట్టిన గగన్‌ – భూమికి డబ్బులిచ్చిన అపూర్వ

Meghasandesham Today Episode: భూమిని ఫాలో అవుతూ వెళ్లి హాస్పిటల్‌ లో ఐసీయూలో ఉన్న నాగును చూస్తుంది అపూర్వ దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ చాలా ఆసక్తిగా జరిగింది.

Meghasandesham Serial Today Episode:  ఇందును పెళ్లి చేసుకునే వంశీ ఇందును తీసుకుని హోటల్‌ కు వెళ్తాడు. అక్కడే గగన్‌ ఆఫీసు మీటింగ్‌ లో ఉంటాడు. ఇందు, వంశీలను చూస్తాడు. ఇద్దరూ హోటల్‌ రూంలోకి వెళ్తారు. ఇందు భయపడుతుంది. రూం బాయ్ వచ్చి చూసి అనుమానంగా వెళ్లిపోతాడు. రూంలో ఇందును వంశీ బలవంతపెడుతుంటాడు. మరోవైపు గగన్‌ మీటింగ్‌ కంప్లీట్‌ చేసుకుని వెళ్లిపోతుంటే.. రూం బాయ్‌ రిసెప్షన్‌ దగ్గరకు వచ్చి ఎవరికి పడితే వాళ్లకు ఎందుకు రూం ఇస్తారని చెప్తుంటాడు. గగన్‌ విని డీటెయిల్స్‌ తెలుసుకుని ఆ రూంలోకి వెళ్తాడు. వంశీని కొడుతూ..

గగన్‌: ఎంత ధైర్యంరా నీకు తనని హోటల్‌ కు తీసుకురావడమే కాకుండా బలవంతం చేస్తావా?

వంశీ: ఏయ్‌ ఎవడ్రా నువ్వు.

ఇందు: ఏయ్‌ అతన్ని వదులు.. అలా కొడతావేంటి? అతను నాకు కాబోయే భర్త.

గగన్‌: కాబోయే భర్త అయితే పెళ్లి కాకముందు ఇలా హోటల్స్‌ కి తిరుగుతారా?

ఇందు: మా ఇష్టం నువ్వెవరు అడగటానికి..? మా గదిలోకి వచ్చి నాకు కాబోయే భర్తను కొట్టడానికి నీకే ఏ హక్కు ఉంది.

గగన్‌: ఉంది. తప్పులు చేస్తూ హక్కుల గురించి మాట్లాడే హక్కు నీకు లేదు. గొప్పింట్లో పుట్టావు. పద్దతిగా ఉండటం నేర్చుకో..ఇక్కడ ఏదైనా తప్పు జరిగితే జీవితాంతం ఏడవాల్సింది వాడు కాదు నువ్వు. ఇంకొక్కసారి ఇలా పిచ్చిపిచ్చిగా తిరుగుతూ కనిపించారంటే..

 అంటూ వంశీని కొట్టి వార్నింగ్‌ ఇచ్చి ఇందును తీసుకుని గగన్‌ వెళ్లిపోతాడు. మరోవైపు హాస్పిటల్‌ కు వెళ్లిన నాగును చూస్తుంది. డాక్టర్‌ ను కలిసి నాగు ఆరోగ్యం గురించి అడుగుతుంది. డబ్బులు నేనిస్తానని ట్రీట్‌మెంట్‌ చేయండి అని చెప్తుంది డాక్టర్‌ సరే అంటాడు. తర్వాత బయటకు వచ్చిన భూమి డబ్బుల గురించి ఆలోచిస్తుంది. అపూర్వ ను అడగాలని ఫోన్‌ చేస్తుంది.

అపూర్వ: ఎంటి నాకు ఫోన్‌ చేస్తున్నావు.

భూమి: నీతో పని కాబట్టే నీకు ఫోన్‌ చేశాను.

అపూర్వ: నాతో ఏంటి నీకు పని

భూమి: నాకు కొన్ని డబ్బులు కావాలి.

అపూర్వ: నీకు నేనెందుకు ఇవ్వాలి.

భూమి: ప్రతిసారి చెప్పాలంటే నాకు బోర్ కొడుతుంది. నేను అడిగింది నువ్వు ఇవ్వాలి.

