అన్వేషించండి

Jagadhatri Serial Today October 17th: ‘జగధాత్రి’ సీరియల్‌: మీనన్‌కు పట్టుబడ్డ జేడీ – కౌషకి కడుపు పోగొట్టేందుకు నిషిక ప్లాన్‌  

Jagadhatri Today Episode:   కౌషికి కడుపు పోగొటేందుకు నిసిక బొప్పాయి జ్యూస్ తయారు చేసి కౌషికి చేత తాగించమని వైజయంతికి ఇస్తుంది. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ చాలా ఆసక్తిగా జరిగింది.

Jagadhatri  Serial Today Episode:  లోపల మీనన్‌, టోనీ బంధువులతో మాట్లాడుతుంటారు. ధాత్రి, కేదార్‌లను అభి లోపలికి తీసుకెళ్తాడు. సేఫ్‌ ఫేస్ లోకి వెళ్లిన ధాత్రి, కేదార్‌, అభి తాము ఏం చేయాలని ఆలోచిస్తారు. ఆరాధ్యను ఎక్కడ దాచి ఉంటారని ఆలోచిస్తారు. జేడీ ఫామ్‌ హౌస్‌ బ్లూ ప్రింట్‌ వేస్తుంది. ఆరాధ్యను పార్కింగ్‌ ప్లేస్ లో దాచి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేస్తుంది. ధాత్రి. అభిని పార్కింగ్‌ దగ్గరకు వెళ్లి కార్లన్నీ చెక్‌ చేయమని చెప్తుంది.

ధాత్రి: ఖదీర్‌ మీనన్‌ తమ్ముడు ఎక్కడున్నాడు.

ఖదీర్‌: రండి మేడం చూపిస్తాను.. అదిగోండి మీనన్‌ తమ్ముడు అతనే

కేదార్‌: ఈ టోనీ మీనన్‌ తమ్ముడా..?

 ధాత్రి: అంటే మత్తు పదార్థాలు పంపిచింది యువరాజ్‌ జిమ్ముకేనా..? యువరాజ్‌ ఇదంతా తెలిసే చేశాడన్నమాట. అయితే వీళ్లందరి లెక్కలు సరి చేయాలి కేడీ.

రౌడీ: ఏయ్‌ ఇక్కడేంటి.. ఇక్కడేం చేస్తున్నారు మీరు. రేయ్‌ వీళ్లతో నీకు మాటలేంటి? అక్కడ భాయ్‌ ని చూపించి ఏం చెప్తున్నావు.

ధాత్రి: సార్‌ ఏ తప్పు చేసినా క్షమించరని వచ్చిన వాళ్లందరూ చాలా పెద్దవాళ్లు ఓళ్లు దగ్గర పెట్టుకుని పని చేయమని చెప్తున్నారు.

కేదార్: నిద్ర లేచినప్పటి నుంచి ఇదే పని మీద ఉంటాము. ఎవరికీ ఏ సమస్య రాకుండా చూసుకుంటామని చెప్తున్నాము అయ్యా..

రౌడీ: ఇక్కడి నుంచి వెళ్లండి. వెళ్లి భాయ్‌ వాళ్ల చుట్టాలకు ఏం కావాలో చూడండి.

ధాత్రి: అలగేనయ్యా..

 రౌడీ: రేయ్‌ వాళ్లతో నీకేంటిరా మాటలు. ఇక్కడి నుంచి వెళ్లిపో..

ధాత్రి, కేదార్‌ పక్కకు వెళ్లిపోతారు. ఇంతలో హలో అనుకుంటూ మీనన్‌ వస్తాడు. నిన్ను ఎక్కడో చూసినట్టు ఉంది అంటాడు. నన్నా నన్ను ఎక్కడ చూసి ఉంటారు సార్‌ అని అడుగుతుంది. టోని వచ్చి అక్కడ అతిథులకు ఏం కావాలో చూడండి అని చెప్పగానే ధాత్రి, కేదార్‌ వెళ్లబోతుంటే ఒకసారి నీ మాస్క్‌ తీయ్‌ నీ ముఖం చూడాలి అంటాడు. దీంతో ధాత్రి.. తనకు దగ్గు జలుబు ఉందని చెప్పగానే అయినా పర్వాలేదు తీయ్‌ అంటాడు మీనన్‌. ధాత్రి అలాగే ఉండిపోతుంది. మీనన్‌ మాస్క్‌ తీయబోతుంటే అభి పరుగెత్తుకొచ్చి భాయ్‌ అక్కడెవరో అనుమానంగా ఉన్నారు. జేడీ కావొచ్చు అని చెప్తాడు. దీంతో మీనన్‌, టోని వెళ్లిపోతారు.  మరోవైపు ఇంట్లో ఎవరి పనుల్లో వాళ్లు సైలెంట్‌ గా ఉంటారు.

