అన్వేషించండి

Meghasandesam Serial Today October 18th: ‘మేఘసందేశం’ సీరియల్‌: భూమి ఒంట్లోకి వచ్చిన శోభాచంద్ర – అపూర్వను కొట్టిన శోభ

Meghasandesam Today Episode: భూమి ఒంట్లోకి వచ్చిన శోభ, కృష్ణప్రసాద్‌ సమక్షంలోనే పెళ్లి జరగాలని అపూర్వకు వార్నింగ్‌ ఇస్తుంది. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ చాలా ఆసక్తిగా జరిగింది.  

Meghasandesam Serial Today Episode:  గుడి నుంచి ఇంటికి వచ్చిన మీరా ఏడుస్తూ ప్రసాద్‌ వెళ్లిపోయాడు అని చెప్తుంది. ఇందును తీసుకెళ్లి ఆ శారదతో ఆశీర్వాదం ఇప్పిస్తున్నాడు అని అపూర్వ చెప్పడంతో.. శరత్‌ చంద్ర కోప్పడతాడు. మన మీరా కంటే ఆ ఉంచుకున్నదే ఎక్కువట అని లేనిపోనివి చెప్తుంది అపూర్వ. శారద కంటే నాకు మీరెవరూ ఎక్కువ కాదు అని శారదతను తీసుకుని వెళ్లిపోయాడు అంటుంది అపూర్వ.

చెర్రి: మా నాన్నా అన్ని మాటలు అన్నాడా? లేదు ఆయన అన్ని మాటలు అనడు.

అపూర్వ: నోరు ముయ్యరా.. నీకేం తెలుసు. ఈ ఇంట్లో ఏం మాట్లాడాలో తెలియకపోయినా ఆ శారద కనిపిస్తే చాలు మనిషే మారిపోతాడు. మాటలు మారిపోతాయి. బావ చివరికి నువ్వంటే కూడా లెక్కలేకుండా మాట్లాడాడు తెలుసా..?

మీరా: మళ్లీ మన ఇంటికి రానని వెళ్లిపోయాడు అన్నయ్యా.. ఆయన లేకపోతే ఇందు పెళ్లి ఎలా చేసేది.

అపూర్వ: అతను లేకపోతే ఏంటి పెళ్లి జరగదా? ఆ నమ్మకంతో ఆతను అంత ధైర్యంగా వెళ్లాడు.

బామ్మ: నిజమే కదమ్మా కన్నతండ్రి లేకుండా పెళ్లి ఎలా చేస్తారు. అయినా ఇన్నాళ్లు లేనిది ఇప్పుడు ఎందుకు అలా అంటాడు.

అపూర్వ: ఒళ్లు కొవ్వు పట్టి.. చా.. నేను కూడా ఇలా మాట్లాడుతున్నాను అంటే అతనెలా మాట్లాడాడో మీరే అర్థం చేసుకోండి బావ. వద్దు బావా ఆ కృష్ణ ప్రసాద్‌ లేకుండా పెళ్లి చేద్దాం. పెళ్లి చేస్తుంది మనమే కదా బావ. పీటల మీద కూర్చునేది మనమే కదా? అతను లేకపోయినా ఈ పెళ్లి జరుగుతుంది అని తెలిసేలా చేద్దాం.

భూమి: ఏం మాట్లాడుతున్నావే అపూర్వ..

అపూర్వ: ఏమే ఏం మాట్లాడుతున్నావే.. నన్ను పేరు పెట్టి పిలుస్తున్నావే..

భూమి: ఎవరే భూమి.. శోభాచంద్రను..  ఏం వాగుతున్నావే నా ఇంట్లో నా ఇంటి మేనకోడలుకు తండ్రి లేకుండా పెళ్లి చేస్తావా? అది నీకు కాదే నాకు అవమానం.

అపూర్వ: ఏయ్‌ భూమి ఎప్పుడో చనిపోయిన మా అక్క పేరు చెప్పి ఇలా నాటకం ఆడితే నమ్మేస్తాను అనుకుంటున్నావా?

భూమి: నోర్మూయ్‌..  ఈ లోకంలో లేను ఏం చేసినా రాను అనేగా నీ ధైర్యం. అందుకేగా నీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నావు.

 అంటూ అపూర్వను కొడుతుంది భూమి. అందరూ షాక్‌ అవుతారు.

భూమి: ఏంటి చంద్ర అది అలా ప్రవర్తిస్తుంటే నువ్వేం మాట్లాడవేం..

శరత్‌: శోబా…

అపూర్వ: బావ అది నన్ను కొట్టింది బావా..