అపూర్వ: నా సహనాన్ని పరీక్షిస్తున్నావు.

భూమి: ఇంకా చాలా బెదిరిస్తానులే కానీ అర్జెంట్‌ గా నాకో మూడు లక్షలు కావాలి.

అపూర్వ: ఏంటి మూడు లక్షలా ఏం తమాషాగా ఉందా?

భూమి: మీతో నాకు తమాషాలు ఏంటి..? నాకు డబ్బులు కావాలి.. ఇస్తావా? లేదా?

అపూర్వ: ఏంటి బ్లాక్‌ మెయిల్‌ చేస్తున్నావా?

భూమి: నువ్వు నాకు చాలా బాకీ ఉన్నావు అది ఎలాగూ వసూలు చేస్తావు. ముందు ఈ మూడు లక్షల సంగతి చూడు.

అపూర్వ: నేను నీకు బాకీ ఉండటం ఏంటి?

భూమి: ఎందుకు ఏంటి అనేది నేను నీకు వివరంగా చెప్తాను. ముందు నాకా డబ్బులు ఇవ్వు.

అపూర్వ: నా దగ్గర లేవు.

   అని అపూర్వ చెప్పగానే  అంకుల్‌ ఫోన్‌ కు వాయిస్‌ మెసేజ్‌ వెళ్తుంది అని భూమి బెదిరించడంతో సరేనని అపూర్వ డబ్బుల తీసుకుని వెళ్తుంది. డబ్బులు ఇచ్చిన తర్వాత ఇలాంటి అవసరాలు మళ్లీ మళ్లీ రావొచ్చు అడగ్గానే ఇచ్చేలా కొంచెం డబ్బు తీసిపెట్టు అని చెప్తుంది భూమి. ఆ నాగుగాడు వాడి ఫోన్‌ దీనికి చిక్కేలా చేసి నా జుట్టు దీని చేతికి పట్టించాడు అనుకుంటూ అపూర్వ వెళ్లిపోతుంది. భూమి ఆటో తీసుకుని హాస్పిటల్‌ కు వెళ్తుంది. చాటు నుంచి చూసిన అపూర్వ ఆటో తీసుకుని భూమి వెళ్తున్న ఆటోను ఫాలో అవుతుంది. హాస్పిటల్‌ కు వెళ్లిన భూమికి నర్సు ఎదురుగా వచ్చి మీ పేషెంట్‌ కు స్పృహ వచ్చిందని చెప్తుంది. దీంతో భూమి హ్యపీగా ఫీలవుతుంది. నాగు దగ్గరకు వెళ్లి చూస్తుంది. భూమిని చూసిన నాగు బాధగా భూమిని కొట్టిన విషయం గుర్తు చేసుకుని ఏడుస్తుంటాడు. ఇంతలో భూమిని ఫాలో అయిన అపూర్వ హాస్పిటల్‌లో ఉన్న నాగు చూసి షాక్ అవుతుంది. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది. 

ALSO READ: పొరపాటున కూడా ఇప్పుడు ఉప్పు, బట్టలు లాంటి వస్తువులు కొనద్దట!

 

టాప్ హెడ్ లైన్స్

Illu Illalu Pillalu Serial Today August 22nd: ఇల్లు ఇల్లాలు పిల్లలు: ధీరజ్ కోసం ప్రేమ పడిగాపులు! అర్ధరాత్రి వరకు అక్కడే!
ఇల్లు ఇల్లాలు పిల్లలు: ధీరజ్ కోసం ప్రేమ పడిగాపులు! అర్ధరాత్రి వరకు అక్కడే!
Brahmamudi Serial Today August 22nd: ‘బ్రహ్మముడి’ సీరియల్: రాజుకు వార్నింగ్‌ ఇచ్చిన రేఖ – అపర్ణను తిట్టిన ఐషు  
‘బ్రహ్మముడి’ సీరియల్: రాజుకు వార్నింగ్‌ ఇచ్చిన రేఖ – అపర్ణను తిట్టిన ఐషు  
Podarillu Serial Today August 22th: శైలును కలిసి నిజం తెలుసుుకున్న కేశవ్‌...తాను అసలు గర్భవతినే కాదని చెప్పేసిన శైలు
పొదరిల్లు: శైలును కలిసి నిజం తెలుసుుకున్న కేశవ్‌...తాను అసలు గర్భవతినే కాదని చెప్పేసిన శైలు
Gundeninda Gudigantalu August 22th:మనోజ్‌ను మరోసారి దారుణంగా మోసం చేసిన రోహిణి....పార్లరమ్మ గుట్టు బయటపెట్టిన బాలు
గుండెనిండా గుడిగంటలు:మనోజ్‌ను మరోసారి దారుణంగా మోసం చేసిన రోహిణి....పార్లరమ్మ గుట్టు బయటపెట్టిన బాలు