బూచి: కాచి ఇల్లంతా ఎందుకో బోసి పోయినట్లు అనిపిస్తుంది.

కాచి: కదా ఒక కొట్లాట లేదు. ఒక గొడవ లేదు.

బూచి: ఆఫీసు గొడవ అయినప్పటి నుంచి నిషిక కూడా చాలా సైలెంట్‌ అయిపోయింది కదా? పద ఒక నిప్పు అంటింద్దాం. ( నిషిక దగ్గరకు వెళ్తారు) హలో పెత్తనం కావాలి. కుర్చీ కావాలి అని అందని దానికి పోయి ఇంట్లో ఉన్న మర్యాదనంతా పొగొట్టుకున్నావు.

కాచి: ఇప్పుడు చూడండి. మన కళ్లముందే మనకు అన్యాయం జరుగుతున్నా..? మనల్ని వాళ్లు డైరెక్టుగా మోసం చేస్తున్నా ఏమీ చేయలేం. ఏమీ అనలేం.

వైజయంతి: మీరు దేని గురించి మాట్లాడుతున్నారో నాకు రవ్వంత కూడా అర్థం కావడం లేదు.

నిషిక: వదిన ప్రెగ్నెన్సీ గురించి మాట్లాడుతున్నారు అత్తయ్యా

బూచి: అబ్బా ఏం క్రిమినల్‌ బ్రెయిన్‌ సిస్టర్‌ నీది.. ఇట్టా చెప్పగానే అట్టా పట్టేశావు.

వైజయంతి: ఈ గొడవల్లో పడి అసలు విషయం మర్చిపోయాము అమ్మీ. కౌషికికి గర్భం ఇంకా అలాగే ఉందన్న అనుమానం ఇంకా తీరనే లేదు కదూ

నిషిక: నేను ఏదీ మర్చిపోలేదు అత్తయ్య. జగధాత్రి పక్కన లేనప్పుడు తేల్చుకుందామనుకున్నాను.

బూచి: అమ్మ దొంగ ముఖం దానా.. మౌనంగా ఉంటే మాట పడ్డావు కదా అలా ఉన్నావు అనుకున్నాను

 అని అనడంతో అందరూ కోపంగా చూస్తుంటారు. ఎందుకు అలా చూస్తున్నారు అని అడుగుతాడు బూచి. నువ్వు మనసులో అనుకోవాల్సిన దాన్ని బయటకు అన్నావని కాచి చెప్పగానే బూచి షాక్ అవుతారు. తర్వాత కౌషికి కడుపు పోగొట్టేందుకు బొప్పాయి ఆకుల జ్యూస్‌ ఇవ్వాలని ప్లాన్‌ చేస్తారు. వైజయంతి తీసుకెళ్లి ఆ జ్యూస్‌ ఇస్తుంది. కౌషికి జ్యూస్‌ తాగుతుంటే కీర్తి చేతిలో బాల్‌ వచ్చి తగలడంతో జ్యూస్‌ కిందపడిపోతుంది. మరోవైపు ధాత్రి వాళ్లు ఎంత వెతికినా ఆరాధ్య అచూకీ లభించదు. దీంతో ఇవాల్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: ‘బ్రహ్మముడి’ సీరియల్‌:   కావ్యను ఒప్పించిన రాజ్‌ – నిజం తెలుసుకున్న రుద్రాణి

