అన్వేషించండి

chinni serial today march 4th: చిన్ని సీరియల్: నాగవల్లి ప్లాన్ తిప్పికొట్టిన చిన్ని! నెలరోజుల్లోనే శ్రేయ పెళ్లి జరుగుతుందా! అదిరిపోయిన ఛాలెంజ్!

chinni serial today episode march 4th శ్రేయ పెళ్లి చూపులు క్యాన్సిల్ అవ్వడం.. చిన్ని వచ్చి మ్యాడీ మనసు మార్చితే బాగోదు అని నాగవల్లికి వార్నింగ్ ఇవ్వడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Chinni Serial Today Episode: శ్రేయకి పెళ్లి చూపులు ఏర్పాటు చేస్తారు. అబ్బాయికి శ్రేయ బాగా నచ్చుతుంది. మీ అమ్మాయికి అబ్బాయి నచ్చాడా అని అడిగితే మా అమ్మాయికి అడగాల్సిన అవసరం లేదు.. మా మాటే తన మాట అని నాగవల్లి చెప్తుంది. ఇక మినిస్టర్ వస్తే ఫైనల్ చేద్దాం అని పెళ్లి వాళ్లు అనుకుంటారు. ఇంతలో మ్యాడీ కూడా అక్కడికి వస్తాడు. మ్యాడీ మెట్లు దిగుతూ పడిపోబోతే శ్రేయ పరుగున వెళ్లి పట్టుకుంటుంది. అందరూ చూస్తారు. తర్వాత పెళ్లి వాళ్లకి ఫోన్ వస్తుంది. దాంతో వాళ్లు షాక్ అయి నాగవల్లి వాళ్లతో బావని ప్రేమించి నిశ్చితార్థం కూడా చేసుకున్న పిల్లని వదిలించుకోవాలని మాకు అంటగట్టాలి అనుకుంటున్నారా.. మాకు ఈ సంబంధం వద్దు అని వెళ్లిపోతారు.

శ్రేయ ఏడుస్తుంటే నాగవల్లి ఓదార్చుతుంది. ఈ పెళ్లి కాకపోతే ఇంకో పెళ్లి చేస్తా అంటుంది. వసంత నాగవల్లితో బావని ప్రేమించినందుకు అది దాన్ని కన్నందుకు నేను ఈ పరిస్థితి వచ్చినందుకు చావాలా అని అడుగుతుంది. దానికి నాగవల్లి మ్యాడీతో మీ అత్త అడుగుతున్న ప్రశ్నకి సమాధానం చెప్పునాన్న.. జీవితాంతం శ్రేయ ఇలా పెళ్లి పెటాకులు లేకుండా ఉండిపోవాలా.. లేదంటే తన మెడలో పసుపు తాడు పడే మార్గం ఉంది అంటావా చెప్పు అని అంటుంది. ఇంతలో చప్పట్లు కొడుతూ మధు అక్కడికి వస్తుంది. అందరూ మధుని చూసి షాక్ అయిపోతారు. సూపర్ మీ ప్లాన్ అదిరిపోయింది అత్తయ్యా అని అంటుంది. ఏం మాట్లాడుతున్నావ్ అని నాగవల్లి అంటే శ్రేయకి ఇక పెళ్లి అవ్వదు అన్నట్లు క్రియేట్ చేసి మ్యాడీ నోట శ్రేయని పెళ్లి చేసుకుంటా అన్నట్లు చేయాలి అనుకుంటున్నావ్ కదా అంటుంది. దానికి నాగవల్లి పిచ్చి పిచ్చిగా మాట్లాడకు.. నాటకాలు చేసింది నువ్వు చిన్నిగా వాడిని మోసం చేసి పెళ్లి చేసుకుంది నువ్వు అని అంటుంది. ఇప్పుడు మీరే నాటకం ఆడారు అని చిన్ని అంటుంది. మా అమ్మ ఎందుకు నాటకం ఆడుతుంది. నేను శ్రేయని పెళ్లి చేసుకోను అని మా అమ్మకి బాగా తెలుసు.. నాకు శ్రేయకి అస్సలు పెళ్లి చేయాలి అనుకోదు.. ఈ సంబంధం కాకపోతే ఇంత కంటే మంచి సంబంధం చూసి శ్రేయకి పెళ్లి చేస్తుంది. అవసరం అయితే నేను దగ్గరుండి మంచి సంబంధం చూస్తా కానీ నేను మాత్రం శ్రేయని పెళ్లి చేసుకోను అని అంటాడు.

