Meghasandesam Serial Today October 10th: ‘మేఘసందేశం’ సీరియల్: కేపీని చూపించిన రత్న – కోపంతో కొట్టిన శరత్ చంద్ర
Meghasandesam serial today episode October 10th: ఎస్సైని చంపమని తనకు కేపీ చెప్పాడని రత్న చెప్పగానే ఇవాళ్టీ ఏపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది.

Meghasandesam Serial Today Episode: శరత్ చంద్ర ఇంటికి వచ్చిన రత్న ఏసీపీ సూర్య పట్టకుని ఇదంతా ట్రాప్ నిన్ను ట్రాప్ చేశాం. నీ వెనకుండి నడిపిస్తున్న అసలు నేరస్తున్ని పట్టుకోవడానికి ఇదంతా చేశామని చెప్పగానే అపూర్వ షాక్ అవుతుంది. తన పేరు చెప్పొద్దని సైగ చేస్తుంది. సూర్య కోపంగా రత్నను చూస్తుంటాడు.
సూర్య: చెప్పు మా అన్నయ్యను చంపమని నీకు ఎవరు సుపారీ ఇచ్చారు. చెప్పు నిజం చెప్పు రత్న నువ్వు వాళ్లెవరో నిజం చెప్పి వాళ్లను పట్టిస్తే నీకు పడే శిక్ష కూడా తగ్గుతుంది. ఆలోచించుకో వాళ్ల కోసం నీ జీవితం పాడుచేసుకోకు
అంటూ సూర్య చెప్తుంటే.. అపూర్వ మాత్రం చెప్పొద్దని సైగ చేస్తుంది. ఇంతలో శరత్ చంద్ర కోపంగా రత్నను తిడతాడు.
శరత్: ఈ ఇంట్లో నేను పాలు పోసి పెంచిన పాము ఎవరో తెలసుకోవాలని ఉంది చెప్పమ్మా..? నన్ను నమ్మించి నమ్మకద్రోహం చేసిన ఆ వ్యక్తి ఎవరో చెప్పమ్మా..? లేదంటే నిన్ను ఇక్కడే చంపేస్తాను.. చెప్పు..
అంటూ శరత్ చంద్ర వార్నింగ్ ఇవ్వగానే.... రత్న చేయి ఎత్తి అపూర్వ వైపు చూపిస్తుంది. అందరూ షాక్ అవుతారు. కేపీ నవ్వుతుంటాడు. ఇంతలో రత్న తన చేతిని కేపీ వైపు తిప్పుతుంది. దీంతో కేపీ కోపంగా రత్నను తిడతాడు.
కేపీ: ఏయ్ నా వైపు వేలు చూపిస్తున్నావేంటి..? నువ్వెవరో కూడా నాకు తెలియదు.. సార్ ఈవిడ నేను చూడటం ఇప్పుడే.. తనెవరో నాకు తెలియదు సార్.. ఇది కావాలనే నన్ను చూపిస్తుంది. ఏయ్ నిజం చెప్పు అసలు నీ వెనక ఉన్నదెవరో చెప్పు..
రత్న: అదేంటయ్యా అలా మాట్లాడుతున్నారు. ఎస్సై గారిని చంపమని మీరే కదా నాకు డబ్బులు ఇచ్చారు. ఈ విషయం ఎవ్వరికీ చెప్పొద్దని చెబితే నన్ను కూడ ఎవరితోనైనా చంపిస్తానని చెప్పారు కదా..? ఆ రౌడీ మొన్న నన్ను చంపడానికి వస్తుంటే.. నేను పారిపోతుంటే ఈ సార్ కు దొరికిపోయాను. ఇప్పుడు మాట మార్చకండి సార్..
కేపీ: ఏయ్ ఏం మాట్లాడుతున్నావు.. సార్ ఈవిడ చెప్పేది నమ్మకండి.. అంతా అబద్దం చెప్తుంది.
అంటూ కేపీ చెప్తుండగానే కోపంతో ఊగిపోతున్న శరత్ చంద్ర ఒక్కసారిగా కేపీ మీదకు వెళ్తాడు.
శరత్: యూ ఈడియట్.. ఎంతకు తెగించావురా..? నాకు ముందు నుంచి నీ మీద అనుమానమే.. ఇప్పుడు రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయాక కూడా కప్పిపుచ్చుకోవాలని చూస్తున్నావా..?
అంటూ కేపీని శరత్ చంద్ర ఈడ్చి ఈడ్చి కొడుతుంటాడు. చెర్రి అడ్డు వెళ్తే చెర్రిని కూడా కొడతాడు. ఇంతలో అపూర్వ అడ్డు వెళ్తుంది. కోపంగా కేపీని చూస్తూ శరత్ చంద్రను మరింత రెచ్చగొడుతుంది.
అపూర్వ: నాకు ఇప్పుడు అర్థం అవుతుంది. మీరాను పెళ్లి చేసుకోవడానికి కన్నా ముందే నీకు పెళ్లి అయిపోయిందన్న నిజం నా శోభాచంద్ర అక్కకు తెలిసిందనే నువ్వు మా అక్కను చంపేశావు కదా..? నీ నిజాలు బయటపడతాయనే ఆ ఎస్సని చంపిచావు కదా…? సైలెంట్‌గా ఉండే నీ వ్యక్తిత్వం వెనక ఇంత దుర్మార్గుడు ఉన్నాడా..?
అంటూ అపూర్వ తిడుతుంటే కేపీ షాక్ అవుతాడు. ఇంతలో పోలీసులు వస్తారు.
శరత్: వెంటనే వీడిని ఇక్కడి నుంచి తీసుకెళ్లండి.. చేసిన తప్పుకు శిక్ష పడేలా చేయండి
అంటూ శరత్ చంద్ర చెప్పగానే.. పోలీసులు కేపీని తీసుకెళ్తారు. ఇంతలో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!





















