Meghasandesham Serial Today September 23rd: ‘మేఘసందేశం’ సీరియల్: గగన్ ప్రేమలో పడ్డ నక్షత్ర – తన ప్రేమ విషయం శారదకు చెప్పిన భూమి
Meghasandesham Today Episode: నక్షత్రను రౌడీల నుంచి కాపాడటంతో గగన్ ను హీరోలా ఫీలవుతంది నక్షత్ర దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్ రొమాంటిక్ గా జరిగింది.
Meghasandesham Serial Today Episode: నక్షత్రను కాపాడటానికి రౌడీలను కొడుతుంటాడు గగన్ ఇంతలో రౌడీలు తోసేయడంతో గగన్ వెళ్లి నక్షత్ర మీద పడతాడు. దీంతో నక్షత్రలో గగన్ మీద లవ్ మొదలవుతుంది. రౌడీలందరూ పారిపోయినా నక్షత్ర అలాగే నిలబడిపోతుంది. పెనుగులాటలో నక్షత్ర శారీ చినిగిపోతే గగన్ తన షర్ట్ ఇస్తాడు. తర్వాత ఇక వెళ్లు అని చెప్పగానే నక్షత్ర భయంగా ఉందని చెప్పడంతో మీ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను పద అని తన కారులో నక్షత్రను తీసుకుని వెళ్తాడు గగన్. మరోవైపు ఇంటికి వెళ్లిన భూమి ఆంటీ ఎక్కడ అని అడుగుతుంది. లోపల వంట చేస్తుంది అని చెప్పగానే భూమి కిచెన్ లోకి వెళ్తుంది.
భూమి: ఆంటీ మీ అబ్బాయికి పెళ్లి చేయాలి అనుకున్నప్పుడు ఓ మాట చెప్పరా..?
శారద: ఎవరికీ..?
భూమి: ఇంట్లో వాళ్లకు
శారద: ఇంట్లో అందరికీ తెలుసుగా..
భూమి: అందరూ అంటే మీ ముగ్గురికీ తెలిస్తే సరిపోతుందా? మిగిలిన వాళ్లను పట్టించుకోరా?
శారద: ఎవరి గురించి అమ్మా..
భూమి: ఎవరి గురించో అంటే… నా…
పూరి: ఏంటీ నీకా..?
భూమి: నాకు కాదు మీ నాన్నకు చెప్పారా? అంటున్నాను.
పూరి: ఆయనకేంటి చెప్పేది..?
శారద: పూరి..
పూరి: ఏంటమ్మా ఆయనను అంటే కోపం వస్తుందా?
అనగానే శారద వచ్చి పూరిని తిడుతుంది. నీకేం తెలుసని మాట్లాడుతున్నావు. ఆయన ఎక్కడున్నా నీకు నాన్న. ఏదైనా అనే ముందు ఆలోచించి మాట్లాడు అంటుంది. ఇంతలో భూమి మీకు ఎలాంటి కోడలు రావాలో చెప్పండి అని అడుగుతుంది. దీంతో శారద నాకు నీలాంటి కోడలు కావాలని ఉంది అంటుంది. దీంతో భూమి హ్యాపీగా ఫీలవుతుంది. పూరి ఇలాంటి కోడలా ఆ మాట అన్నయ్య విన్నాడనుకో పెళ్లే వద్దని సన్యాసం తీసుకుంటాడు. దీంతో భూమి నాకేం తక్కువని అంటూ పూరితో గొడవ పడుతుంది. మరోవైపు రోడ్డు పక్కన కారు ఆపుకుని రౌడీలు నక్షత్రను చంపేసి ఉంటారని ఏడుస్తుంది. ఇంతలో నక్షత్రకు ఫోన్ చేస్తుంది.
నక్షత్ర: హలో మమ్మీ..
అపూర్వ: నక్షత్ర ఎక్కడున్నావు అమ్మా ఎలా ఉన్నావు.. నీకేం కాలేదు కదా?
నక్షత్ర: నేను సేఫ్ గానే ఉన్నాను మమ్మీ..
అపూర్వ: ఆ వెధవలు నిన్నేం ఇబ్బంది పెట్టలేదు కదా?
నక్షత్ర: లేదులే మమ్మీ నువ్వేం కంగారు పడకు.
అపూర్వ: ఇప్పుడు ఎక్కడున్నావో చెప్పు నేను వచ్చేస్తాను.
నక్షత్ర: ఇంటికి వస్తున్నాను మమ్మీ కారులో ఉన్నాను.
అని చెప్పగానే త్వరగా వచ్చేయ్ అమ్మా జాగ్రత్త అని చెప్పి హ్యాపీగా వెళ్లిపోతుంది అపూర్వ. తర్వాత గగన్ వచ్చి నక్షత్రను ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాడు.
నక్షత్ర: లోపలికి రావొచ్చుగా..
గగన్: లోపలికా.. నేనా..? అది నీకు ఇల్లులా కనిపిస్తుందేమో.. కానీ నాకు మాత్రం ఇటుకలు పేర్చిన గోడలా కనిపిస్తుంది. రావటం కుదరదు వెళ్లు..
నక్షత్ర: నేను రమ్మంటుంది. నా వాళ్ల గురించి కాదు. నన్ను నా ప్రాణాలను కాపాడినందుకు కృతజ్ఞతగా రమ్మంటున్నాను.
గగన్: నిన్ను కాపాడింది ఈ ఇంటి మనిషివనో.. నాకు వరసనో.. బందువనో.. బాధ్యత అనో కాదు. నీ స్థానంలో ఎవరున్నా.. ప్రాణాలకు తెగించి వాళ్ల ప్రాణాలు కాపాడతాను. నేను రావడం జరగదు.
అని వెళ్లిపోతాడు గగన్. ఎందుకు జరగదు నీ రాక కోసం రాచమర్యాదలు చేసే రోజు తప్పకుండా వస్తుంది బావ అని మనసులో అనుకుని లోపలికి వెళ్తుంటుంది నక్షత్ర. ఇంతలో అపూర్వ కంగారుగా పరుగెత్తుకొస్తుంది. నక్షత్రను హగ్ చేసుకుని నీకేం కాలేదు కదా అంటూ ఏడుస్తుంది. నక్షత్రను లోపలికి తీసుకెళ్లి స్నానం చేయించి దిష్టి తీస్తుంది అపూర్వ. తర్వాత గగన్ గురించి ఆలోచిస్తుంది నక్షత్ర. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: పొరపాటున కూడా ఇప్పుడు ఉప్పు, బట్టలు లాంటి వస్తువులు కొనద్దట!