Meghasandesam Serial Today October 28th: ‘మేఘసందేశం’ సీరియల్: హాస్పిటల్ కు వెళ్లిన గగన్ - ఐసీయూలో కేపీని చూసిన గగన్
Meghasandesam serial today episode October 28th: గగన్ హాస్పిటల్‌కు రావడం చూసిన భూమి భయంతో వెళ్లిపోతుంటే గగన్ పిలుస్తాడు. దీంతో ఇవాళ్టీ ఏపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది

Meghasandesam Serial Today Episode: హాస్పిటల్‌లో కేపీ దగ్గర ఉన్న భూమి, శారద దగ్గరకు అక్కడున్న నర్సు ఒకతన్ని తీసుకొచ్చి ఈయనే మీ మామ గారిని కాపాడి హాస్పిటల్‌కు తీసుకొచ్చింది అని చెప్పి వెళ్లిపోతుంది. దీంతో భూమి, శారద ఏడుస్తూ.. అతనికి దండం పెడతారు.
భూమి: పోలీస్ కేసు అవుతుందనో..ఇంకొటి అవుతుందనో దేనికీ భయపడకుండా హాస్పిటల్ లో జాయిన్ చేశారు. ఏం చేసినా మీ రుణం తీర్చుకోలేను..
వ్యక్తి: అయ్యో ఎందుకమ్మా అలా దండం పెడతారు. మీరు పెద్దొళ్లు దండం పెడుతుంటే.. మాకు ఇబ్బందిగా ఉంటుందమ్మా.. నా వల్ల ఓ ప్రాణం నిలబడింది అంటే అదే చాలమ్మ నాకు..
అని చెప్తుండగానే.. శారద తన చేతులకు ఉన్న బంగారం గాజులు తీసి అతనికి ఇస్తుంది.
శారద: ఇవి తీసుకోండి..
వ్యక్తి: వద్దమ్మా.. ఒక ప్రాణం కాపాడిన పుణ్యాన్ని నాకు దక్కనివ్వండి అమ్మా.. అది చాలు నాకు.. అమ్మా ఇదిగోండి అమ్మా మీ మామయ్య పడిపోయిన చోట ఇది దొరికింది అమ్మా.. వస్తానమ్మా..
అంటూ అతను వెళ్లిపోతాడు.. శారద ఏడుస్తూనే ఉంటుంది.
శారద: ఈ భూమ్మీద ఇంకా మంచితనం బతికే ఉందనడానికి వీళ్లే ఒక గొప్ప ఉదాహరణ అమ్మా..
భూమి: అవును అత్తయ్యా..
అని చెప్పగానే.. భూమికి ఫోన్ వస్తుంది. ఫోన్ మాట్లాడుతూ బయటకు వెళ్తుంది. భూమి బయట ఫోన్ మాట్లాడి లోపలికి వెళ్లబోతుంటే.. అప్పుడే అక్కడికి గగన్ కారులో వస్తాడు. గగన్‌ను చూసిన భూమి భయంతో అక్కడి నుంచి కనబడకుండా లోపలికి వెళ్లబోతుంది. ఇంతలో గగన్, భూమిని చూస్తాడు.
గగన్: ( మనసులో) భూమిలా ఉంది.. భూమే.. మరి నన్ను చూసి చూడనట్టు దొంగచాటుగా వెళ్తుంది ఏంటి..? అయినా భూమి ఇక్కడ ఉండటం ఏంటి..? అసలు ఏం చేసింది ఈ తైతక్క ఇక్కడ..?
అనుకుంటూ గగన్ స్పీడుగా నడుస్తూ భూమి దగ్గరకు వెళ్తాడు. వెనక నుంచి పిలుస్తాడు.
గగన్: ఏయ్ భూమి.. ఏయ్ భూమి నిన్నే…
భూమి: ( మనసులో) అయ్యో చూసేశాడు ఇప్పుడెలా తప్పించుకోవడం..
అని అనుకుంటుండగానే.. గగన్ దగ్గరకు వస్తాడు.
గగన్: ఏయ్ ఏంటి..? నన్ను చూసినా చూడనట్టు వెళ్తున్నావు.. పిలిచినా వినబడనట్టు నటిస్తున్నావు.. అసలు నువ్వు ఇక్కడేం చేస్తున్నావు..
భూమి: ఏంటి బావ.. నన్ను ఎప్పుడూ లేనిది ప్రేమగా భూమి అని పిలుస్తున్నావు..
గగన్: ప్రేమగా పిలుస్తున్నానా..? ఈ తైతక్క మాటలు ఆపేసి ముందు ఇక్కడికి ఎందుకొచ్చావో అది చెప్పు.. అంతే కానీ ఎక్స్‌ట్రాలు చేయకు..
భూమి: ఏం లేదు బావ నాకు తల తిరుగుతుంటే.. నాకు మోకాలు నొప్పి వచ్చింది బావ. అందుకే ఈ హాస్పిటల్‌కు వచ్చాను..
గగన్: నిజం చెప్పు అసలు ఎందుకొచ్చావు..?
భూమి: నాకు నిజంగానే హెల్త్ బాగాలేదు..
అని భూమి చెప్తుండగానే.. అక్కడికి నర్స్ ప్రిస్కిప్షన్ తో వస్తుంది.
నర్స్: ఈ ఇంజక్షన్ మీ మామయ్య కృష్ణ ప్రసాద్ గారికి అర్జెంట్‌గా ఇవ్వాలని డాక్టర్ గారు చెప్పారు.. ఇది ఇక్కడ లేదు.. బయట నుంచి తీసుకురండి మేడం..
అని నర్స్ చెప్పగానే.. భూమి షాక్ అవుతుంది. గగన్ కోపంగా చూస్తుంటాడు. కోపంగా లోపలికి వెళ్తుంటాడు. భూమి అడ్డు పడుతుంది. అయినా వినకుండా గగన్ కేపీ దగ్గరకు వెళ్తాడు. కేపీని బెడ్ మీద చూసి భూమిని కోపంగా చూస్తుంటాడు. ఇంతలో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!





















