Meghasandesam Serial Today September 24th: ‘మేఘసందేశం’ సీరియల్: శారద దగ్గరకు వెళ్లిన కేపీ – కోపంతో ఊగిపోయిన గగన్
Meghasandesam serial today episode September 24th: ప్లాన్ ప్రకారం గగన్ ను బయటకు పంపించి కేపీ శారద దగ్గరకు వచ్చేలా చేస్తుంది భూమి. దీంతో ఇవాళ్టీ ఏపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది.

Meghasandesam Serial Today Episode: శారద రూంలోకి వచ్చిన అపూర్వ, రత్న, రౌడీ ముగ్గురు కలిసి శారదను చంపబోతుంటే.. భూమి వస్తుంది. రౌడీ చూసి అమ్మా భూమి వస్తుంది అని చెప్తాడు. దీంతో ముగ్గురు కలిసి రూంలోనే కర్టెన్ల వెనక దాక్కుంటారు. వాళ్లను చూస్తుంది భూమి..
భూమి: ఏయ్ ఎవరు మీరు అసలు ఈ రూంలోకి ఎందుకు వచ్చారు అడుగుతుంది మిమ్మల్నే..
గగన్: ( మెడికల్ షాపు దగ్గర) తను ఇంకా రావడం లేదేంటి..? సార్ టూ మినిట్స్ ఇప్పుడే వచ్చి తీసుకెళ్తాను.
భూమి: ఏయ్ ఎవరే నువ్వు చెప్తా నీ సంగతి..
అంటూ అక్కడే ఉన్న సెలైన్ పైపు తీసుకుని అపూర్వను కొడుతుంది. ఇంతలో రత్న, రౌడీ మాస్కులు వేసుకుని వచ్చి భూమిని పట్టుకుంటారు. అపూర్వ తప్పించుకుని బయటకు వెళ్తుంది. అప్పుడే గగన్ రావడంతో రత్న, రౌడీకి చెప్పి వేరే డోర్ నుంచి వెళ్లిపోతుంది. అపూర్వ చెప్పడంతో రత్న, రౌడీ అక్కడి నుంచి పారిపోతుంటే.. భూమి పట్టుకుంటుంది. ఇంతలో గగన్ వస్తాడు. ఇద్దరూ కలిసి పట్టుకోవాలని చూస్తే తప్పించుకుని పారిపోతారు. తర్వాత హాస్పిటల్‌లో ఉన్న శారదను తాను ఎలాగైనా చూడాలనుకుంటాడు కేపీ. అందుకోసం భూమికి కాల్ చేస్తాడు. నువ్వు ఏదైనా చేసి అక్కడ గగన్ లేకుండా చేయమని చెప్తాడు. దీంతో సరే మామయ్యా అంటూ కాల్ కట్ చేస్తుంది. ఎలా గగన్ ను అక్కడి నుంచి పంపించాలని ఆలోచిస్తుంది. చివరకు ఒక జ్యూస్ గ్లాస్ తీసుకుని ఐసీయూలోకి వెళ్తుంది.
భూమి: బావ ఈ జ్యూస్ తాగు బావ..
గగన్: నాకు వద్దు భూమి..
భూమి: ఎంత నీరసంగా కనిపిస్తున్నావో తెలుసా..? తాగు బావ..
గగన్: నాకు వద్దు అని చెప్పాను కదా ఎందుకు బలవంతం చేస్తావు.. అసలు నేను నీరసంగా కనిపించడం ఏంటి..? వెళ్లు ఇక్కడి నుంచి
భూమి: అలా మాట్లాడకు బావ.. నువ్వు మొన్నటి నుంచి అసలేం తినలేదు. చాలా నీరసంగా ఉన్నావు.. జ్యూసే కదా తీసుకో బావ. అత్తయ్యకు ఏం కాదులే.. తీసుకో..
గగన్: నాకు వద్దంటే వద్దు ఒక్కసారి చెప్తే నీకు అర్థం కాదా..? ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్లు..
భూమి: లేదు బావ మీరు ఈ జ్యూస్ తీసుకోవాల్సిందే..
అంటూ భూమి బలవంతంగా గగన్ చేత జ్యూస్ తాగించబోతుంది. గగన్ జ్యూస్ ఉన్న గ్లాస్‌ను నెట్టేస్తాడు. దీంతో జ్యూస్ గగన్ షర్ట్ మీద పోతుంది. వెంటనే గగన్ కోపంగా భూమిని చూస్తూ..
గగన్: నేను షర్ట్ మార్చుకుని వస్తాను.. ఇక్కడే ఉండి అమ్మను జాగ్రత్తగా చూసుకో..
భూమి: అలాగే బావ.. అలాగే ఏదైనా తిని రండి.. బావ..
గగన్: ఈ ఎక్స్ ట్రాలే వద్దు అనేది..
అంటూ గగన్ బయటకు వెళ్లిపోతాడు. గగన్ బయటకు వెళ్లిన విషయం కేపీకి చెప్తుంది భూమి దీంతో వెంటనే కేపీ, చెర్రి ఐసీయూలోకి వెళ్తారు. శారదను చూసి ఎమోషనల్ అవుతారు. తర్వాత భూమి, చెర్రి అక్కడి నుంచి బయటకు వెళ్తారు.
కేపీ: చీమకు కూడా అపకారం చేయని మనిషివి.. ఆ దేవుడు నీకేం కానివ్వడు..
అంటూ కేపీ ఎమోషనల్ అవుతూ తన బొటనవేలిని కత్తితో కోసి వచ్చిన బ్లడ్‌ను శారదకు బొట్టుగా పెడుతాడు. ఇంతలో అక్కడకు గగన్ వస్తాడు. వెనకే భూమి, చెర్రి పరుగెత్తుకుంటూ వస్తారు. గగన్ కోపంగా కేపీని చూస్తుంటాడు. ఇంతలో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!





