శరత్‌: శోభే కదా? తప్పేముంది.

భూమి: కృష్ణప్రసాద్‌ నాకు దేవుడిచ్చిన అన్నయ్య అలాంటి అన్నయ్య లేకుండా ఇందు పెళ్లి చేయాలని చూస్తే నేను ఊరుకోను. అన్నయ్యను పిలిపించండి. ఆయన సమక్షంలో నే పెళ్లి జరిపించండి.

ఇందు: ఆయనొస్తే నేను ఈ పెళ్లి చేసుకోను ఆయన నాకు తండ్రే కాదు. ఆయన ఈ పెళ్లికి రావడం నాకు ఇష్టం లేదు.

భూమి: నోర్మూయ్‌.. అత్తయ్యకే ఎదురు మాట్లాడుతున్నావా? కన్నతండ్రినే వద్దంటున్నావా? ఏం మీరా ఇదేనా నీ పెంపకం.

మీరా: నా తప్పేం లేదు వదిన..

భూమి: దీన్ని ఇలా తయారు చేసింది నువ్వే కదా అపూర్వ.. అప్పుడు తన్నులు తినాల్సింది నువ్వు.  ( అని కొడుతుంది.)

అపూర్వ: బావ అది మళ్లీ కొట్టింది.

శరత్‌: నీ మీద కొపంతోనైనా శోభ వచ్చింది. మాట్లాడనివ్వు అపూర్వ.

బామ్మ: శోభమ్మా ఒంట్లోకి వచ్చి ఇంత బాధపడుతుందంటే చనిపోయాక కూడా ఎంత బాధపడుతుందో.. నువ్వు అనుకున్నవన్నీ చేయ్‌ అమ్మా..

భూమి: అన్నయ్య  ఎలాంటి వాడో నాకు తెలుసు. అలాంటి మనిషిని బాధపెడతారా? ఆ శారద వల్ల ఏం జరిగిందని ఎవరికి నష్టం జరిగిందని ఆవిడ గురించి మాట్లాడుతున్నారు. అన్నయ్యని ఆ ఇంటి నుంచి ఈ ఇంటికి తీసుకొచ్చి శారదకు అన్యాయం చేసింది ఎవరు..?  

అపూర్వ: బావా ఇది నటిస్తుంది. ఆ శారదని ఎలా వెనకేసుకొస్తుందో చూడు.

భూమి: ఏయ్‌ అపూర్వ మంచిని గౌరవించడం.. మంచిగా బతకడం నాకు అలవాటు. ఏం చంద్ర నా గురించి తెలియదని మాట్లాడుతుంది. నేను ఉన్నా లేకపోయినా ఇది నా ఇల్లు..