చిన్ని మనసులో నాకు కావాల్సింది ఇదే బాబు అనుకుంటుంది. ఇక నాగవల్లి మనసులో మ్యాడీ మనసు మార్చే టైంకి వచ్చేసింది.. అసలు నేను ఈ పెళ్లి చూపులు ఏర్పాటు చేసిందే మ్యాడీ మనసు మార్చేయడానికి అనుకుంటుంది. ఇక మ్యాడీ మధుతో అసలు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావ్. నీకు ఏంటి సంబంధం అని అంటే నేను ఈ ఇంటి కోడల్ని నా మెడలో తాళి ఉన్నంత వరకు మ్యాడీ భార్యనే.. ఈ ఇంటి కోడల్నే అని అంటుంది. మా అత్తింటి వాళ్లు నా భర్త విషయంలో కుట్ర చేయాలి అనుకుంటే ఆయన భార్యగా వచ్చే అధికారం నాకు ఉంది అని అంటుంది. కుట్ర చేయాల్సిన అవసరం నాకు లేదు.. నెల రోజుల్లో మంచి సంబంధం చూసి అంగరంగ వైభవంగా పెళ్లి చేస్తా చూస్తూ ఉండు అని అంటుంది. మీరు నిజంగానే శ్రేయకి వేరే వ్యక్తితో పెళ్లి చేస్తే మీరు నాటకం ఆడలేదు అని ఒప్పుకుంటా.. మీ అబ్బాయి నమ్మకం కరెక్టే అని ఒప్పుకుంటా.. అందరి ముందు మీకు సారీ చెప్తా వస్తా అత్తయ్యా అని బాయ్‌ శ్రీవారు అని మ్యాడీకి చెప్పి వెళ్లిపోతుంది. 

చిన్ని దగ్గరకు నాగవల్లి వెళ్లి నా శత్రువుగా నువ్వు నాకు నచ్చావే.. నువ్వు చాలా స్మార్ట్ అని అంటుంది. శ్రేయకి మ్యాడీకి పెళ్లి చేయాలి అనే ఈ పెళ్లి చూపులు ఏర్పాటు చేశా కానీ నువ్వు వచ్చి వాడే దగ్గరుండి వేరే పెళ్లి చేస్తా అన్నట్లు వాడి మనసు మార్చేశావ్. ఈ ప్లాన్ పని చేయకపోయినా శ్రేయని వాడు పెళ్లి చేసుకునే వరకు నా ప్రయత్నాలు చేస్తూనే  ఉంటా అని నాగవల్లి అంటుంది. మ్యాడీకి నా మీద కోపమే కాదు ప్రేమ కూడా ఉంది.. చిన్నిగా నా మీద ప్రేమ ఉంది.. మధు మీద కూడా ఉంది.. కోపం మాత్రం చిన్ని మీద మాత్రమే ఉంది.. కోపం కంటే ప్రేమే ఎక్కువ ఉంది. ఏదో ఒక రోజు ప్రేమ కోప్పాన్ని తగ్గిస్తుంది. అప్పుడు మ్యాడీనే నా దగ్గరకు వచ్చి సారీ చెప్పి నన్ను తీసుకొస్తాడు.. అప్పటి వరకు భాయ్ అత్తా అని చెప్పి వెళ్లిపోతుంది. 

నాగవల్లి లోహిత దగ్గరకు వెళ్లి పెళ్లి చూపుల విషయం మధుకి ఎలా తెలిసింది అని అడుగుతుంది. దాంతో లోహిత శ్రేయ పెళ్లి చూపుల విషయం ఇంట్లో వాళ్లకి తప్ప బయట వాళ్లకి తెలీదు కదా మరి చిన్ని కి ఎలా తెలిసింది.. మనం ఎవరూ చెప్పం కదా దానికి ఎలా తెలిసింది అని అంటుంది. నాగవల్లి ఆలోచిస్తుంది. మరోవైపు చిన్ని ప్రమీలకు కాల్ చేసి విషయం చెప్పినందుకు థ్యాంక్స్ అని చెప్తుంది. ప్రమీల చిన్నితో మాట్లాడుతూ ఉంటే నాగవల్లి అక్కడికి వెళ్తుంది. నాగవల్లి ప్రమీలతో ఏంటి పెద్దక్కాయ్ ఇది ఏంటి చేస్తున్నావ్.. నువ్వు చేస్తుంది కరెక్ట్ కాదు.. చిన్నికి సాయం చేయడం కరెక్ట్ కాదు.. నీ అమాయకత్వంతో ఇంట్లో విషయాలు తనకు చెప్పొద్దు,.. గుర్తు పెట్టుకో అని అంటుంది. ఇక చిన్ని స్వప్నకి విషయం చెప్పి మాట్లాడుతుంది. మ్యాడీ నిన్ను నమ్మి నీ దారిలోకి వస్తాడా అని స్వప్న అడిగితే కచ్చితంగా వస్తాడు అని మధు అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.

టాప్ హెడ్ లైన్స్

Lenin TV Premiere Date : బుల్లితెరపై అయ్యగారు వచ్చేస్తున్నారు - అఖిల్ అక్కినేని లెనిన్ టీవీల్లోకి వచ్చేది ఎప్పుడంటే?
బుల్లితెరపై అయ్యగారు వచ్చేస్తున్నారు - అఖిల్ అక్కినేని లెనిన్ టీవీల్లోకి వచ్చేది ఎప్పుడంటే?
Nuvvu leka Neanu Lenu Serial Today Aug 21th:రాధపై హత్యాయత్నం చేసిన చిట్టినేనని తెలుసుకున్న విక్కీ...నిలదీసిన విక్కీకి సుందరి ఏం చెప్పింది...?
నువ్వులేక నేను లేను:రాధపై హత్యాయత్నం చేసిన చిట్టినేనని తెలుసుకున్న విక్కీ...నిలదీసిన విక్కీకి సుందరి ఏం చెప్పింది...?
Podarillu Serial Today August 21th:దుర్గాప్రసాద్‌ బారీ నుంచి తండ్రిని కాపాడుకున్న కొడుకులు...అన్నదమ్ములకు తెలిసిన నిజం ఏంటి..?
పొదరిల్లు:దుర్గాప్రసాద్‌ బారీ నుంచి తండ్రిని కాపాడుకున్న కొడుకులు...అన్నదమ్ములకు తెలిసిన నిజం ఏంటి..?
Gundeninda Gudigantalu August 21th:షోరూమ్‌కు వెళ్లేందుకు రోహిణి వేసిన ఎత్తులేంటి..? ప్రభావతి ఎలా ఒప్పుకుంది..?
గుండెనిండా గుడిగంటలు:షోరూమ్‌కు వెళ్లేందుకు రోహిణి వేసిన ఎత్తులేంటి..? ప్రభావతి ఎలా ఒప్పుకుంది..?

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Konda Surekha: తెలంగాణ మంత్రి కొండా సురేఖపై కాంగ్రెస్ ఎమ్మెల్యేల తిరుగుబాటు! బర్తరఫ్‌ చేయాలని డిమాండ్!
తెలంగాణ మంత్రి కొండా సురేఖపై కాంగ్రెస్ ఎమ్మెల్యేల తిరుగుబాటు! బర్తరఫ్‌ చేయాలని డిమాండ్!
KTR Comments on Voters: ఇప్పటికీ ప్రజలే తప్పు చేశారంటున్న కేటీఆర్ - ఇది రాజకీయ వ్యూహమా? ప్రజల్ని కించపర్చడమా?
ఇప్పటికీ ప్రజలే తప్పు చేశారంటున్న కేటీఆర్ - ఇది రాజకీయ వ్యూహమా? ప్రజల్ని కించపర్చడమా?
Irumudi Review - 'ఇరుముడి' రివ్యూ: సెంటిమెంట్‌తో కొట్టిన రవితేజ... మాస్ కాదు, ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా ఎలా ఉందంటే?
'ఇరుముడి' రివ్యూ: సెంటిమెంట్‌తో కొట్టిన రవితేజ... మాస్ కాదు, ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా ఎలా ఉందంటే?
ED Raids On YSRCP MP Avinash Reddy: వైసీపీ ఎంపీ అవినాష్‌ రెడ్డి సహా పది మంది నివాసాల్లో ఈడీ ఆకస్మిక తనిఖీలు!
వైసీపీ ఎంపీ అవినాష్‌ రెడ్డి సహా పది మంది నివాసాల్లో ఈడీ ఆకస్మిక తనిఖీలు!
Lenin TV Premiere Date : బుల్లితెరపై అయ్యగారు వచ్చేస్తున్నారు - అఖిల్ అక్కినేని లెనిన్ టీవీల్లోకి వచ్చేది ఎప్పుడంటే?
బుల్లితెరపై అయ్యగారు వచ్చేస్తున్నారు - అఖిల్ అక్కినేని లెనిన్ టీవీల్లోకి వచ్చేది ఎప్పుడంటే?
SIM Limit India: సిమ్ కార్డులపై ఆగస్టు 24 నుంచి కొత్త రూల్స్ అమలు! ఇకపై ఒక వ్యక్తి ఎన్ని తీసుకోవచ్చు? నకిలీలను ఎలా గుర్తించాలి?
సిమ్ కార్డులపై ఆగస్టు 24 నుంచి కొత్త రూల్స్ అమలు! ఇకపై ఒక వ్యక్తి ఎన్ని తీసుకోవచ్చు? నకిలీలను ఎలా గుర్తించాలి?
Defected MLAs Congress Status: బీఆర్ఎస్ వీడి కాంగ్రెస్ లో చేరి తప్పు చేశామా? ఫిరాయింపు ఎమ్మెల్యేల తీవ్ర నైరాశ్యం.. పార్టీ మారిన గులాబీ నేతల భవిష్యత్తు ఏమవుతుంది?
బీఆర్ఎస్ వీడి కాంగ్రెస్ లో చేరి తప్పు చేశామా? ఫిరాయింపు ఎమ్మెల్యేల తీవ్ర నైరాశ్యం.. పార్టీ మారిన గులాబీ నేతల భవిష్యత్తు ఏమవుతుంది?
Brahmanandam : బ్రహ్మానందంపై అన్నయ్య ప్రశంసలు - హాస్య బ్రహ్మ రియాక్ట్ అయ్యారా?... వైరల్ వీడియోలో నిజం ఏంటంటే!
బ్రహ్మానందంపై అన్నయ్య ప్రశంసలు - హాస్య బ్రహ్మ రియాక్ట్ అయ్యారా?... వైరల్ వీడియోలో నిజం ఏంటంటే!
Embed widget