Meghasandesam Serial Today October 8th: ‘మేఘసందేశం’ సీరియల్: రౌడీని పట్టుకున్న గగన్ - విడిచిపెట్టమని వార్నింగ్ ఇచ్చిన సూర్య
Meghasandesam serial today episode October 8th: రోడ్డు మీద అపూర్వను చంపిన రౌడీ కనిపించడంతో గగన్ వాడిని కొడుతుంటాడు. ఇంతలో ఏసీపీ సూర్య రావడంతో ఇవాళ్టీ ఏపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది.

Meghasandesam Serial Today Episode: గగన్, భూమి మార్కెట్‌కు వెళ్లి వస్తుంటే.. అపూర్వ మీద గన్‌తో దాడి చేసిన రైడీ కనిపిస్తాడు. వాడిని చూసిన భూమి షాక్ అవుతుంది. వాణ్ని చూస్తూ అలాగే నిలబడిపోతుంది.
గగన్: ఏంటి భూమి ఆగిపోయావు.. నాకు ఆఫీసుకు టైం అవుతుంది వెళ్దాం పద త్వరగా.. ఎందుకు అలా షాకింగ్ గా చూస్తున్నావు.. వెళ్దా పద
భూమి: బావ.. బావ..
గగన్: చెప్పు భూమి ఎందుకు అలా షాకింగ్ గా చూస్తున్నావు… ఎవరతను..? ఎందుకు భయపడుతున్నావు.. చెప్పు భూమి..
భూమి: బావ వాడే బావ.. వాడే.. మన ఇంటికి వచ్చి అత్తయ్య మీద అటాక్ చేసింది వాడే.. అత్తయ్యను గన్ తో కాల్చింది వాడే.. వాడే బావ
అంటూ భూమి భయపడుతూ చెప్పగానే గగన్ కోపంగా అపూర్వ రౌడీని చూస్తాడు.
గగన్: రేయ్.. ఆగరా..?
అంటూ కేకలు వేయగానే.. రౌడీ గగన్, భూమిలను చూసి పారిపోతుంటాడు. గగన్ పరిగెత్తుకుంటూ వెళ్లి రౌడీని పట్టుకుంటాడు. కింద పడేసి కొడుతుంటాడు.
గగన్: మా అమ్మను ఎందుకు రా షూట్ చేశావు.. అసలు నీకు మా అమ్మకు ఏదైనా శత్రుత్వం ఉందా..? చెప్పు.. అసలు నిన్ను పంపించింది ఎవరు..? మా అమ్మనే షూట్ చేయాల్సిన అవసరం ఏముంది..? చెప్పరా..? నిజం చెప్పకపోతే ఇవాళ నా చేతుల్లో చచ్చిపోతావురా..? చెప్పు..
రౌడీ: సార్ నాకేం తెలియదు సార్.. అసలు మీరు ఎవరో అనుకుని నన్ను పట్టుకున్నారు సార్.. నన్ను వదిలేయండి సార్..
భూమి: లేదు బావ వీడు అబద్దం చెప్తున్నాడు. వీడే ఆ రోజు మన ఇంటికి వచ్చింది. అత్తయ్యను షూట్ చేసింది వీడే బావ. వాడి చేతికి ఉన్న టాటూను ఆరోజు చూశాను బావ.
అని భూమి చెప్పగానే రౌడీ టాటూ ఉన్న తన చేతిని వెనక్కి మడుచుకుంటాడు. దీంతో గగన్ మరింత కోపంగా ఆ చేయిని పట్టుకుని విరిచేందుకు ప్రయత్నిస్తుంటాడు. ఇంతలో అక్కడికి ఏసీపీ సూర్య వస్తాడు. గగన్, రౌడీని కొట్టడం చూసి కారు దిగి వస్తాడు.
సూర్య: హలో మిస్టర్ ఎందుకు అతన్ని కొడుతున్నావు.. వదిలేయ్..
గగన్: వీడు మా అమ్మను చంపాలని చూస్తున్నాడు..
సూర్య: అవునా అయితే పోలీసులం మేము ఉండగా చట్టాన్ని నీ చేతుల్లోకి తీసుకుంటావా..? వాడి మీద కంప్లైంట్ ఇవ్వు కేసు ఫైల్ చేసి వాడు నిజంగానే మీ అమ్మను చంపడానికి ప్రయత్నిస్తే వాడికి శిక్ష పడేలా చేస్తాం..
గగన్: పోలీసులా..? ఎక్కడ ఉన్నారు పోలీసులు.. ఇప్పటిదాకా వీడు స్వేచ్చగా రోడ్ల మీద తిరుగుతుంటే పట్టుకోకుండా ఏం చేస్తున్నారు పోలీసులు. పోలీసులే వీడిని రక్షిస్తున్నారా..?
సూర్య: ఏయ్ మిస్టర్ ఏం మాట్లాడుతున్నావు.. నోరు అదుపులో పెట్టుకో.. అసలు మీ అమ్మను ఇతనే చంపాలని చూశాడని నువ్వెలా నిర్దారిస్తున్నావు..?
రౌడీ: నేను కాదు సార్ ఎంత చెప్పినా ఈయన వినడం లేదు.. పైగా కింద పడేసి కొడుతున్నాడు. మీరే నన్ను కాపాడాలి సార్..
గగన్: మళ్లీ అబద్దం చెప్తావురా..?
అంటూ గగన్ రౌడీని కొడుతుంటాడు. దీంతో ఏసీపీ సూర్య మధ్యలో వెళ్లి గగన్‌ను ఆపాలని చూస్తాడు. రౌడీని కొట్టబోయిన గగన్ చేయి సూర్యకు తగులుతుంది. సూర్య దూరం వెళ్లి పడిపోతాడు. దీంతో సూర్య కోపంగా గగన్‌ను చూస్తూ లేస్తాడు. ఇంతలో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!





















