Prema Entha Madhuram Serial Today October 17th: ‘ప్రేమ ఎంత మధురం’ సీరియల్: రాకేష్ ను చంపబోయిన రాజనందిని ఆత్మ - అయోద్యపురం వెళ్లడానిక గౌరి రెడీ
Prema Entha Madhuram Today Episode: శంకర్ ఎలాగైనా చంపాలని అనుకుంటూ రాజనందని రూంలోకి వెళ్లిన రాకేష్‌న ఆత్మ చంపబోతుంది. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది.
Prema Entha Madhuram Serial Today Episode: అభయ్ వాళ్ల ఇంటికి వచ్చిన రాకేష్ తన మీద అనుమానం రాకుండా శంకర్ ను ఎలా చంపాలా? అని ఆలోచిస్తూ రాజనందిని రూంలోకి వెళ్తాడు. అక్కడ రాజనందిని ఫోటో చూసి భయపడతాడు. ఫోటో రాకేష్ మీద పడుతుంది. కింద పడి బాధపడుతున్న రాకేష్‌ను అభయ్ చూసి వచ్చి పైకి లేపుతాడు. ఫోటోను గోడకు తగిలిస్తాడు.
అభయ్: నువ్వు ఈ గదిలోకి ఎందుకు వచ్చావు. ఆసలు ఈ ఫోటో ఎలా పడింది.
రాకేష్: అది డోర్ ఓపెన్ చేసి ఉంటే ఏంటో అని చూస్తూ ఇలా వచ్చాను. ఫోటో చూస్తూ ఉండగా సడెన్ గా పడిపోయింది. అది ఎలా జరిగిందో తెలియడం లేదు.
అభయ్: సర్వెంట్స్ ఎవరో రూం క్లీన్ చేయడానికి తీసి లాక్ చేయడం మర్చిపోయి ఉంటారు. నీకెప్పుడూ చెప్పలేదు కదూ ఈవిడ మా పెద్దమ్మ రాజనందిని గారు.
రాకేష్: రాజనందిని పెద్దమ్మా..
అభయ్: అవును రాకేష్. తను మా నాన్నగారి ఫస్ట్ వైఫ్. యాక్సిడెంట్ లో చనిపోయారు. తర్వాత చాలా ఏళ్లకు నాన్నగారు అమ్మను పెళ్లి చేసుకున్నారు. మా అమ్మైనా కొంచెం ఇన్నోసెంట్ కానీ మా పెద్దమ్మా చాలా డేరింగ్ అండ్ డాషింగ్ అని విన్నాను. మా నాన్న జోలికి వస్తే మాత్రం ప్రాణం తీసేంత కోపం వస్తుందట తనకి. డాడీని అంతగా ప్రేమించేదట. నీకో ఇంకో వండర్ చెప్పనా..? ఇప్పటికీ మా పెద్దమ్మ మా కుటుంబాన్ని కాపాడుతుందట.
అని అభయ్ చెప్పగానే రాకేష్ షాక్ అవుతాడు. తను గురించి చెప్పాలంటే చాలా స్టోరీ ఉంది. టైం వచ్చిన్నప్పుడు చెప్తానులే రా అని అభయ్ అక్కడి నుంచి వెళ్లిపోతాడు. మరోవైపు అకి, జెండే తమ సొంత ఊరుకు వెళ్తున్నామని మిమ్మల్ని తీసుకెళ్దామని వచ్చాం అని జెండే చెప్తాడు.
శంకర్: అవునా అయ్యో మాకు రావడం కుదరదు అండి.
అకి: మా ఊరు చాలా బాగుంటుందండి. మీకు తప్పకుండా నచ్చుతుంది.
శంకర్: అది కాదు అకి మేము వేరే ఊరు వెళ్తున్నాం. అదే నా దగ్గర పని చేస్తాడు కదా శ్రీను వాడి పెళ్లికి వెళ్తున్నాం.
జెండే: ఇంతకీ ఏ ఊరుకు వెళ్తున్నారు శంకర్.
శంకర్: అది ఆ ఊరి పేరు ఆయోధ్యపురం సార్
అకి, జెండే షాక్ అవుతారు. జోగమ్మ చెప్పిన మాటలు గుర్తు చేసుకుంటారు.
శంకర్: అదేంటి సార్ అలా చూస్తున్నారు.
జెండే: ఏం లేదు శంకర్ మా ఊరు కూడా అయోద్యపురమే..
శంకర్: అవునా.. ఏంటోనండి ఈ మధ్యన అంతా కో ఇన్సిడెంటల్ గా ఇవే జరుగుతున్నాయి.
అకి: అవునండి ఇంతకీ గౌరి గారు కూడా వస్తున్నారు కదా?
శంకర్: ఆ లేదు అకి.. అడిగిన వెంటనే వస్తే ఆవిడ గౌరి ఎందుకు అవుతుంది.
అకి: అవునా అందరం కలిసి వెళ్తేనే కదా? బాగుంటుంది. ఎలాగైనా సరే ఒప్పించాల్సింది.
అంటూ గౌరి గారిని నేను ఒప్పిస్తాను అని చెప్పి లోపలికి వెళ్తుంది అకి. అయోద్యపురం పేరు ఉంటేనే నాకు తెలయని బలం వచ్చినట్టు అనిపిస్తుందని చెప్తాడు శంకర్. దీంతో శంకర్ షాక్ అవుతాడు. లోలికి వెళ్లిన అకి మాది కూడా అదే ఊరు అని గౌరికి చెప్పగానే షాక్ అవుతుంది. గతజన్మలో జరిగిన విషయాలు గుర్తుచేసుకుంటుంది. మరోవైపు శంకర్ కూడా అలాగే గుర్తు చేసుకుంటుంటాడు. రాకేష్ జలంధర్ ఫోటో ముందు నిలబడి నీ శత్రువును మళ్లీ చంపేయబోతున్నాను అంటాడు. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: ‘జగధాత్రి’ సీరియల్: మీనన్‌కు పట్టుబడ్డ జేడీ – కౌషకి కడుపు పోగొట్టేందుకు నిషిక ప్లాన్