AP Rajya Sabha Election 2024: ఏపీలో 3 రాజ్యసభ స్థానాలకు ఎన్నికల నోటిఫికేషన్- డిసెంబర్ 20న పోలింగ్
Rajya Sabha Election 2024: ఆంధ్రప్రదేశ్‌తోపాటు మరికొన్ని రాష్ట్రాలకు ఎన్నికల సంఘం షెడ్యూల్ రిలీజ్ చేసింది. ముగ్గురు వైసీపీ ఎంపీల రాజీనామాతో ఏపీలో ఎన్నికలు అనివార్యమయ్యాయి.
Andhra Pradesh News: ఆంధ్రప్రదేశ్‌లో మరో ఎన్నిక నగారా మోగింది. వైసీపీ ఎంపీల రాజీనామాతో ఖాళీ అయిన స్థానాలకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్ ఇచ్చింది. ముగ్గురు వైసీపీ ఎంపీలు మోపిదేవి వెంకటరమణ, బీదమస్తాన్, ఆర్ కృష్ణయ్య రాజీనామాతో ఈ ఎన్నికలు అనివార్యమయ్యాయి.
ఇలా ఖాళీ అయిన స్థానాలకు నోటిఫికేషన్ ఇచ్చిన ఎన్నికల సంఘం డిసెంబల్ 3 నుంచి నామినేషన్లు స్వీకరించనుంది. డిసెంబర్ 10 వరకు నామినేషన్లకు స్వీకరిస్తారు. దాఖలు చేసిన నామినేషన్లను ఉపసంహరించుకోవడానికి డిసెంబర్ 13 వరకు గడువు విధించింది. ఒక వేళ పోటీ ఉంటే డిసెంబర్ 20న పోలింగ్ నిర్వహించనుంది. అదే రోజు కౌంటింగ్ కూడా చేపట్టనుంది. ఒడిశా, బెంగాల్, హర్యానాలో ఏర్పడ్డ ఖాళీలకు ఇదే షెడ్యూల్‌లో ఎన్నికలు నిర్వహించనుంది. డిసెంబర్ 20న ఉదయం 9 నుంచి 4 గంటల వరకు ఓటింగ్ నిర్వహిస్తారు.
Also Read:వైఎస్ఆర్‌సీపీ నుంచి జోరుగా ప్రజా ప్రతినిధుల వలసలు - ఆపేందుకు ప్రయత్నించడం లేదా ?
ఈ మూడు స్థానాలు కూడా కూటమి పార్టీలే కైవశం చేసుకోనున్నాయి. అసెంబ్లీలో కేవలం 11 స్థానాలకే పరిమితం అయిన వైసీపీ ఈ ఎన్నికలకు దూరంగా ఉండబోతోంది. అందుకే ఈ మూడు స్థానాల్లో రెండు టీడీపీకి ఒక స్థానం బీజేపీకి ఇస్తారనే ప్రచారం నడుస్తోంది. మూడు పార్టీలకు మూడు ఇస్తారనే టాక్ కూడా ఉంది.
మోపి దేవి వెంకటరమణరావు ఆగస్టు 20న రాజీనామా చేశారు. ఆయన పదవీ కాలం 2026 జూన్ వరకు ఉంది. బీద మస్తాన్‌రావు పదవీకాలం 2028 జూన్ తో ముగుస్తుంది. ఆర్. కృష్ణయ్య పదవీకాలం 2028 జూన్ వరకు ఉంది.