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Group 2 Exams: తెలంగాణలో గ్రూప్ 2 పరీక్షలు ప్రారంభం - పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్
తెలంగాణలో గ్రూప్ 2 పరీక్షలు ప్రారంభం - పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్
Atul Subhash Case: బెంగుళూరు టెకీ ఆత్మహత్య కేసులో కీలక పరిణామం - అతుల్ భార్య అరెస్ట్
బెంగుళూరు టెకీ ఆత్మహత్య కేసులో కీలక పరిణామం - అతుల్ భార్య అరెస్ట్
Special Trains: శబరిమల అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - విజయవాడ నుంచి ప్రత్యేక రైళ్లు, పూర్తి వివరాలివే!
శబరిమల అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - విజయవాడ నుంచి ప్రత్యేక రైళ్లు, పూర్తి వివరాలివే!
Hyderabad News: 14 ఏళ్ల పోరాటం - ఆ కుటుంబానికి రూ.1.99 కోట్ల పరిహారం
14 ఏళ్ల పోరాటం - ఆ కుటుంబానికి రూ.1.99 కోట్ల పరిహారం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

నేను బాగున్నా, చట్టాన్ని గౌరవిస్తా, రేవతి ఫ్యామిలీకి నేనెప్పుడూ అండగా ఉంటాప్రభుత్వం చేసిన పెద్ద కుట్ర, అల్లు అర్జున్ అరెస్ట్చంపుతరా.. చంపండి.. బన్నీ కోసం జైల్లోకి దూకిన ఫ్యాన్చంచల్ గూడ జైలుకి అల్లు అర్జున్ తరలింపు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Group 2 Exams: తెలంగాణలో గ్రూప్ 2 పరీక్షలు ప్రారంభం - పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్
తెలంగాణలో గ్రూప్ 2 పరీక్షలు ప్రారంభం - పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్
Atul Subhash Case: బెంగుళూరు టెకీ ఆత్మహత్య కేసులో కీలక పరిణామం - అతుల్ భార్య అరెస్ట్
బెంగుళూరు టెకీ ఆత్మహత్య కేసులో కీలక పరిణామం - అతుల్ భార్య అరెస్ట్
Special Trains: శబరిమల అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - విజయవాడ నుంచి ప్రత్యేక రైళ్లు, పూర్తి వివరాలివే!
శబరిమల అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - విజయవాడ నుంచి ప్రత్యేక రైళ్లు, పూర్తి వివరాలివే!
Hyderabad News: 14 ఏళ్ల పోరాటం - ఆ కుటుంబానికి రూ.1.99 కోట్ల పరిహారం
14 ఏళ్ల పోరాటం - ఆ కుటుంబానికి రూ.1.99 కోట్ల పరిహారం
CM Chandrababu: 'సార్.. ఒక్క ఫోటో ప్లీజ్' - సీఎం చంద్రబాబుకు బాలిక రిక్వెస్ట్, ఆయన ఏం చేశారంటే?
'సార్.. ఒక్క ఫోటో ప్లీజ్' - సీఎం చంద్రబాబుకు బాలిక రిక్వెస్ట్, ఆయన ఏం చేశారంటే?
Vajedu SI Suicide Case: వాజేడు ఎస్సై హరీష్ ఆత్మహత్యకు కారణమైన మహిళ అరెస్ట్
వాజేడు ఎస్సై హరీష్ ఆత్మహత్యకు కారణమైన మహిళ అరెస్ట్
Bigg Boss 8 Telugu Finale LIVE: బిగ్ బాస్ 8 గ్రాండ్ ఫినాలే... చీఫ్ గెస్ట్ ఫిక్స్, విన్నర్ అతడే - ఇంకేం జరుగుతుంది? లైవ్ అప్డేట్స్ దేఖో
బిగ్ బాస్ 8 గ్రాండ్ ఫినాలే... చీఫ్ గెస్ట్ ఫిక్స్, విన్నర్ అతడే - ఇంకేం జరుగుతుంది? లైవ్ అప్డేట్స్ దేఖో
Chandrababu About NTR: మనం చూసిన ఏకైక యుగ పురుషుడు ఎన్టీఆర్, ఆయన రూపంలో దేవుడ్ని చూశాం - సీఎం చంద్రబాబు
మనం చూసిన ఏకైక యుగ పురుషుడు ఎన్టీఆర్, ఆయన రూపంలో దేవుడ్ని చూశాం - సీఎం చంద్రబాబు
Embed widget