(Source: ECI/ABP News/ABP Majha)
Saturn in Shatabhisha Nakshatra: నక్షత్రం మారుతున్న శని..అక్టోబరు నుంచి మూడు నెలల పాటూ ఈ రాశివారికి పట్టిందల్లా బంగారమే!
Shani Dev: ఓ రాశి నుంచి మరో రాశికి నెమ్మదిగా సంచరించే శని.. ఆయా రాశిలో ఉండే మూడు నక్షత్రాలను మారుతాడు. త్వరలో శని శతభిషం నక్షత్రంలో అడుగుపెట్టనున్నాడు..ఈ సమయం మూడు రాశులవారికి అత్యంత యోగం...
Saturn in Shatabhisha Nakshatra: శని..ఈ పేరు వింటేనే వణికిపోతారు. ఎల్నాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని ప్రభావం నుంచి ఎవ్వరూ తప్పించుకోలేరు. అయితే శని అంటే కేవలం చెడు చేసేవాడు మాత్రమే కాదు..మంచి కూడా చేస్తాడు. అది మీ గ్రహస్థితిపై ఆధారపడి ఉంటుంది. ఓ రాశి నుంచి శని మరో రాశిలోకి మారేందుకు రెండున్నరేళ్లు సమయం పడుతుంది. అంటే మొత్తం 12 రాశులు చుట్టి వచ్చేందుకు 30 ఏళ్ల సమయం పడుతుంది. శని జన్మంలో ఉంటే ఏల్నాటి శని అని...నాలుగో స్థానంలో ఉండే అర్థాష్టమ శని, ఎనిమిదో స్థానంలో సంచరిస్తే అష్టమ శని అంటారు. ఈ ప్రభావం అన్ని రాశులవారిపైనా ఉంటుంది. పదో స్థానంలో ఉన్న శని కూడా కొన్ని చెడు ఫలితాలను ఇస్తుంది. అయితే జాతకంలో శుక్రుడు, గురుడు మంచి స్థితిలో ఉంటే శని ప్రభావం ఉన్నప్పటికీ వారికి పెద్దగా చెడు జరగదు. అయితే ఓ రాశి నుంచి మరో రాశిలోకి పరివర్తనం చెందినట్టే ఓ నక్షత్రం నుంచి మరో నక్షత్రంలోకి మారుతూ 27 నక్షత్రాలను చుట్టేస్తాడు. మరో రెండు నెలల తర్వాత ...అంటే అక్టోబరులో శతభిషం నక్షత్రంలోకి అడుగుపెడతాడు. ఈ నక్షత్రానికి అధిపతి రాహువు... జ్యోతిష్య శాస్త్రంలో రాహువును చెడు చేసే గ్రహంగా చెబుతారు. కానీ శని-రాహువు మధ్య ఉన్న స్నేహం కారణంగా ఈ సమయంలో కొన్ని రాశులవారికి శుభఫలితాలున్నాయి. ఈ ప్రభావం అన్ని రాశులపై ఉంటుంది కానీ ఈ మూడు రాశులవారికి అత్యంత విశేషమైన శుభఫలితాలున్నాయి. జనవరి 26 వరకూ వరకూ శని ఇదే నక్షత్రంలో సంచరిస్తాడు...
Also Read: శుక్రవారం రోజు లక్ష్మీదేవికి ఈ పూలతో పూజచేస్తే సిరిసంపదలు నిలుస్తాయి!
మేష రాశి
శని శతభిషా నక్షత్రంలో అడుగుపెట్టినప్పటి నుంచి మేష రాశివారికి యోగకాలం ప్రారంభమవుతుంది. అనుకున్న పనులన్నీ అనుకున్నట్టు పూర్తవుతాయి. ఆదాయమార్గాలు పెరుగుతాయి. ఆర్థిక ఇబ్బందులు తీరిపోతాయి. దీర్ఘకాలంగా వెంటాడుతున్న సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఉద్యోగం, వ్యాపారంలో ఊహించని స్థాయిలో వృద్ధిని చూస్తారు. కుటుంబంలో సమస్యలన్నీ సమసిపోయి ఆనందం వెల్లివిరుస్తుంది.
వృషభ రాశి
శని శతభిషా నక్షత్రంలో సంచారం...ఈ రాశివారికి విశేష ప్రయోజనాలను అందిస్తుంది. వృత్తి వ్యాపారాల్లో లాభపడతారు. నిరుద్యోగులు మంచి ఉద్యోగంలో స్థిరపడతారు. విదేశాలలో వ్యాపారం చేసేవారు లాభాలు ఆర్జిస్తారు. విదేశాల్లో చదువుకోవాలని ఆశపడిన విద్యార్థుల కల నెరవేరుతుంది. ఉద్యోగులకు శుభసమయం. ఆర్థిక ఇబ్బందులు తీరిపోతాయి.
Also Read: శ్రావణమాసంలో ఈ రాశులవారిపై శివుడి అనుగ్రహం - సెప్టెంబరు 03 వరకూ మీకు తిరుగులేదు!
ధనుస్సు రాశి
శని నక్షత్ర మార్పు ధనస్సు రాశివారి జీవితంలో నూతన వెలుగులు నింపుతుంది. కొంతకాలంగా ఉద్యోగపరంగా ఎదుర్కొంటున్న సమస్యలు తీరిపోతాయి. ఉద్యోగంలో ప్రమోషన్ కి సంబంధించిన సమాచారం వింటారు. కెరీర్లో పురోగతి ఉంటుంది. సహోద్యోగులతో సంబంధాలు మెరుగుపడతాయి. ఇంటా బయటా మీ గౌరవం పెరుగుతుంది. వ్యాపారంలో లాభాలు ఆర్జిస్తారు. స్నేహితులతో సరదా సమయం స్పెండ్ చేస్తారు. వైవాహిక జీవితంలో సంతోషం ఉంటుంది.
ఈ ఏడాది కర్కాటక రాశివారికి అష్టమ శని, వృశ్చి రాశివారికి అర్ధాష్టమ శని నడుస్తోంది. మకర రాశి, కుంభ రాశి, మీన రాశులవారికి ఏల్నాటి శని నడుస్తోంది.
Also Read: మీ సమస్య ఆధారంగా వారంలో ఏ రోజు ఏ దేవుడిని ఎలా పూజించాలి..దానివల్ల వచ్చే ఫలితమేంటి!