Sawan 2024 Lucky Zodiac Sign: శ్రావణమాసంలో ఈ రాశులవారిపై శివుడి అనుగ్రహం - సెప్టెంబరు 03 వరకూ మీకు తిరుగులేదు!
Astrology: జ్యోతిష్య శాస్త్ర పండితులు ...గ్రహాల సంచారం ఆధారంగా ఓ రాశివారి అనుకూల, ప్రతికూలతలు నిర్ణయిస్తారు. అయితే శ్రావణంలో శివుడి అనుగ్రహంతో ఈ 3 రాశులవారికి అదృష్టం వెల్లివిరుస్తుందని చెబుతున్నారు..
Sawan 2024 Lucky Zodiac Sign: శ్రావణమాసం శ్రీ మహావిష్ణువుకి మాత్రమే కాదు శివుడికి అత్యంత ప్రీతపాత్రం. ప్రతి సోమవారం శివారాధనకు ఉత్తమమే అయినా శ్రావణమాసంలో వచ్చే సోమవారం పరమేశ్వరుడిని పూజిస్తే అత్యుత్తమ ఫలితాలనిస్తుందంటారు పండితులు. శ్రావణమాసంలో శివయ్యను ఆరాధించేవారిపై శివుడి అనుగ్రహం ఉంటుందని చెబుతారు. అయితే కొన్ని రాశులవారిపై భోళాశంకరుడి ప్రత్యేక ఆశీర్వచనాలు ఉంటాయంటారు జ్యోతిష్య శాస్త్ర పండితులు. ఆగష్టు 05 నుంచి సెప్టెంబరు 03 వరకూ శ్రావణమాసం. ఈ నెలరోజులు ఈ రాశులవారిపై లయకారుడి అనుగ్రహం ఉంటుందని చెబుతున్నారు జ్యోతిష్యశాస్త్ర పండితులు. ఈ రాశుల్లో మీ రాశి ఉందా...ఇక్కడ తెలుసుకోండి...
Also Read: మీ సమస్య ఆధారంగా వారంలో ఏ రోజు ఏ దేవుడిని ఎలా పూజించాలి..దానివల్ల వచ్చే ఫలితమేంటి!
మేష రాశి (Aries) (అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం)
వేద జ్యోతిషశాస్త్రం ప్రకారం ఈ ఏడాది ఎన్నో శుభయోగాలున్నాయి. శ్రావణమాసం మేష రాశివారికి శుభప్రదంగా ఉంటుంది. చేపట్టిన పనుల్లో మంచి ఫలితాలు సాధిస్తారు. అనుకున్న పనులన్నీ ప్రణాళిక ప్రకారం పూర్తిచేస్తారు. ఆర్థిక లాభాలుంటాయి. భౌతిక సుఖాలు పెరుగుతాయి. కోర్డు కేసుల్లో చిక్కుకున్నవారు శివుడి అనుగ్రహంతో బయటపడతారు. కుటుంబంలో సంతోషం ఉంటుంది. వృత్తి, వ్యాపారాలలో మంచి అభివృద్ధి ఉంటుంది. ఎప్పటి నుంచో వెంటాడుతున్న సమస్యలు తీరిపోతాయి.
సింహ రాశి (Leo)(మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం)
శ్రావణమాసం సింహ రాశివారికి అనుకూల ఫలితాలను అందించనుంది. అదృష్టం కలిసొస్తుంది. ఎప్పటి నుంచో వాయిదా పడుతూ వస్తున్న పనులు పూర్తవుతాయి. ఈనెలలో చేపట్టిన ప్రతి పనిలో అత్యంత ఫలవంతమైన ఫలితాలు అందుకుంటారు. నిరుద్యోగులు మంచి ఉద్యోగంలో స్థిరపడతారు. వ్యాపారంలో మెరుగుదల ఉంటుంది. నూతన పెట్టుబడులకు ఇది అనుకూల సమయం. కార్యాలయంలో ఉద్యోగులు మెరుగైన ఫలితాలు సాధిస్తారు. ఈ నెలంతా మీపై బోళాశంకరుడి అనుగ్రహం ఉంటుంది.
Also Read: రాఖీ పౌర్ణమి, కృష్ణాష్టమి, నాగపంచమి సహా 2024 ఆగష్టు నెలలో వచ్చే పండుగలివే..!
మకర రాశి (Capricorn) (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పాదాలు)
మకర రాశివారికి కూడా శ్రావణమాసం అద్భుత ఫలితాలను అందించనుంది. ఈ మాసం మీపై శంకరుడి ఆశీస్సులు విశేషంగా ఉంటాయి. చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. ఇంటా బయటా గౌరవం పెరుగుతుంది. నూతన ఆదాయ మార్గాలు ఏర్పడతాయి. అదృష్టం కలిసొస్తుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. దీర్ఘకాలికన అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు. వృత్తి , ఉద్యోగాలలో మెరుగుదల ఉంటుంది. కుటుంబంలో సంతోషం వెల్లివిరిస్తుంది.
కుంభ రాశి (Aquarius) (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు)
శ్రావణ మాసం కుంభ రాశివారికి అనుకూల ఫలితాలను ఇస్తుంది. శివపార్వతుల అనుగ్రహం వీరిపై ఉంటుంది. వ్యాపారులు తమ వ్యాపారాన్ని విస్తరిస్తారు. ఉద్యోగులు ప్రమోషన్ కి సంబంధించిన సమాచారం వింటారు. ఉద్యోగులకు పై అధికారుల నుంచి మద్దతు లభిస్తుంది. ఆదాయం పెరుగుతుంది. ధనలాభం ఉంటుంది.
Also Read: ఆర్థిక సమస్యలు, నరఘోష , శత్రుభయం నుంచి విముక్తి కల్పించే సంకష్టహర చతుర్థి వ్రతం - ఎలా చేయాలంటే!
గమనిక: గమనిక: వివిధ శాస్త్రాలు, గ్రంధాలు, పండితులు పేర్కొన్న ఆధ్యాత్మిక అంశాలు పరిష్కారాలను ఇక్కడ యథాతథంగా అందించాం. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం