Pitru Paksham: పొరపాటున కూడా ఇప్పుడు ఉప్పు, బట్టలు లాంటి వస్తువులు కొనద్దట!
Pitru Paksham: పితృపక్షంలో మర్చిపోయి కూడా ఈ వస్తువులు కొనకూడదట. కొంటే జరిగే అనర్థాలను ఎవరూ ఊహించలేరట ఇంతకీ ఆ వస్తువలు ఏంటో ఈ కథనంలో తెలుసుకుందాం.
Pitru Paksham: భాద్రపద మాసంలో పౌర్ణమి నుంచి అమావాస్య వరకు వచ్చే పదిహేను రోజులను పితృపక్షం అంటారు. ఈ పితృపక్షంలో ఎన్నో రకాల దానాలు ధర్మాలు చేస్తుంటారు. మన పూర్వీకుల ఆత్మ శాంతి కోసం వారిని ప్రసన్నం చేసుకోవడానికి శ్రాద్దం, పిండ ప్రదానం, తర్పణం లాంటివి చేస్తుంటారు. అలాగే నైవేద్యాలు సమర్పిస్తుంటారు. ఇలా చేయడం వల్ల పూర్వీకల ఆశీస్సులు మనపై దండిగా ఉంటాయని.. మన జీవితంలో దేనికి లోటు లేకుండా సుఖఃసంతోషాలతో ఉంటామని.. లేదంటే పూర్వీకుల ఆత్మలు అసంతృప్తిగా ఉంటే జీవితంలో ఊహించని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని హిందూ పండితులు చెప్తుంటారు.
ఈ సంవత్సరం పితృపక్షం ఈనెల పదిహేడో తారీఖున మొదలై.. అక్టోబర్ రెండో తారీఖున మహాలయ అమావాస్యతో ముగిస్తుంది. (17-09-2024 – 02-10-2024) ఈ పితృపక్ష సమయంలో మనం భూమిని దర్శించుకున్నట్లు బావన చేసుకుని పూర్వీకులకు తర్పణం వదిలితే కూడా పూర్వీకుల ఆత్మ సంతోసిస్తుందని చెప్తున్నారు. అయితే పితృ పక్షంలో ఎన్ని దానాలు చేసినా, ఎన్ని పిండ ప్రదానాలు చేసినా.. ఎన్ని తర్పనాలు చేసినా.. ఎన్ని శ్రాద్దకర్మలు చేసినా.. ఎన్ని కొన్ని వస్తువులు మాత్రం మర్చిపోయి కూడా కొనకూడదని చెప్తున్నారు. ఆ వస్తువులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
పితృ పక్షం సమయంలో కొనకూడని వస్తువవుల
కొత్త ఆస్తి, ఇల్లు లేదా వాహనం: పితృ పక్షం సమయంలో కొత్త ఆస్తి, ఇల్లు లేదా వాహనం కొనుగోలు చేయకూడదట. ఇలా చేస్తే పూర్వీకుల ఆత్మ క్షోభిస్తుందట. దీంతో ఆ ఇంట్లో తీరని అర్థిక కష్టాలు వస్తాయట.
బంగారం, వెండి, ఇనుము : పితృపక్షంలో కొనకూడని వస్తువులలో బంగారు, వెండి కూడా ఉన్నాయి. ఈ సమయంలో బంగారు, వెండి అభరణాలు కొనకూడదట. అలాగే ఇనుము కూడా కొనడం మానుకోవాలని పండితులు సూచిస్తున్నారు. ఈ టైంలో బంగారం, వెండి, ఇనుము కొంటే పూర్వీకుల ఆత్మలు కలవరపడతాయట.
ఇంటి పైకప్పు: పితృపక్షంలో ఇంటి పైకప్పును నిర్మించడం కూడా పూర్వీకులకు మంచిది కాదట. ఈ సమయంలో పైకప్పు వేస్తే ఆ ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ పెరిగి ఇంట్లో వాళ్లు అన్ని రకాలుగా కష్టాలు పడాల్సి వస్తుందట. కాబట్టి పితృపక్షంలో ఇంటి పైకప్పు వేయడం వాయిదా వేసుకోవడం బెటర్.
శుభ కార్యాలు: పితృపక్షంలో మరికొన్ని శుభకార్యాలు చేయకూడదట. ఈ కాలంలో గృహప్రవేశం, హేయిర్ కటింగ్ చేయించుకోవడం, పెళ్లి చూపులు, నిశ్చితార్థాలు లాంటి శుభకార్యాలను వాయిదా వేసుకోవాలట. ఒకవేళ ఏదైనా శుభకార్యం చేసినట్టయితే పూర్వీకులకు కోపం వస్తుందట. దీంతో వారిపై ప్రతికూల ప్రభావాలు పడతాయట.
మస్టర్డ్ ఆయిల్ (అవాల నూనె): పితృపక్షంలో అవాలనూను కూడా కొనకూడదట. ఎందుకంటే ఆవాల నూనె శని గ్రహానికి చిహ్నంగా పరిగణిస్తారు. అందువల్ల మస్టర్డ్ ఆయిల్ కోనుగోలు చేయడం వల్ల శని ప్రతికూల ప్రబావాలను మన మీద పడటంతో ఇంట్లో విభేదాలు ఏర్పడతాయట.
చీపురు: చీపురు లక్ష్మీ దేవికి సూచికగా చెప్తారు. కనుక పితృ పక్షం సమయంలో చీపురు కొనడం ఆర్థిక నష్టానికి దారి తీస్తుందట.
ఉప్పు: ఉప్పు కూడా లక్ష్మి స్వరూపంగా భావిస్తారు. కనుక ఉప్పును కూడా ఈ సమయంలో కొనకూడదట. ఒకవేళ పితృకర్మలు చేసిన తర్వాత కొనుగోలు చేసినా ఎటువంటి ఇబ్బంది ఉండదట.
కొత్త బట్టలు : పితృ పక్షంలో మనం వేసుకోవడానికి కొత్త బట్టలు కొనకూడదట. అయితే పూర్వీకుల పేరు మీద దానాలు చేయడానికి లేదా పూర్వీకులకు వస్త్ర నైవేద్యాలు సమర్పించడానికి కొనవచ్చట. అయితే ఈ సమయంలో వస్త్రదానం కోసం కొన్న కొత్త బట్టలను పితృకర్మలు చేసిన తర్వాత ఇంట్లో వాళ్లు ఎవరైనా వాడుకోవచ్చట.
పితృ పక్షం సమయంలో ఈ మార్గదర్శకాలను పాటించడం వల్ల సానుకూల శక్తిని పొందడంతో పాటు మీ పూర్వీకుల నుండి ఆశీర్వాదాలు పొందుతారని హిందూ పండితులు చెప్తున్నారు.
ALSO READ: సెప్టెంబరు 20 రాశిఫలాలు - ఈ రాశులవారు జీవిత భాగస్వామి సలహాలను నిర్లక్ష్యం చేయవద్దు!