అన్వేషించండి

Realme GT 7 Pro: ఐఫోన్ రేట్‌తో లాంచ్ అయిన రియల్‌మీ జీటీ 7 ప్రో - అంత రేటు వర్తేనా?

Realme New Phone: రియల్‌మీ జీటీ 7 ప్రో స్మార్ట్ ఫోన్ మనదేశంలో లాంచ్ అయింది. దీని ధర రూ.59,999 నుంచి ప్రారంభం కానుంది. అమెజాన్‌లో ఈ ఫోన్ నవంబర్ 29వ తేదీ నుంచి సేల్‌కు రానుంది.

Realme GT 7 Pro Launched: రియల్‌మీ జీటీ 7 ప్రో స్మార్ట్ ఫోన్ మనదేశంలో అధికారికంగా లాంచ్ అయింది. ఈ ఫోన్ నవంబర్ ప్రారంభంలో చైనాలో అందుబాటులోకి వచ్చింది. రియల్‌మీ జీటీ 7 ప్రోలో క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్‌ను కంపెనీ అందించింది. 16 జీబీ వరకు ర్యామ్, 512 జీబీ వరకు స్టోరేజ్‌ను ఈ ఫోన్‌లో ఉపయోగించుకోవచ్చు. డస్ట్, వాటర్ రెసిస్టెన్స్‌తో రియల్‌మీ జీటీ 7 ప్రో మార్కెట్లోకి వచ్చింది. 50 మెగాపిక్సెల్ సోనీ ఐఎంఎక్స్906 సెన్సార్ ఫోన్ వెనకవైపు అందించారు. దీంతోపాటు పెరిస్కోప్ టెలిఫొటో షూటర్ కూడా ఉంది.

మనదేశంలో రియల్‌మీ జీటీ 7 ప్రో ధర (Realme GT 7 Pro Price)
రియల్‌మీ జీటీ 7 ప్రో మనదేశంలో రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంది. 12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ ప్రారంభ వేరియంట్ ధరను రూ.59,999గా నిర్ణయించారు. టాప్ ఎండ్ వేరియంట్ అయిన 16 జీబీ ర్యామ్ + 512 జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.65,999గా ఉంది. మార్స్ ఆరెంజ్, గెలాక్సీ గ్రే కలర్ ఆప్షన్లలో దీన్ని కొనుగోలు చేయవచ్చు. నవంబర్ 29వ తేదీ నుంచి అమెజాన్, రియల్‌మీ అధికారిక వెబ్ సైట్లో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు.

Also Read: రూ.15 వేలలోపు బెస్ట్ 5జీ స్మార్ట్ ఫోన్లు ఇవే - లిస్ట్‌లో 108 మెగాపిక్సెల్ ఫోన్లు కూడా!

రియల్‌మీ జీటీ 7 ప్రో స్పెసిఫికేషన్లు (Realme GT 7 Pro Features)
ఇందులో 6.78 అంగుళాల శాంసంగ్ 2కే ఎకో2 స్కై స్క్రీన్ డిస్‌ప్లేను రియల్‌మీ అందించింది. రియల్‌మీ జీటీ 7 ప్రోలో 2600 హెర్ట్జ్ ఇన్‌స్టంట్ టచ్ శాంప్లింగ్ రేట్,  120 హెర్ట్జ్ వరకు రిఫ్రెష్ రేట్, 6000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ వంటి డిస్‌ప్లే ఫీచర్లు కూడా ఉన్నాయి. క్వాల్‌కాం ఇటీవలే మార్కెట్లో లాంచ్ చేసిన స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్‌పై రియల్‌మీ జీటీ 7 ప్రో రన్ కానుంది. ఈ స్మార్ట్ ఫోన్‌లో 16 జీబీ వరకు ఎల్పీడీడీఆర్5ఎక్స్ ర్యామ్, 512 జీబీ వరకు యూఎఫ్ఎస్ 4.0 స్టోరేజ్ అందుబాటులో ఉంది. ఆండ్రాయిడ్ 15 ఆధారిత రియల్‌మీ యూఐ 6.0 ఆపరేటింగ్ సిస్టంపై ఈ స్మార్ట్ ఫోన్ పని చేయనుంది.