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Veligonda Project: వెలిగొండ ప్రాజెక్టు తొలిదశ ప్రారంభానికి సర్వం సిద్ధం! నిర్వాసితులకు 250 కోట్ల అందజేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు! 
వెలిగొండ ప్రాజెక్టు తొలిదశ ప్రారంభానికి సర్వం సిద్ధం! నిర్వాసితులకు 250 కోట్ల అందజేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు! 
Sheik Sadiq Khan Arrest: పంచాయతీరాజ్ ఏఈ కుటుంబ ఆత్మహత్య కేసులో కీలక ముందడుగు! ఢిల్లీలో చిక్కిన రైఫిల్ షూటింగ్ కోచ్‌ సాధిక్ ఖాన్!
పంచాయతీరాజ్ ఏఈ కుటుంబ ఆత్మహత్య కేసులో కీలక ముందడుగు! ఢిల్లీలో చిక్కిన రైఫిల్ షూటింగ్ కోచ్‌ సాధిక్ ఖాన్!
Lok Sabha Delimitation Freeze: డీలిమిటేషన్‌కు కాంగ్రెస్ నో - 50 ఏళ్లుగా 90 కోట్లు పెరిగిన జనాభా - మరి ఎంపీ సీట్లు పెరగొద్దా?
డీలిమిటేషన్‌కు కాంగ్రెస్ నో - 50 ఏళ్లుగా 90 కోట్లు పెరిగిన జనాభా - మరి ఎంపీ సీట్లు పెరగొద్దా?
Revanth Reddy US Tour Cancellation : రేవంత్‌కు కావాల్సిందే కేంద్రం చేసిందా ? - అమెరికా టూర్ పర్మిషన్ క్యాన్సిల్ వెనుక రాజకీయం ఉందా?
రేవంత్‌కు కావాల్సిందే కేంద్రం చేసిందా ? - అమెరికా టూర్ పర్మిషన్ క్యాన్సిల్ వెనుక రాజకీయం ఉందా?
VVIP Road Accident Cases : అప్పలరాజు కుమారుడికో న్యాయం.. లింగమనేని కుమారుడికో న్యాయం - ఎందుకంటే ?
అప్పలరాజు కుమారుడికో న్యాయం.. లింగమనేని కుమారుడికో న్యాయం - ఎందుకంటే ?
Parvathipuram Manyam District Latest News: పార్వతీపురం మన్యం జిల్లాలో ఏనుగుల వీరంగం! పంటలు తొక్కేసి వ్యవసాయ మోటారులు ధ్వంసం!
పార్వతీపురం మన్యం జిల్లాలో ఏనుగుల వీరంగం! పంటలు తొక్కేసి వ్యవసాయ మోటారులు ధ్వంసం!
Mega 158 Title : మెగాస్టార్ బర్త్ డే స్పెషల్ - 'కాకా' వచ్చేశారు... కూల్ లుక్ To మాస్ అన్నయ్య
మెగాస్టార్ బర్త్ డే స్పెషల్ - 'కాకా' వచ్చేశారు... కూల్ లుక్ To మాస్ అన్నయ్య
YS Avinash Reddy: అవినాష్ రెడ్డి నివాసాల్లో ఈడీ సోదాలకు అసలు కారణం ఏంటి? వైసీపీ చేస్తున్న ఆరోపణలు ఏంటి?
అవినాష్ రెడ్డి నివాసాల్లో ఈడీ సోదాలకు అసలు కారణం ఏంటి? వైసీపీ చేస్తున్న ఆరోపణలు ఏంటి?
Embed widget