Meghasandesam Serial Today May 17th: ‘మేఘసందేశం’ సీరియల్: భూమిని ఆగిపోమన్న శరత్ చంద్ర – గగన్‌తో వెళ్లిపోయిన భూమి
Meghasandesam Today Episode: బ్యాగ్ సర్దుకుని గగన్‌తో వెళ్లిపోతున్న భూమిని శరత్‌చంద్ర ఆపినా ఆగకుండా వెళ్లిపోతుంది. దీంతో ఇవాళ్టీ ఏపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది.

Meghasandesam Serial Today Episode : గగన్ దగ్గరకు వచ్చిన భూమి కృష్ణ ప్రసాద్ వీడియో తీసి మనల్ని విడదీసేందుకు ప్రయత్నం చేస్తుందని చెప్తుంది. అయితే ఆ కృష్ణ ప్రసాద్ కలుపుతాడనో లేకపోతే అపూర్వ విడదీస్తుందనో మనం ప్రేమించుకోలేదని గగన్ చెప్తాడు.
గగన్: ఒకరితో ఒకరం జీవితాంతం కలిసి ఉండాలనే ఆశతో మనం ప్రేమించుకున్నాం. నువ్వు అనుకున్నట్టు మంచికో.. నేను అనుకున్నట్టు చెడుకో మనం పెళ్లి చేసుకుందాం.
భూమి: ఎలా అండి ఇప్పటికిప్పుడు మా నాన్నను ఎలా ఒప్పిస్తారు.
గగన్: భూమి నువ్వు ప్రేమిస్తుంది నన్ను.. నువ్వు పెళ్లి చేసుకోవాల్సింది నన్ను.. మధ్యలో మీ నాన్నను ఒప్పించాల్సిన అవసరం ఏమీ మనకు లేదు భూమి. ఇద్దరం ఎక్కడికైనా దూరంగా వెళ్లిపోయి పెళ్లి చేసుకుందాం. అక్కడ మన పెళ్లిని రిజిస్టర్ చేసుకుందాం.
భూమి: అంటే మనం లేచిపోదాం అంటున్నారా..?
గగన్: దానికి నువ్వు పేరు ఏదైనా పెట్టు భూమి.. ఇక్కడే ఉండి అందరికీ చెప్పి పెళ్లి చేసుకుందాం అంటే అది అయ్యేలా లేదు. ఏదో ఒక ఆటంకం వస్తూనే ఉంది.
భూమి: మా నాన్న ఏ పరిస్థితుల్లో ఉన్నారో మీకు తెలుసు..?
గగన్: ఇంకేం చెప్పొద్దు భూమి..నువ్వు తిరిగి వచ్చేంత వరకు మీ నాన్నకు ఏం కాకుండా..? నేను జాగ్రత్త తీసుకుంటాను. నీకు నా మీద నమ్మకం ఉందా..?
భూమి: మిమ్మల్ని కాక ఇంకెవరిని నమ్మగలను అండి.. కాకపోతే మనం దూరంగా వెళ్లి పెళ్లి చేసుకోవాలన్న ఆలోచనే నాకు నచ్చడం లేదు.
గగన్: మీ నాన్నకు ఏమైనా అవుతుందని భయపడుతున్నావా..? ఒకవేళ నాకు ఏదైనా అయితే..
భూమి: ఏంటండి ఇలా మాట్లాడుతున్నారు.
గగన్: జస్ట్ అనుకోమన్నాను.. మన పెళ్లి జరగకుండానే ఒకవేళ నేను చచ్చిపోతే..
భూమి: అయ్యో ఎందుకండి ఇలాంటి మాటలు మాట్లాడి నన్ను ఏడిపించాలి అనుకుంటున్నారు..
అని ఇద్దరూ కలిసి మాట్లాడుకోవడం దూరం నుంచి కారులో వెళ్తూ శరత్ చంద్ర చూస్తాడు. చాటు నుంచి దగ్గరకు వెళ్తాడు.
గగన్: నిన్ను బాధపెట్టాలని మాట్లతాడటం లేదు భూమి. మన పెళ్లి కాకుండా నేను లోకం నుంచి దూరం అయిపోతే అంతా నిన్ను అసహ్యంగా చూస్తారు. అదే పెళ్లాయ్యాక జరిగితే నిన్ను చూసి అంతా జాలి పడతారు. బాధపడతారు. నీకు కావాల్సినంత గౌరవం కూడా దొరుకుతుంది. అదే ఈ లోకం తీరు. నేను అనుకోకుండా యాక్సిడెంటల్‌గా చనిపోయినా మీ నాన్నే చంపేసి ఉంటారని మీ నాన్న మీద నింద పడుతుంది. అదే ఈ లోకం తీరు. ఫ్లీజ్ భూమి ఒక్కసారి ఆలోచించు..
భూమి: మీ మాటలు నన్ను భయపెడుతున్నా..? మీ మాటల్లో నిజం కూడా ఉందనిపిస్తుంది.
గగన్: అవును భూమి ఎక్కడికైనా దూరంగా వెళ్లి పెళ్లి చేసుకుందాం. చెప్పు భూమి.. నువ్వేం అంటావు.
అంటూ గగన్ అడగడంతో భూమి సరే అంటుంది. అయితే ఇవాళ రాత్రికి మనం వెల్లిపోదాం నేను కారు తీసుకుని మీ ఇంటి దగ్గరకు వస్తాను అని గగన్ చెప్తాడు. సరే అంటుంది భూమి. శరత్ చంద్ర బాధతో అక్కడి నుంచి వెళ్లిపోతాడు. తర్వాత రాత్రికి గగన్ కారేసుకుని శరత్ చంద్ర ఇంటికి వస్తాడు. భూమి బ్యాగ్ తీసుకుని బయటకు వెళ్తుంటే శరత్ చంద్ర చూస్తాడు.
శరత్: భూమి గగన్‌తో వెళ్లిపోతున్నావా..? అమ్మా.. శత్రువుతో లేచిపోయి నా పరువు తీయాలనుకుంటున్నావా..? అమ్మా..
భూమి: ఆయనతో వెళ్లకుండా మీతోనే ఉండిపోమ్మంటారు అంతేనా..?
శరత్: అంతేనమ్మా..
భూమి: నేను మీతో ఉండిపోతే మీరు నా ప్రేమను అర్థం చేసుకుని ఆయనను నాకిచ్చి పెళ్లి చేస్తారా..? నాన్నా..?
శరత్: అది ఈ జన్మలో జరగదు..
భూమి: అలాంటప్పుడు నేను ఏం చేయాలి నాన్నా..? ఆయనకు ఇచ్చి పెళ్లి చేస్తానని మాటిచ్చి నన్ను ఆపండి. లేదా నా దారిన నన్ను వెళ్లనివ్వండి..
అంటూ భూమి వెళ్లిపోతుంటే..శరత్ చంద్ర చేయి పట్టుకుని ఆపేస్తాడు. ఇంతలో గగన్ వచ్చి భూమిని తీసుకుని వెళ్లిపోతాడు. శరత్ చంద్ర బాధపడుతుంటాడు. ఇంతటితో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!





















