Kulasekhar death : టాలీవుడ్ ప్రముఖ పాటల రచయిత మృతి - గాంధీ ఆస్పత్రిలో అనాథలా మృతదేహం
Tollywood: ప్రముఖ పాటల రచయిత కులశేఖర్ చనిపోయారు. ఆయన సినిమాల్లో సక్సెస్ చూసిన తర్వాత దారి తప్పడంతో జీవితం తలకిందులయింది.

Popular lyricist Kulasekhar passed away : ఉదయ్ కిరణ్ తొలి సినిమా చిత్రం సినిమా పాటలు సూపర్ హిట్ అయ్యాయి. సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్, తేజ కాంబినేషన్‌లో వచ్చిన మొదటి సినిమా అది. పాటలు రాసింది కొత్త రచయిత కులశేఖర్. ఆ పాటలు ఎంత హిట్ అయ్యాయంటే ఆ తర్వాత ఆ రచయిత ఓ ప్రముఖ పత్రికలో తాను చేస్తున్న ఉద్యోగాన్ని కూడా వదిలి పెట్టి పెద్ద ఎత్తున పాటల రచన చేశారు. స్టార్ రైటర్‌గామారారు. ఎన్నో హిట్ సినిమాలకు పాటలు రాసిన ఆ రచయిత ఇప్పుడు చనిపోయారు. ఆయన మృతదేహం గాంధీ ఆస్పత్రిలో అనాథలా పడి ఉంది.
చిత్రం సినిమాతో ప్రారంభించి అనేక సినిమాల్లో హిట్ పాటలు రాసిన కులశేఖర్
కులశేఖర్ అసుల పేరు తిరుమల పల్లెర్లమూడి కులశేఖర్. సినిమాల్లో ఎంతో సక్సెస్ చూసిన ఆయన ఓ సినిమాకు దర్శకుడిగా కూడా వ్యవహిరంచారు. అయితే ఓ హీరోయిన్ మోజులో పడి మొత్తం కుటుంబాన్ని నాశనం చేసుకున్నారని ప్రచారం జరిగింది. ఓ సారి దొంగతనం కేసుల్లోనూ అరెస్ట్ అయ్యారు . ఆలయాలను లక్ష్యంగా చేసుకొని పూజారుల బ్యాగులు, సెల్‌ఫోన్లను చోరీ చేయడమే కాకుండా 2013లో కాకినాడలోని బాలాత్రిపుర సుందరీదేవి అమ్మవారి ఆలయంలో శఠగోపాన్ని ఎత్తుకెళ్లారు. ఆలయాల్లో పూజారుల బ్యాగులు, సెల్‌ఫోన్లు, శఠగోపాలు తస్కరిస్తూ బంజారాహిల్స్ పోలీసులకు ఓ సారి పోలీసులకు చిక్కారు.
Also Read : రెహమాన్ తండ్రితో సమానం.. ఎఫైర్ రూమర్లపై ఫస్ట్ టైమ్ ఘాటుగా స్పందించిన మోహినీ డే
తర్వాత దొంగతనాలు చేస్తూ పలుమార్లు పోలీసులకు చిక్కిన కులశేఖర్
విశాఖపట్నం జిల్లా, సింహాచలం బృందావన్‌కాలనీకి చెందిన కులశేఖర్ నగరంలోని మోతీనగర్‌లో అద్దెకుంటున్నాడు. సినీ ఇండస్ట్రీలో ఆయన చేసిన తప్పుల కారణంగా కట్టుకున్న భార్య కూడా అతడిని వదిలేసి పిల్లలతో సహా వెళ్లిపోయింది. దీంతో తాను పిచ్చివాడినయ్యానని ఆయన చెప్పుకునేవారు. తరచూ పోలీసులకు చిక్కుతున్నా తన ప్రవర్తనలో మార్పు రాకపోగా అది మరింత పెరుగుతున్నట్లు ఓ సారి పోలీసులకు చిక్కినప్పుడు పోలీసులకు చెప్పారు.
కుటుంబం కోసం వదిలేయడంతో ఒంటరి మరణం
రాజమండ్రి జైలులో ఆరు నెలలు జైలు శిక్ష అనుభవించినా అతని వైఖరిలో మార్పు రాలేదు. 2008 నుంచి మెదడుకు సంబంధించిన వ్యాధి కారణంగా జ్ఞాపకశక్తిని కోల్పోవడమే కాకుండా తను ఏం చేస్తున్నాడో తనకే తెలియని స్థితిలో ఉన్నారని తెలుస్తోంది. ఈ కారణంగానే ఆయన మరణించినట్లుగా తెలుస్తోంది. అందరూ దూరం అయిపోవడంతో ఆయన మృతదేహం అనాథలా గాంధీ ఆస్పత్రి మార్చురీలో ఉంది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