రియల్‌మీ జీటీ 7 ప్రో వెనకవైపు మూడు కెమెరాలను కంపెనీ అందించింది. 50 మెగాపిక్సెల్ సోనీ ఐఎంఎక్స్906 సెన్సార్‌ని వీటిలో ప్రధాన కెమెరాగా అందించారు. 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ షూటర్, 50 మెగాపిక్సెల్ సోనీ ఐఎంఎక్స్882 సెన్సార్ కూడా ప్రధాన కెమెరాతో పాటు అందుబాటులో ఉన్నాయి. 3x ఆప్టికల్, 120x డిజిటల్ జూమ్‌ను కూడా సపోర్ట్ చేయనుంది. ముందు వైపు మాత్రం సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 16 మెగాపిక్సెల్ సెన్సార్ అందించారు. లైవ్ ఫొటోలు, ఏఐ బ్యాక్డ్ ఎడిటింగ్, అండర్‌వాటర్ ఫొటోగ్రఫీ ఫీచర్లను కూడా ఈ స్మార్ట్ ఫోన్ సపోర్ట్ చేయనుంది.

రియల్‌మీ జీటీ 7 ప్రో బ్యాటరీ సామర్థ్యం 6500 ఎంఏహెచ్ కాగా, 120W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్‌ను కూడా సపోర్ట్ చేయనుంది. డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ కోసం ఐపీ68, ఐపీ69 రేటింగ్స్ సపోర్ట్ కూడా ఈ స్మార్ట్ ఫోన్‌లో ఉంది. ఇన్‌డిస్‌ప్లే అల్ట్రా సోనిక్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ద్వారా ఈ స్మార్ట్ ఫోన్‌ను అన్‌లాక్ చేయవచ్చు. 5జీ, డ్యూయల్ 4జీ వోల్టే, వైఫై 7, క్యూజెడ్ఎస్ఎస్, ఎన్ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు, బ్లూటూత్ వీ5.4, జీపీఎస్, గెలీలియో, బైదు వంటి కనెక్టివిటీ ఫీచర్లు కూడా అందించారు.

Also Read: ఫోన్‌లో ఈ పాస్‌వర్డ్ పొరపాటున కూడా పెట్టుకోకండి - హ్యాక్ చేయడానికి సెకన్లు చాలు!

టాప్ హెడ్ లైన్స్

Adilabad Latest News: నిరుపేదలకు ఇందిరమ్మ గృహాలు మంజూరు చేసిన కలెక్టర్! గూడానికి ఆయన పేరు పెట్టిన గిరిజనం!
నిరుపేదలకు ఇందిరమ్మ గృహాలు మంజూరు చేసిన కలెక్టర్! గూడానికి ఆయన పేరు పెట్టిన గిరిజనం!
Pocharam Srinivas Reddy:
"అన్నం పెట్టిన కేసీఆర్‌ను మర్చిపోలేను" బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు 
Pawan Kalyan Latest Look:విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
AP Municipal Elections 2026: ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Adilabad Latest News: నిరుపేదలకు ఇందిరమ్మ గృహాలు మంజూరు చేసిన కలెక్టర్! గూడానికి ఆయన పేరు పెట్టిన గిరిజనం!
నిరుపేదలకు ఇందిరమ్మ గృహాలు మంజూరు చేసిన కలెక్టర్! గూడానికి ఆయన పేరు పెట్టిన గిరిజనం!
Pocharam Srinivas Reddy:
"అన్నం పెట్టిన కేసీఆర్‌ను మర్చిపోలేను" బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు 
Pawan Kalyan Latest Look:విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
AP Municipal Elections 2026: ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
Toyota Hiluxకు గట్టి పోటీ.. Mahindra Scorpio N Pickupలో ఇవన్నీ ఉంటాయా?
మహీంద్రా స్కార్పియో N పికప్‌: ఆగస్టు 14న గ్రాండ్ డెబ్యూ.. టీజర్‌తో రచ్చ మొదలు
NTR Surgery : ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
Defection MLAs: అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
Anupama Parameswaran : రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
Embed widget