సెప్టెంబరు 20 రాశిఫలాలు - ఈ రాశులవారు జీవిత భాగస్వామి సలహాలను నిర్లక్ష్యం చేయవద్దు!
Horoscope Prediction 20 September 2024 : గ్రహాల కదలిక, నక్షత్రాల ఆధారంగా జ్యోతిష్యులు రాశి ఫలితాలను అంచనా వేస్తారు. ఈరోజు రాశి ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.
Daily Horoscope for 20 September 2024
మేష రాశి
ఈ రోజు మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులు పూర్తవుతాయి. మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. విద్యార్థులు పోటీ పరీక్షలలో మంచి విజయం సాధిస్తారు. ఈ రాశివారు ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా వ్యవహరించాలి.
వృషభ రాశి
క్రమశిక్షణ పాటించండి. దీర్ఘకాలిక అనారోగ్యంతో ఉన్నవారికి ఉపశమనం లభిస్తుంది. వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది. ఉద్యోగం, వ్యాపారంలో కొత్త ప్రయోగాలు చేయొద్దు.
మిథున రాశి
కార్యాలయంలో కొన్ని పెద్ద సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు. ఇంట్లో ప్రశాంత వాతావరణం ఎంజాయ్ చేస్తారు. వివాదాల్లో చర్చల ద్వారా పరిష్కరించుకోవడంలో విజయం సాధిస్తారు. ఉన్నతవిద్యలో మీ పనితీరు అద్భుతంగా ఉంటుంది. విద్యార్థులు వృత్తిపరమైన ఆందోళనల నుంచి ఉపశమనం పొందుతారు.
Also Read: శతభిషం నక్షత్రంలో శని సంచారం ..ఈ రాశులవారికి 3 నెలల పాటూ ఆర్థిక, ఆరోగ్య సమస్యలు తప్పవ్!
కర్కాటక రాశి
ఉద్యోగాలు చేసే వ్యక్తులు ఉన్నత స్థానం పొందుతారు. మీరు చేపట్టే పనులకు కుటుంబ సభ్యుల నుంచి సహకారం లభిస్తుంది. ఆదాయం స్థిరంగా ఉంటుంది..ఖర్చులు తగ్గించుకోవడం మంచిది.
సింహ రాశి
కుటుంబానికి సమయం కేటాయిస్తారు. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. భవిష్యత్ ప్రణాళికలు బయటకు చెప్పొద్దు. రాజకీయాలతో సంబంధం ఉండేవారు శత్రువులతో జాగ్రత్తగా వ్యవహరించాలి.
కన్యా రాశి
ఆలోచనలను ప్రశాంతంగా ఉంచుకోవాల్సిన అవసరం ఉంది. కుటుంబంలో వివాదాలు తలెత్తే అవకాశం ఉంది. మీరు గతంలో పోగొట్టుకున్న వస్తువులు తిరిగి పొందే అవకాశం ఉంది. జీవిత భాగస్వామి సలహాలను నిర్లక్ష్యం చేయవద్దు. వ్యాపారంలో ఖర్చులు పెరుగుతాయి.
తులా రాశి
ఈ రోజు పరిస్థితులు మీకు అనుకూలంగా ఉంటాయి. భవిష్యత్ కోసం ప్రణాళికలు వేసుకుంటారు. ఉద్యోగులు పనితీరుకి ప్రశంసలు పొందుతారు. వ్యాపారంలో నూతన పెట్టుబడులు కలిసొస్తాయి. మీ దినచర్యను మెరుగుపర్చుకునేందుకు ప్రయత్నించండి. మీరు శత్రువులపై విజయం సాధిస్తారు.
Also Read: నక్షత్రం మారుతున్న శని..అక్టోబరు నుంచి మూడు నెలల పాటూ ఈ రాశివారికి పట్టిందల్లా బంగారమే!
వృశ్చిక రాశి
ఆరోగ్యం మెరుగుపడుతుంది. మిమ్మల్ని మీరు ఫిట్‌గా ఉంచుకోవడానికి ప్రయత్నించాలి. సాత్విక ఆహారం తీసుకోండి. వ్యాపారంలో నూతన ప్రయోగాలు చేసేందుకు మంచిరోజు. ఉద్యోగులు పని విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దు.
ధనుస్సు రాశి
అతిగా ఆలోచించడం వల్ల ఒత్తిడి పెరుగుతుంది. కెరీర్ కి సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకోగలగుతారు. విద్యార్థులు చదువుపట్ల ఆసక్తి కనబరుస్తారు. పిల్లల కెరీర్ కి సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకోగలుగుతారు. మీ చుట్టూ ఉండే వ్యక్తులతో మంచి సంబంధాలు కొనసాగించండి.
మకర రాశి
ఈ రోజు ఈ రాశి ఉద్యోగులకు కార్యాలయంలో కొన్ని ఇబ్బందులు తప్పవు. మీపై ఉండే అంచనాలు అందుకునేందుకు కష్టపడి పనిచేయాలి. వివాదాలకు దూరంగా ఉండేందుకు ప్రయత్నించండి. భాగస్వామ్య వ్యాపారం నుంచి ప్రయోజనం పొందుతారు. వ్యాపార లావాదేవీలు సక్సెస్ అవుతాయి.
కుంభ రాశి
ఆర్థిక రంగం బలంగా ఉంటుంది. మీ ఆదర్శాల విషయంలో బలంగా ఉండాలి. నూతన ఆదాయ వనరులు అభివృద్ధి చేయడంలో విజయం సాధిస్తారు. కుటుంబానికి మంచి సమయం కేటాయిస్తారు. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది.
మీన రాశి
వ్యాపారంలో అనుభవజ్ఞుల సలహా తీసుకోవడం ఉత్తమం. కొత్త అప్పులు చేయకండి. ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించండి. కొన్ని ముఖ్యమైన పనుల విషయంలో నిర్ణయం తీసుకోలేని పరిస్థితి ఏర్పడవచ్చు. ఇతరులకు సహాయం చేయడానికి మీ స్వంత ప్రయోజనాలను విస్మరించవద్దు.
Also Read: ఈ ఏడాదంతా ఏల్నాటి శని, అష్టమ శని ఉన్న రాశులివే!
Note: ఓ రాశిలోని ఫలితాలు మొత్తం ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు..మీ జాతకంలో గ్రహస్థితి ఆధారంగా కూడా ఫలితాల్లో మార్పులుంటాయి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం.