అన్వేషించండి

Meghasandesam Serial Today October 16th: ‘మేఘసందేశం’ సీరియల్‌:  శరత్‌ చంద్రకు స్నానం చేయించిన భూమి – అపూర్వకు వార్నింగ్‌ ఇచ్చిన ప్రసాద్‌

Meghasandesam Today Episode:   అపూర్వ, శారదకు గుండు కొట్టిస్తుంటే ప్రసాద్‌ అడ్డుపడి శారదను తీసుకుని వెళ్లిపోతాడు. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ చాలా ఆసక్తిగా జరిగింది.   

Meghasandesam Serial Today Episode:  గుడి దగ్గరకు వచ్చిన శారదకు బలవంతంగా అపూర్వ గుండు కొట్టిస్తుంటే ప్రసాద్‌ వచ్చి అడ్డుపడతాడు. శారద తన దగ్గరకు తీసుకుని ఓదారుస్తాడు. అపూర్వ కోపంగా కృష్ణప్రసాద్‌ అంటూ అరుస్తుంది. దీంతో కృష్ణప్రసాద్‌ కోపంగా అపూర్వను తిడతాడు. మనిసిని మాత్రమే మీరా లాక్కెళ్లింది కానీ మనసు తన దగ్గరే ఉందని చెప్తాడు. శారదే నా భార్య.. నా భార్యను అవమానించినందుకు మిమ్మల్ని మీ ఇంటిని వెలివేస్తున్నాను. ఇక నుంచి మీకు నాకు ఎటువంటి సంబంధం లేదు. అంటూ తేగేసి చెప్తాడు. దీంతో మీరా, అపూర్వ షాక్‌ అవుతారు.

మీరా: అలా మాట్లాడకండి నాకు ఏడుపు వస్తుంది.

ప్రసాద్‌: నీకు ఈ మాట అంటేనే ఏడుపొస్తుంటే.. ఇప్పుడు మీరు చేసిన అవమానానికి తనేం అయిపోవాలి. చెప్పు..చిన్న ఇంట్లో ఉన్నప్నుడే సంతోషంగా ఉన్నాను. మీ మేడల్లోకి వచ్చాకే నాకు మనఃశాంతి లేకుండా పోయింది. మీరా నీ జీవితంలోకి వచ్చి నేను సంపాదించిన దానికంటే పోగొట్టుకున్నదే ఎక్కువ.

   అని చెప్పి శారదను తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోతాడు ప్రసాద్‌. మరోవైపు శరత్‌చంద్రకు కొత్త బట్టలు తీసుకొచ్చానని భూమి చెప్పడంతో శరత్ చంద్ర ఎమోషనల్‌ అవుతాడు. ఇంట్లో నేను అందరి గురించి పట్టించుకుంటే నువ్వు నన్ను పట్టించుకున్నావా? అంటాడు శరత్‌ చంద్ర.  అంతే కాదు మీకు నలుగుపెట్టి స్నానం చేయిస్తాను అని తీసుకెళ్లి శరత్‌ చంద్రకు స్నానం చేయిస్తుంది భూమి.

నక్షత్ర: అదేంటి డాడీకి స్నానం చేయిస్తుంది.

బామ్మ: తండ్రికి బిడ్డ సేవ చేయడం తప్పు కాదు కదా అమ్మా..

నక్షత్ర: ఎవరు తండ్రి..? ఎవరు బిడ్డ.. ఆయన మా డాడీ.. అది వెళ్లి స్నానం చేయిస్తుంటే.. మీరెలా చూస్తూ ఊరుకుంటారు.

చెర్రి: మామయ్యే మాట్లాడకుండా వెళ్లి కూర్చుంటే మధ్యలో మేము వెళితే వద్దు అని అన్నామనుకో.. ముందు మమ్మల్ని తంతాడు.

నక్షత్ర: మిమ్మల్ని తంతాడేమో.. మా డాడీ నన్ను తన్నడు కదా?

బామ్మ: కళ్లముందు ఏదైనా మంచి విషయం జరుగుతుంటే అది చెడగొట్టేంత వరకు ఈ తల్లీ కూతుళ్ల మనసు ఊరుకోదు కదా?

చెర్రి: కరెక్టు..

భూమి: నాన్నా అయిల్‌ అయిపోయింది. నేను వెళ్లి ఆయిల్‌ తీసుకొస్తాను.

నక్షత్ర: మా డాడీకి నువ్వు స్నానం చేయించడం ఏంటి?  

భూమి: నాకు నాన్ననే..

నక్షత్ర: ఏంటి…?

భూమి: అదే నాకు నాన్నలాంటి వారే కదా అంటున్నాను.

నక్షత్ర: మా డాడీ దగ్గర మార్కులు కొట్టేయాలని చూస్తున్నావా?

భూమి: పెద్దవాళ్ల దగ్గర పిల్లుల ఆశించాల్సింది.. ఆశీస్సులు మాత్రమే..

నక్షత్ర: ఈ మాటలతో మా డాడీని మోసం చేయగలవేమో.. నన్ను మోసం చేయలేవు.

భూమి: అవతల స్నానం చేయించాలి నీతో తర్వాత మాట్లాడతాను.

నక్షత్ర: నువ్వు స్నానం చేయించడం కాదు. మా డాడీకి నేనే స్నానం చేయిస్తాను.

అనుకుంటూ  శరత్‌ చంద్ర దగ్గరకు వెళ్తుంది.

నక్షత్ర: డాడీ నీకు నేనే స్నానం  చేయిస్తాను.

శరత్‌: నువ్వా నీకు ఇవన్నీ తెలుసా అమ్మా..

నక్షత్ర: ఎందుకు తెలియదు డాడీ. చూడండి ఆ భూమి కంటే బాగా చేయిస్తాను. ఒళ్లు రుద్దింది కానీ కళ్లల్లో నువ్వుల నూనె వేస్తే కళ్లు క్లియర్‌ అవుతాయి. తనకు తెలియదు.

శరత్‌: నీకు తెలుసా..?

నక్షత్ర: ఎస్‌ చూడండి.. అయిల్‌ వేసిన కాసేపటికి కళ్లు అప్పుడే తుడిచిన అద్దంలా అవుతాయి.

 అని పక్కనే ఉన్న ఆయిల్‌ శరత్‌ చంద్ర కళ్లలో వేస్తుంది. దీంతో శరత్‌ చంద్ర మంట మంట అంటూ అరుస్తాడు. నక్షత్ర ఏమైంది డాడీ అంటుంది. ఇంతలో భూమి పరుగెత్తుకొచ్చి శరత్‌ చంద్ర కళ్లు తుడుస్తుంది. తలను నీళ్లలో ముంచమని చెప్తుంది. తర్వాత శరత్‌ చంద్రను రెడీ చేసి కొత్త బట్టలు ఇస్తుంది. ఆ బట్టలు వేసుకున్న శరత్ చంద్ర ఎమోషనల్‌ అవుతుంటాడు. భూమే మన బిడ్డ అయితే బాగుండు అని శోభాచంద్ర ఫోటో ముందు నిలబడి చెప్తుంటాడు. అంతా వింటున్న భూమి ఏడుస్తుంది.  ఇంతలో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.  

ALSO READ:  ‘ప్రేమ ఎంత మధురం’ సీరియల్‌: నిజం తెలుసుకున్న అభయ్‌ – ఓకేసారి

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Skill Case : స్కిల్ కేసులో చంద్రబాబు ఈడీ క్లీన్ చిట్ ఇచ్చినట్లే - జగన్ హయాంలో పెట్టింది తప్పుడు కేసు అని తేలిపోయిందా ?
స్కిల్ కేసులో చంద్రబాబు ఈడీ క్లీన్ చిట్ ఇచ్చినట్లే - జగన్ హయాంలో పెట్టింది తప్పుడు కేసు అని తేలిపోయిందా ?
Revanth Reddy : ఇందిరమ్మ కమిటీలతో క్షేత్ర స్థాయికి కాంగ్రెస్ - పార్టీ బలోపేతానికి రేవంత్ మాస్టర్ ప్లాన్ !
ఇందిరమ్మ కమిటీలతో క్షేత్ర స్థాయికి కాంగ్రెస్ - పార్టీ బలోపేతానికి రేవంత్ మాస్టర్ ప్లాన్ !
Rains in AP, Telangana: వాయుగుండం ప్రభావంతో ఏపీలో సీమ జిల్లాల్లో భారీ వర్షాలు, తెలంగాణలో కొనసాగుతున్న ఎల్లో వార్నింగ్
వాయుగుండం ప్రభావంతో ఏపీలో సీమ జిల్లాల్లో భారీ వర్షాలు, తెలంగాణలో కొనసాగుతున్న ఎల్లో వార్నింగ్
KTR FIR News: ఉట్నూర్ పోలీస్ స్టేషన్ లో కేటీఆర్ పై కేసు నమోదు
ఉట్నూర్ పోలీస్ స్టేషన్ లో కేటీఆర్ పై కేసు నమోదు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Maoist Nambala Keshava Rao Village | మావోయిస్టు దాడులు ఎక్కడ జరిగినా వినిపించే పేరు | ABP DesamIndian Navy VLF Station: నేవీ VLF స్టేషన్ అంటే ఏంటి? వికారాబాద్‌ అడవుల్లోనే ఎందుకు?కెనడా మరో పాకిస్థాన్‌గా మారుతోందా, ఇండియాతో ఎందుకీ కయ్యం?చెన్నైలో కుండపోత, భారీ వర్షాలతో నీట మునిగిన నగరం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Skill Case : స్కిల్ కేసులో చంద్రబాబు ఈడీ క్లీన్ చిట్ ఇచ్చినట్లే - జగన్ హయాంలో పెట్టింది తప్పుడు కేసు అని తేలిపోయిందా ?
స్కిల్ కేసులో చంద్రబాబు ఈడీ క్లీన్ చిట్ ఇచ్చినట్లే - జగన్ హయాంలో పెట్టింది తప్పుడు కేసు అని తేలిపోయిందా ?
Revanth Reddy : ఇందిరమ్మ కమిటీలతో క్షేత్ర స్థాయికి కాంగ్రెస్ - పార్టీ బలోపేతానికి రేవంత్ మాస్టర్ ప్లాన్ !
ఇందిరమ్మ కమిటీలతో క్షేత్ర స్థాయికి కాంగ్రెస్ - పార్టీ బలోపేతానికి రేవంత్ మాస్టర్ ప్లాన్ !
Rains in AP, Telangana: వాయుగుండం ప్రభావంతో ఏపీలో సీమ జిల్లాల్లో భారీ వర్షాలు, తెలంగాణలో కొనసాగుతున్న ఎల్లో వార్నింగ్
వాయుగుండం ప్రభావంతో ఏపీలో సీమ జిల్లాల్లో భారీ వర్షాలు, తెలంగాణలో కొనసాగుతున్న ఎల్లో వార్నింగ్
KTR FIR News: ఉట్నూర్ పోలీస్ స్టేషన్ లో కేటీఆర్ పై కేసు నమోదు
ఉట్నూర్ పోలీస్ స్టేషన్ లో కేటీఆర్ పై కేసు నమోదు
Nambala Keshava Rao: మావోయిస్టు దాడులు ఎక్కడ జరిగినా వినిపించే తెలుగోడి పేరు, కుగ్రామం నుంచి జాతీయ స్థాయికి
మావోయిస్టు దాడులు ఎక్కడ జరిగినా వినిపించే తెలుగోడి పేరు, కుగ్రామం నుంచి జాతీయ స్థాయికి
Viral News: బెంగళూరును వణికిస్తున్న వర్షాలు- వాటర్ పార్కుల్లా మారిన టెక్ పార్కులు, రేపు స్కూళ్లకు సెలవులు
బెంగళూరును వణికిస్తున్న వర్షాలు- వాటర్ పార్కుల్లా మారిన టెక్ పార్కులు, రేపు స్కూళ్లకు సెలవులు
Rashmika Mandanna : సైబర్ కేటుగాళ్లకు ఇక చుక్కలే, 14C ఇండియన్‌ సైబర్‌ క్రైమ్‌ కోఆర్డినేషన్‌ సెంటర్‌కు బ్రాండ్‌ అంబాసిడర్‌ గా రష్మిక 
సైబర్ కేటుగాళ్లకు ఇక చుక్కలే, 14C ఇండియన్‌ సైబర్‌ క్రైమ్‌ కోఆర్డినేషన్‌ సెంటర్‌కు బ్రాండ్‌ అంబాసిడర్‌ గా రష్మిక 
Priyanka Gandhi:  వయనాడ్ నుంచి ఎన్నికల బరిలోకి ప్రియాంక గాంధీ, కాంగ్రెస్ అధిష్టానం ప్రకటన
వయనాడ్ నుంచి ఎన్నికల బరిలోకి ప్రియాంక గాంధీ, కాంగ్రెస్ అధిష్టానం ప్రకటన
Embed widget