   అంటూ అపూర్వకు వార్నింగ్ ఇస్తుంది భూమి లోపల ఉన్న శోభాచంద్ర. నేను మళ్లీ వస్తా.. మళ్లీ మళ్లీ వస్తాను అంటూ వెళ్లిపోతుంది శోభాచంద్ర. ఇంతలో భూమి కిందపడిపోతుంది. చెర్రి నీళ్లు తీసుకొచ్చి ఇవ్వగానే మీరా తాగిస్తుంది. తర్వాత భూమి మెల్లగా కళ్లు తెరచి ఏం జరిగింది అని అడుగుతుంది. వదిన నీ ఒంట్లోకి వచ్చిందని మీరా చెప్తుంది. శరత్‌చంద్ర, శోభాచంద్ర ఫోటో చూస్తూ ఎమోషనల్‌ అవుతుంటాడు దీంతో  ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: ‘ప్రేమ ఎంత మధురం’ సీరియల్‌: రాకేష్‌ ను చంపబోయిన రాజనందిని ఆత్మ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KCR: తెలంగాణ తల్లి కొత్త విగ్రహం - కాంగ్రెస్ ప్రభుత్వానిది మూర్ఖపు చర్యంటూ కేసీఆర్ తీవ్ర ఆగ్రహం
తెలంగాణ తల్లి కొత్త విగ్రహం - కాంగ్రెస్ ప్రభుత్వానిది మూర్ఖపు చర్యంటూ కేసీఆర్ తీవ్ర ఆగ్రహం
Rains: అల్పపీడన ప్రభావం - ఈ నెల 15 వరకూ ఈ జిల్లాల్లో వర్షాలు, అధికారులకు సీఎం కీలక ఆదేశాలు
అల్పపీడన ప్రభావం - ఈ నెల 15 వరకూ ఈ జిల్లాల్లో వర్షాలు, అధికారులకు సీఎం కీలక ఆదేశాలు
WhatsApp Message Reminder: ‘బాబూ... మెసేజ్ ఓపెన్ చేయడం మర్చిపోయావ్’ - వాట్సాప్‌లో రానున్న కొత్త ఫీచర్ ఇదే!
‘బాబూ... మెసేజ్ ఓపెన్ చేయడం మర్చిపోయావ్’ - వాట్సాప్‌లో రానున్న కొత్త ఫీచర్ ఇదే!
Special Trains: శబరిమల భక్తులకు గుడ్ న్యూస్ - జనవరిలో 34 ప్రత్యేక రైళ్లు, ఆ రూట్లు ఇవే!
శబరిమల భక్తులకు గుడ్ న్యూస్ - జనవరిలో 34 ప్రత్యేక రైళ్లు, ఆ రూట్లు ఇవే!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఆ ఊళ్లోనే పెద్దపులి తిష్ట! డ్రోన్లతో గాలింపుభారత్ ఘోర ఓటమి ఆసిస్ సిరీస్ సమంరైతులకు నో ఎంట్రీ, రోడ్లపై ఇనుప మేకులు, బోర్డర్‌లో భారీ బందోబస్తుసప్తవర్ణ శోభితం, శ్రీపద్మావతి అమ్మవారి పుష్పయాగం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KCR: తెలంగాణ తల్లి కొత్త విగ్రహం - కాంగ్రెస్ ప్రభుత్వానిది మూర్ఖపు చర్యంటూ కేసీఆర్ తీవ్ర ఆగ్రహం
తెలంగాణ తల్లి కొత్త విగ్రహం - కాంగ్రెస్ ప్రభుత్వానిది మూర్ఖపు చర్యంటూ కేసీఆర్ తీవ్ర ఆగ్రహం
Rains: అల్పపీడన ప్రభావం - ఈ నెల 15 వరకూ ఈ జిల్లాల్లో వర్షాలు, అధికారులకు సీఎం కీలక ఆదేశాలు
అల్పపీడన ప్రభావం - ఈ నెల 15 వరకూ ఈ జిల్లాల్లో వర్షాలు, అధికారులకు సీఎం కీలక ఆదేశాలు
WhatsApp Message Reminder: ‘బాబూ... మెసేజ్ ఓపెన్ చేయడం మర్చిపోయావ్’ - వాట్సాప్‌లో రానున్న కొత్త ఫీచర్ ఇదే!
‘బాబూ... మెసేజ్ ఓపెన్ చేయడం మర్చిపోయావ్’ - వాట్సాప్‌లో రానున్న కొత్త ఫీచర్ ఇదే!
Special Trains: శబరిమల భక్తులకు గుడ్ న్యూస్ - జనవరిలో 34 ప్రత్యేక రైళ్లు, ఆ రూట్లు ఇవే!
శబరిమల భక్తులకు గుడ్ న్యూస్ - జనవరిలో 34 ప్రత్యేక రైళ్లు, ఆ రూట్లు ఇవే!
Sandhya Theater Stampede: సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన - ముగ్గురిని అరెస్ట్ చేసిన పోలీసులు, కోలుకుంటోన్న బాలుడు
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన - ముగ్గురిని అరెస్ట్ చేసిన పోలీసులు, కోలుకుంటోన్న బాలుడు
Mahindra BE 6e Vs Tata Curvv EV: నెక్సాన్ వర్సెస్ కర్వ్ వర్సెస్ బీఈ 6ఈ - మూడు ఎలక్ట్రిక్ కార్లలో ఏది బెస్ట్!
నెక్సాన్ వర్సెస్ కర్వ్ వర్సెస్ బీఈ 6ఈ - మూడు ఎలక్ట్రిక్ కార్లలో ఏది బెస్ట్!
Bapatla Accident: ఏపీలో తీవ్ర విషాదం - టిప్పర్ లారీ ఢీకొని ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి
ఏపీలో తీవ్ర విషాదం - టిప్పర్ లారీ ఢీకొని ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి
Actor Manchu Manoj: బంజారాహిల్స్ ఆస్పత్రికి నటుడు మంచు మనోజ్ - నడవడానికి ఇబ్బంది పడుతూ వ్యక్తి సాయంతో.. వీడియో వైరల్
బంజారాహిల్స్ ఆస్పత్రికి నటుడు మంచు మనోజ్ - నడవడానికి ఇబ్బంది పడుతూ వ్యక్తి సాయంతో.. వీడియో వైరల్
Embed widget