Meghasandesam Serial Today May 23rd: ‘మేఘసందేశం’ సీరియల్: గగన్, భూమిల పెళ్లి చేస్తానన్న శరత్‌చంద్ర – షాక్‌లో పడిపోయిన నక్షత్ర
Meghasandesam Today Episode: ఇంట్లో అందరినీ పిలిచి భూమి పెళ్లి గగన్‌తో చేయడానికి నిర్ణయించుకున్నానని శరత్ చంద్ర చెప్పడంతో ఇవాళ్టీ ఏపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది.

Meghasandesam Serial Today Episode : గగన్ ఫుల్లుగా తాగి ఇంటికి వస్తాడు. కారులోనే గేటు ముందు అలాగే పడిపోయి ఉంటాడు. ఉదయం గగన్ ను అలా చూసిన శారద ఏడుస్తూ చెర్రిని పిలుస్తుంది. చెర్రి పరుగెత్తుకొస్తాడు. అందరూ కలిసి గగన్‌ను లోపలికి తీసుకెళ్తారు. శారద ఏడుస్తూ ఎందుకు ఇలా చేశావని అడుగుతుంది.
గగన్: భూమి వస్తానని చెప్పి ఎప్పటిలాగే మరోసారి మాట తప్పింది అమ్మా. నాకు ఒకటి అర్థం అయింది అమ్మ. ఇంటిని మగాడు వదిలేసిన కుటుంబం అంటే సొసైటీకే కాదు ప్రేమించిన అమ్మాయి కూడా చులకనే. ప్రేమించడానికి ఓకే కానీ ఈ ఇంటికి కోడలుగా రావడానికి నాట్ ఓకే.
శారద: గగన్.. ఏంట్రా..
గగన్: సొసైటీ నన్ను ఎలా చూసినా ఓకే.. నాకేంటి.. నాకు అమ్మ ఉంది. చెల్లి ఉంది. తమ్ముడు ఉన్నాడు. నేను ఎప్పుడూ ఒక హీరోను అనుకునే వాడిని. కానీ నేనొక జీరోను అయిపోయానని నాకు ఇప్పుడే అర్థం అవుతుంది అమ్మ
శారద: ఎవరు మనతో ఉన్నా లేకపోయినా నువ్వు మాత్రం మాకు హీరోవేరా.
గగన్: లేదమ్మా.. నేను హీరోను కాదు. జీరోను కాదు. అంతకంటే తక్కువే అమ్మా..
అంటూ గగన్ పైకి వెళ్లిపోతాడు. శారద ఏడుస్తుంది. చెర్రి కోపంగా ఇంటికి వెళ్లి భూమిని తిడతాడు.
భూమి: ఏమైంది చెర్రి..
చెర్రి: చెప్పు..
భూమి: అరే ఏమైంది అని అడుగుతున్నాను కదా..?
చెర్రి: అడుగుతావు ఏమైంది చెర్రి అని బాగానే అడుగుతావు. కానీ రాత్రి అన్నయ్యతో ఎందుకు వెళ్లలేదు.
భూమి: నాన్న ప్రాణం ప్రమాదంలో ఉంది చెర్రి అందుకే వెళ్లలేకపోయాను.
చెర్రి: ఓహో మీ నాన్న ప్రాణాలకు బదులు మా అన్నయ్య ప్రాణాలు తీయాలనుకున్నావా..?
భూమి: అలా మాట్లాడతావేంటి చెర్రి. నేను ఆయన్ని ప్రాణంగా ప్రేమించానని నీకు తెలియదా..?
చెర్రి: జస్ట్ షటప్.. ప్రాణంగా ప్రేమించాను అంటావు. చేయి పట్టుకుని నడవాల్సిన టైం వచ్చినప్పుడు మా నాన్నే ముఖ్యం అంటావు. ఎన్ని సార్లు మా అన్నయ్యను మోసం చేస్తావు.
భూమి: అలా మాట్లాడకు చెర్రి. పరిస్థితులు నా కాళ్లు కట్టేస్తుంటే నేనేం చేయను.
చెర్రి: మాట్లాడొద్దు.. మాట్లాడొద్దని చెప్పాను కదా..? అసలు ఆడపిల్లలు అంటేనే పడని మా అన్నయ్య.. పెళ్లే చేసుకోనని భీష్మించుకు కూర్చున్న మా అన్నయ్య పోయి పోయి నిన్న ప్రేమించాడు చూడు. అదే తను చేసుకున్న పాపం.
అంటూ చెర్రి తిట్టి వెళ్లిపోతాడు. భూమి ఏడుస్తుంది. గగన్ పరిస్థితి చూడలేక భూమి కోసం శారద శరత్ చంద్ర వాళ్ల ఇంటికి వెళ్తుంది. భూమిని గగన్‌కు ఇచ్చి పెళ్లి చేయమని అడుగుతుంది. దానికి అపూర్వ.. కృష్ణ ప్రసాద్‌కు విడాకులు ఇస్తే భూమిని గగన్‌కు ఇస్తామని కండీషన్ పెడుతుంది. శారద ఏడుస్తూ సరే అంటూ ఒప్పుకుంటుంది. మరుసటి రోజు శరత్ చంద్ర అందర్ని పిలుస్తాడు. పని మనిషిని స్వీట్లు తీసుకొచ్చి అందరికీ పంచమని చెప్తాడు. స్వీట్లు పంచాక శరత్ చంద్ర కూడా భూమికి స్వీటు తినిపిస్తాడు.
శరత్: భూమికి పెళ్లి చేయాలనుకుంటున్నాను.
అపూర్వ: ఎవరా సంబంధం..?
శరత్: నా కూతురు భూమి ప్రాణంగా ప్రేమిస్తున్న గగన్.
నక్షత్ర షాక్ అవుతుంది. చేతిలో స్వీట్లు కింద పడేస్తుంది. భూమి ఎమోషనల్ అవుతుంది.
భూమి: మీరు పెళ్లి చేస్తా అంటుంది. గగన్ గారితో ..
శరత్: నీ ఈ కంటతడి చూడలేకే ఎంత దిగాలో అంత దిగి నా బద్ద శత్రువైన గగన్‌తో నీ పెళ్లి చేయడానికి నిర్ణయించుకున్నాను
అని శరత్ చంద్ర చెప్పగానే.. భూమి ఏడుస్తూ హగ్ చేసుకుంటుంది. కృష్ణప్రసాద్ హ్యపీగా ఫీలవుతాడు. మరోవైపు ఇంటికి వెళ్లిన శారద విషయం గగన్‌కు చెప్పి ఓదారుస్తుంది. ఇంతటితో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!





















